11, ఏప్రిల్ 2013, గురువారం

పద్య రచన - 308 (ఉగాది)

కవిమిత్రులారా,
విజయ నామ సంవత్సర శుభాకంక్షలు!

నేటి పద్యరచనకు అంశము...
“ఉగాది”

24 కామెంట్‌లు:

  1. సోదర సోదరీ మణులకు పూజ్య గురువులకు పండితులకు అందరికీ ఉగాది శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి
  2. క్రొత్త వత్సర మరుదెంచె కోటి ప్రభల
    పాత జ్ఞాపకముల నన్ని పాత రేసి
    పలుక రించెను కోయిల పులక రించి
    తరులు చిగురించి మురిపించె విరులు కురిసి

    రిప్లయితొలగించండి
  3. గురువర్యులకు, కవి మిత్రులకు, బ్లాగు వీక్షకులకూ
    శ్రీ విజయ నామ సంవత్సర శుభాకాంక్షలు.

    విజయుని సారథి కృపచే
    విజయమ్ముల మాకు నిచ్చి వేడుక గా నీ
    విజయ యను పేరు పోకను
    విజయము గా నిలువు మమ్మ వీడెడు వరకున్.

    రిప్లయితొలగించండి
  4. కం. నందనమున చేసిన పను
    లందముగా ఫలమిడునను ఆశయు గలిగు
    న్నందున విజయపు వత్సర
    మందున యవి ప్రతిఫలించునవిరళ కృషితో.

    రిప్లయితొలగించండి
  5. విజయోత్సవములు జరిగెడు
    ప్రజలెల్లరు సుఖములంది బహుసంపదలన్
    విజయాబ్దమందు గందురు
    నిజమిది శుభమగుత యందు నేనెల్లరకున్.

    రిప్లయితొలగించండి
  6. విజయోత్సవములు జరిగెడు
    ప్రజలందరు సుఖములంది బహుసంపదలన్
    విజయాబ్దమందు గందురు
    నిజమిది శుభమగుత యందు నేనెల్లరకున్.

    రిప్లయితొలగించండి
  7. వ్యాహ్యాళికేతెంచ వాసంతరాయుండు
    ఉల్లాసముల నుర్వి యురకలేయు
    హరితాంబరములూని హరువుల్ల నలరారి
    తమితీర తలలూపు తరులు గిరులు
    మావి వేములు కూర్మి మధురసమ్ములగూడి
    మనుగడ సారమ్ము మనకుదెలుపు
    శుకము శ్రీరస్తంచు శుభవాకములుబల్క
    భావగీతి పికము పాడి మురియు

    ఇలను శాంతి సంతోషమ్ము లిమ్మడించు
    ఎల్ల జీవాళి యుల్లమ్ము లుల్లసిల్లు
    జయము విజయమ్ము జయదిగ్విజయముగాగ
    విజయ నామ వత్సరమొచ్చు ప్రజలకడకు

    రిప్లయితొలగించండి
  8. శంకరాభరణ మిత్రులకు విజయ నామ సంవత్సర శుభా కాంక్షలతో ...

    విజయము నిచ్చును గావుత !
    విజయపు నా వత్సరమ్ము వేవిధములుగాన్
    అజరామరమగు శుభములు
    నిజముగ నిక గలుగు గాక ! నిరతము మీ కున్

    రిప్లయితొలగించండి
  9. వచ్చును నుగాది పండుగ
    అచ్చముగా దెలుగు వారు నానందిం పన్
    పచ్చగ నరువది మారులు
    నిచ్చలు బొంగరము వోలె నియమము తోడన్ .

    రిప్లయితొలగించండి
  10. గురువులకూ, పెద్దలకూ, కవిమిత్రులకూ, తెలుగింటి ఆడపడుచులకూ తెలుగు యుగాది శుభాకాంక్షలు.

