12, ఏప్రిల్ 2013, శుక్రవారం

పద్య రచన - 309 (సినీవాలి)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“సినీవాలి”

15 కామెంట్‌లు:

  1. మాతృగరిమ పొగడ మాతరమెట్లగు
    నమ్మ పేరులెన్నొ యంతు లేదు;
    నామ సూచి యందున గల సినీవాలి
    యమ్మ పేరు గానె యనగ వింటి.

    రిప్లయితొలగించండి
  2. చంద్రకళ ఉన్న అమావాస్య అని కూడా అర్థమున్ననూ యద్దానిని నిరూపించుట తెలియదు.

    రిప్లయితొలగించండి
  3. కనబడి కనబడ నట్లుగ
    కనుపించెడు చంద్ర రేఖ కన నమవాస్యన్
    ఘన హరుని పత్ని పేరును
    కనగ ' సినీవాలి ' యనగ కంగారేలా ?

    రిప్లయితొలగించండి
  4. చంద్రరేఖ దోచు యమాస, చర్మముండ
    యనెడు యర్థములను జూపు మినుకు యిదియె
    వ్రాసె నారుద్ర పొత్తము వాసికెక్క
    దాని పేరె ‘సినీవాలి ' తలచుకొనగ

    రిప్లయితొలగించండి
  5. చంద్ర కళను గూడి చల్లగ నుండియు
    అమవస దరి దాటి యామని యయి
    నియ మ నిష్ఠ గల ,సి నీ వాలిగ భువిని
    మాత యయ్యి మాకు మమత బంచె .

    రిప్లయితొలగించండి
  6. సినీవాలి...........

    పదముఁ జూడగ తత్తర బడితినేను
    వివిధ తెఱఁగుల నర్థంబు వెదకిజూడ
    విష్ణుపత్నిగ ప్రకటించె వేదమొకటి
    క్రొత్త పదమొక్కటఱుదెంచె కూర్పునందు.

    రిప్లయితొలగించండి
  7. శివుని యర్ధాంగి పేరట సినీ వాలి
    చంద్ర కళలను పరికించ చక్క దనము
    ఆరుద్ర సినీ వాలి రచన యంద మేను
    అమవస కళలు సూచించు ననగ శశియె

    ఎలాగో కష్ట పడి కిట్టించా ఎన్ని..... తప్పులో ....మరి ?

    రిప్లయితొలగించండి
  8. నిగనిగల భస్మ ధారికి
    సిగలో జాబిల్లి కైన సింగారమనన్
    సగము సినీ వాలి వెలసి
    యగనితమౌ దీప్తులొసగ నందిన వరమే!

    రిప్లయితొలగించండి
  9. శ్రీమతి లక్ష్మీదేవి గారికి,

    శుక్లపక్షానికి ముందు వచ్చే అమావాస్య నాడు వెన్నెల తొలి వెలుగురేకతో చంద్రుడు లీలగా కానవచ్చినప్పుడు (దృష్టేన్దుః) “సినీవాలి” అని; అమావాస్యనాడు చంద్రకళ అసలు ఏ మాత్రం కానరానట్లయితే (నష్టేన్దుః) “కుహువు” అని; శుక్లపక్ష చతుర్దశి నాటి రాత్రి చంద్రుడు ఒక కళ తక్కువగా ఉన్నప్పుడు “అనుమతి” అని; చతుర్దశి వేధ లేకుండా వచ్చే శుక్లపక్ష పౌర్ణమి నాటి నిండు వెలుగుకు “రాకా” అని పేర్లు.

    వీరు నలుగురు బ్రహ్మమానసపుత్త్రులలో ఒకడైన అంగిరో మహర్షికి స్మృతియందు జన్మించిన కుమార్తెలని విష్ణుపురాణ కథనం.

    కనబడీ కనబడనిది కాబట్టి సినీవాలికి “దృశ్యాదృశ్య” అనికూడా పేరున్నది. సినీవాలిని గుఱించి మహాభారతం, భరతుని నాట్యశాస్త్రం పరమశివుని నుదుటిపై అలంకారం (లలాటిక) అని వర్ణించాయి. త్రిపురాసుర సంహారవేళ పరమశివుడు సినీవాలిని తన రథానికి ఇరుసుగా నిలుపుకొన్నాడని ఒక కథ. ఆ ఇరుసును గుఱించి వేర్వేఱు కథలున్నాయి.

    కుమారస్వామి జన్మించినపుడు చూడవచ్చిన వారిలో సినీవాలి ఉన్నదని శల్యపర్వం.

    అథర్వవేదం సినీవాలిని విష్ణుపత్ని గానూ; శివపురాణం సినీవాలి దుర్గామూర్తి కావటం వల్ల శివకుటుంబీని గానూ వర్ణించాయి.

    ఆరుద్ర గారి “సినీవాలి” కావ్యంలో మఱొక రకపు ఆధునిక రూపకల్పన ఉన్నది, చూడండి.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  10. డా. ఏల్చూరి వారికి సమగ్ర వివరణ ఇచ్చినందులకు ధన్యవాదాలు. ఈ నాటి యువతరం ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయమిది. సినీవాలి అంటే బాలీవుడ్డా, హాలివుడ్డా అని అడిగినవారిని నేనెరుగుదును:-)

    రిప్లయితొలగించండి
  11. సినీవాలి ని గూర్చి సమగ్రమైన వివరణ గావించిన శ్రీ ఏల్చూరిగారికి శతథా ధన్యవాదాలు. ఈరోజు ఒక కొత్త పదాన్ని నేర్చుకొన్నట్లయింది.

    రిప్లయితొలగించండి
  12. నమస్కారములు
    గౌరవ నీయు లైన శ్రీ ఏల్పూరి వారి వివరణ శ్లాఘ నీయం ధన్య వాదములు

    రిప్లయితొలగించండి




  13. బహుళపక్షము నందమావాస్య నాడు
    కనియు కనిపించదా చంద్రకళను బేరు
    కొందురు ' సినీవాలి 'గా గొమరు మీర
    వ్రాసె ' నారుద్ర ' కావ్యమ్ము వ్యంగ్యరీతి.

    ' సినీవాలి 'అనగా సినిమాకి సంబంధించిన వ్యక్తి గా కూడా చెప్పుకొని ,పద్యరచన చెయ్యొచ్చును.

    రిప్లయితొలగించండి
  14. అయ్యా,
    శ్రద్ధతో వివరించిన మీకు అనేకానేక ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  15. సినీవాలిని గురించి మంచి పద్యాలను చెప్పిన కవిమిత్రులు...
    లక్ష్మీదేవి గారికి,
    గోలి హనమచ్ఛాస్త్రి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    సుబ్బారావు గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    సహదేవుడు గారికి,
    కమనీయం గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    సినీవాలిని గురించిన వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి