25, ఏప్రిల్ 2013, గురువారం

సమస్యాపూరణం – 1034 (శిశుపాలుఁడు ప్రాణదాత)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
శిశుపాలుఁడు ప్రాణదాత శ్రీకృష్ణునకున్.

15 కామెంట్‌లు:

  1. శిశువుల వైద్యుడు చేసెను
    పశుపతి సుతునకు చికిత్స, ప్రాణము పోసెన్
    పశుపతి మ్రొక్కెను వైద్యుడు
    శిశుపాలుఁడు, ప్రాణదాత, శ్రీకృష్ణునకున్.

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఇంత వేగంగా స్పందించినందుకు ముందుగా నా అభినందనలను అందుకోండి.
    శిశుపాలుణ్ణి పిల్లల డాక్టరును చేసారు. బాగుంది.

    రిప్లయితొలగించండి
  3. శిశిరమున బుట్టె నట గద
    శిశుపాలుడు, ప్రాణ దాత శ్రీ కృ ష్ణు నకున్
    నిశ యంత పూజ సేసిన
    అ శనమునకు లోటు లేని హస్తము నిచ్చున్ .

    రిప్లయితొలగించండి
  4. పశుపాలకుడ వనుచు నా
    శిశుపాలుడు, ప్రాణదాత శ్రీకృష్ణునకున్
    నిశితపు దూషణ శతమిడి
    వశమున్ ద్రప్పంగ చక్ర పదునకుఁ గ్రూలెన్!

    రిప్లయితొలగించండి
  5. దశదశముల దోషి యతడు
    శిశుపాలుఁడు; ప్రాణదాత శ్రీకృష్ణునకున్
    వశమునుఁ దప్పి కొలువున న
    పశృతులఁ బల్కగ నుసురును వదలెను గాదే!

    రిప్లయితొలగించండి
  6. మశకసమానుండగు నీ
    శిశుపాలుఁడు, ప్రాణదాత శ్రీకృష్ణునకున్
    నిశితంపుధూషణాదుల
    భృశముగ గావించి ప్రాణ భీతుండయ్యెన్.

    భృశము = ఎక్కువ

    రిప్లయితొలగించండి
  7. నిశినొక్క మద్యపానుడు
    శిశుపాలుడు ప్రాణదాత శ్రీకృష్ణునకున్
    దశకంఠుడాత్మజుండగు
    దశరథనందనునకనియె తన్మయుడగుచున్.

    రిప్లయితొలగించండి
  8. పశువుల గాచెడి బాలుడు
    వశ మయ్యెను పాము కాటు వనముల యందున్ !
    యశమును గోరిన మిత్రుని
    శిశు పాలుడు ప్రాణ దాత శ్రీ కృష్ణునకున్ !

    రిప్లయితొలగించండి
  9. పశువనెనుహరిని చచ్చెను
    శిశుపాలుడు;ప్రాణదాత శ్రీకృష్ణునకున్
    వశులైరి పాండుపుత్రులు
    యశమున్ గొని రాజసూయయాగము నందున్ !!!

    రిప్లయితొలగించండి
  10. మంచి పూరణలను అందించిన కవిమిత్రులు...
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    సహదేవుడు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    మంద పీతాంబర్ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. సుబ్బారావు గారూ ! ధన్యవాదములు.
    నిజమే ! త్వరపాటు లో మొదటి అక్షరము గురువు వేశాను. దానిని తొలగించుచున్నాను.

    రిప్లయితొలగించండి
  12. నిశితముగా పరికించిన
    శిశుపాలుఁడు ప్రాణదాత శ్రీకృష్ణునకున్
    కుశలముగానత్తకొడుకు;
    యశమొందెను చేత జిక్కి
    యమునా తటినిన్!

    రిప్లయితొలగించండి