    మలయ మారుత వీచి నలుదెసల్ పరికించి
    ............వ్యాహ్యాళి కై లేచి వచ్చె నేడు!
    మాధవీ లత తన్ను మత్తులో ముంచంగ
    ...........క్రొన్ననల్ ధరియించె గున్న మావి!
    లేగొమ్మలన్ జేరి లేజివుళ్ళను మెక్కి
    ...........గొంతును సవరించె కోయిలమ్మ!
    పరువమ్ము పైకొన పైటను సవరించి
    ...........తెల్ల నవ్వులు రువ్వె మల్లి కన్నె!

    పల్లె పట్టులు క్రొం బట్టు పరికిణీల
    దాల్చె!యువతకు మదులలో తాప మాయె!
    విజయముంజేసె నదె భళా విజయ నామ
    వత్సరమ్మాంధ్ర ధాత్రికి వన్నె మీర!

    శ్రేయము నిచ్చు నీ విజయ శ్రీ కర వత్సర మాంధ్ర భూమికిన్
    చేయుడు భక్తి మీరగను శ్రీ రఘు రాముని సేవనమ్ములన్
    హాయిగ సాగు జీవనము లైక్యత మించును తెన్గు నేలపై
    కోయిల మావి వేము చెరకుల్ శుభమిచ్చెడి నెల్లవారికిన్!

    రిప్లయితొలగించండి
  11. సృష్టి ప్రారంభ మెప్పుడో చెప్పలేము
    కారు తొలినాడె మనకు యుగాది యగును
    కొమ్మ చిగురు లెత్తు విధము క్రొత్త వత్స
    రమున కొంగ్రొత్త యాశలు ప్రాభవిల్లు

    రిప్లయితొలగించండి
  12. శ్రీపండిత నేమాని గురువులకుశ్రీ శంకరార్యులకు శ్రీఏల్చూరి వారికి నమస్సులతో
    శంకరాభరణ కవిమిత్రులకు బ్లాగువీక్షకులకు “ విజయ” నామ ఉగాది శుభాకాంక్షలతో

    శంకరాభరణమ్మున చతురమతులు
    హృద్య పద్యము లల్లుచు హర్షమిచ్చు
    పండిత కవులకు వీక్షక పఠితలకును
    “విజయ” వత్సరమన్నిట విజయమిడుత.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ శంకరయ్య గురువులకు ,కవిపండితులకు పాఠకులకు విజయనామ సంవత్సర శుభాకాంక్షలు

    జనవాణి వినలేని ఘనమైన ప్రభువాణి
    మననౌనె మననేల మహిన జూడ
    ఘనరీతి యవినీతి జనరీతి కడుభీతి
    విధివ్రాత తలవాత విధము లవియె
    కనలేము కొనలేము తినలేము మనలేము
    ధర లేమొ పైపైకి తరలి పోయె
    వత్సరములు మారె !మత్సరమ్ము లవియె
    జనుల జీవితములు జటిలమాయె

    ప్రజల పీడించు విధములు ప్రబలి పోయె
    మార్పు రాదాయె పాలక మాన్యులందు
    కలలు గనుటలో కాలమ్ము కరిగి పోయె
    వెలుగులొలికించు ఘనమైన "విజయ" మిచ్చి

    రిప్లయితొలగించండి
  14. ఉగాది వేళ...

    లేత మామిళ్ళతో వేప పూతఁ గలిపి
    చెఱకు తీపికి పుల్లని చింత జేర్చి యుప్పు కారమ్ము తగుపాల్ల నొప్పి యుండు
    నీ యుగాది ప్రసాదంబు నాయు వీయ
    కాలమిట్టిదనుచు కోయిలాల పించు!

    (కాలము షడ్రుచుల సమ్మేళనమని కోయిల పాడుతుందన్న భావంతో)

    రిప్లయితొలగించండి
  15. వసంత తిలకము

    కో యంచు పాడెనదె కోయిల; హాయి నిండెన్
    మా యందమైన శుక మందుకొనంగ తోడై;
    లే యందగాడ! యిక లెమ్మనె నా వసంతున్,
    నా యందమందుమని నవ్య వనమ్ము పూచెన్.

    అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మిత్రుల పద్యాలు, వాటిలో ఆదిభట్ల వారి, మిస్సన్న గారి పద్యాలు కొత్త లేత మామిడాకుల వలె మెరుస్తున్నాయి.

    రిప్లయితొలగించండి
  16. విజయము నిచ్చునుగాదియు
    సుజనులకెల్లరకు నిరత శుభములనిచ్చున్
    నిజమనంబు వసంతము
    త్యజియింపగ ద్వేష బుద్ధి, త్యాగముఁ బూయున్.

    రిప్లయితొలగించండి
  17. రమ్ము మహాశయా విజయ ! రమ్ము ఫలించెను జూడుమా రసా
    లమ్ము ; పికమ్ములొక్కెడ గళమ్ములనెత్తి కుహూ కుహూ స్వరా
    లిమ్ముగ గూయుచుండినవి ; యించుక జేరగ రమ్ము మా కుటీ
    రమ్మిక మల్లె పువ్వుల సరమ్ముల గంధి నలంకరించెదన్ ---- రమ్ము మహాశయా విజయ రమ్ము !

    నందన వత్సరమ్మొకటి నశ్వరమై గతియించినంత మా
    ముందుకు వచ్చి నిల్చితివి మోదముతో విజయా ! కృపా సుధా
    బిందువులొల్క నీ భువిని బ్రీతిగ బ్రోచెదొ ? కాలకూటమున్
    జిందుచు కాటు వైచెదవొ నిర్ఘృణ భీకర దందశూకమై ?

    పాలక వర్గమ్ము బంధు ప్రీతిని వీడి
    సేవా నిరతి తోడ జెలగవలయు ;
    నధికారి సంచయ మ్మలసత్వమును దక్కి
    నీతికి నెలవుగా నిలువవలయు ;
    వర్తకవ్రజము వ్యాపాదమ్ము విడనాడి
    న్యాయ మార్గంబున నడువవలయు ;
    దేశ జనాళి విద్వేషమ్ము బోనాడి
    స్థిర విజయమ్ము సాధింపవలయు ;

    నపుడె నీ పేరు నిలుచు నీ యవని పయిన
    నపుడె వెలుగొందు నీ విజయధ్వజమ్ము !
    ఫలితమేముండు పది పైన పదునొకండు
    వోలె నరుదెంచి యేగిన నో యుగాది !

    రిప్లయితొలగించండి
  18. లక్ష్మీ దేవిగారూ! మీ వసంత తిలకం వాసంత కోకిలా కూజితంలా మధుర నాదాన్ని వినిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  19. డా. విష్ణు నందనుల వారి వసంత విజయునికి స్వాగతం హృద్యంగా భాసిస్తోంది.

    రిప్లయితొలగించండి
  20. గురువులు శ్రీ కంది శంకరయ్య గారికి, శ్రీ నేమాని వర్యులకు, శ్రీ ఏల్చూరి వారికి మరియునితర కవి మిత్రులకు శ్రీ విజయ నామ వత్సర ఉగాది శుభాకాంక్షలు.

    ఋతుకాలములునెల్ల గతితప్పబోకుండ
    ప్రకటించఁజూడు తత్ప్రభవమెసఁగ
    ధర్మైకనిష్ఠాపథమ్మునన్ వెల్గొంద
    జేయుమీ నాయక శ్రేష్థతతులఁ
    నరివీరసైన్యాళి నంతమొందగఁజేసి
    సుఖశాంతు లెనయించఁ జూడుమమ్మ
    కాయకష్టముచేత కలిమి సాధించంగ
    కార్యధూర్వహత సంకల్పమిమ్మ

    పరుల సేవావిధాన సంప్రజ్ఞనొసఁగు
    రాజశేఖరునందనురక్తినిమ్ము
    సర్వ శుభములు వెలయించు నుర్వి యందు
    విజయ వత్సరమా నీకు వేల నుతులు.

    రిప్లయితొలగించండి
  21. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
    ఉ|| స్వాగతమో సమాగత సువత్సర కాల కుమారయంచు, నీ
    యాగమనమ్ము కోరి హృదయమ్మును కోవెలరీతి జేసి, పు
    న్నాగవరాళిలో వర సునాదవినోద సరాగ రంజికా
    రాగమునూది పల్కె మది రంజిల కోయిల గున్నమావిపై.

    చం|| అరుదుగ వచ్చితీవు నిలనర్వది వత్సరముల్ గతించె, నీ
    దరిశన భాగ్యమబ్బకను, ధన్యులమైతిమి నీదురాకచే
    మురిపెముతోడ నీ మృదుల పుణ్యకరమ్మున నాశిషావళుల్
    ధరపయి గ్రుమ్మరించి వసుధన్ విజయుండవుకమ్ము నిమ్మెయిన్!

    ఉ|| కాలమనంగ దైవతము కాలము గాయపు నౌషధంబగున్
    కాలమనంతవాహిని సుఖంబును కష్టములారుపాళ్ళుగా
    మేలగు షడ్రసోభరిత మేలిరసాయనమందజేయునో
    కాలస్వరూప! శ్రీవిజయ! కామితదాయక! నీకు మ్రొక్కెదన్.

    మ|| ఋతుషట్కంబులనేల వచ్చిన మహోత్కృష్ట ప్రభారాశి! నీ
    యతులైశ్వర్య కృపాకటాక్షముల నత్యంత ప్రమోదమ్ముతో
    క్షితిసంవాసుల మీద జూపి గొనుమా! కీర్తి ప్రశంశోన్నతుల్
    గతగాయంబులు మాన్పగా తగినదీ కాలంబు శేయస్కరా!

    ఉ|| చందన చర్చతోడ విరజాజుల వీవనలందు కాలమా!
    వందనమయ్య నీకు సురవందిత క్షాత్రముమీర మేదినీ
    స్యందనవాసివై కుటిల చర్య నియంతవు నౌచు ధర్మ సం
    స్పందన బాదుగొల్పి పరిపాలన చేయుము నీదు బిడ్డలన్

    శా|| శ్రీమంతంబయి పండుగాక! పృధివిన్ స్నేహార్ద్రతా భావముల్
    సామంతంబయి నిండుగాక! సుమనోసామ్రాజ్యముల్; పాలితుల్
    సీమంతంబగుగాక! సృష్టి; సమతా శ్రీసస్యకేదారమై
    హేమంతంబగుగాక! నీదు విజయశ్రీనామ కాలంబిలన్!

    రిప్లయితొలగించండి
  22. శ్రీ మిస్సన్న గారికి బహుధా ధన్యవాదాలతో , మీ పంక్తి ' కోయిల మావి వేము చెరకుల్ శుభమిచ్చెడి నెల్లవారికిన్ ' రమణీయం గా , వినగానే సరసుల తలలూపు నేర్పున విలసిల్లుతోన్నది .

    రిప్లయితొలగించండి
  23. అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ, ‘ఉగాది’ కవితలు చెప్పిన మిత్రులు.....
    రాజేశ్వరి అక్కయ్యకు,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    మారెళ్ళ వామన కుమార్ గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారికి,
    సుబ్బారావు గారికి,
    మిస్సన్న గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    మంద పీతాంబర్ గారికి,
    సహదేవుడు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    డా. విష్ణునందన్ గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    పింగళి వేంకట శ్రీనివాసరావు (శ్రీ కాశ్యప) గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. సమస్యాపూరణం
    -----------
    ఉదయము సంధ్యవేళయన నుడ్వుచుముప్పది పాశురాలనన్
    వ్రతమునుబూని విష్ణువును భక్తిగపూజలుపుష్య మాసమున్
    హృదయముతోటి దీక్షగను గృధ్యములేకయు చేయుసేవలో
    నిదురను మున్గువారలకు నిశ్చలసంపదలబ్బు నెన్నగాన్!

    రిప్లయితొలగించండి