17, ఏప్రిల్ 2013, బుధవారం

పద్య రచన - 314 (వార్ధక్యము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“వార్ధక్యము”

9 కామెంట్‌లు:

  1. వ్యర్ధపు భాషణ జేయక
    స్వార్ధమ్మది లేక కలసి సరిగానుండన్
    స్పర్ధల వదల కుటుంబము
    వార్ధక్యము గడచి పోవు వగపే లేకన్.

    రిప్లయితొలగించండి

  2. వార్ధక్యమున అయ్యవారలు
    బ్లాగు పూర్ణమ్మను బెండ్లాడ
    వారె, ధక్, పూర్ణమ్మ శోభించె
    పంచదశ లోక పుత్తడి బొమ్మయై !



    జిలేబి.

    రిప్లయితొలగించండి
  3. పరగ ముసలి తనము వార్ధక్య మనబడు
    కళ్ళు కనబడవుగ , కాళ్ళు నడువ
    లేవు చెవులు విన బడవు ముక్కు కారును
    బ్రదుకు కంటె మేలు మరణ మార్య !


    రిప్లయితొలగించండి
  4. వార్ధక్యమును జూడ ద్వారమౌ నీ భూమి
    ....వీడుచు పైపైకి వెడలు నపుడు
    గడచెను మెండుగా కాలమ్ము మిగిలిన
    ....ఆయువు కడు దక్కువయ్యె నయ్య!
    బంధాలు చింతలు బాధ్యతల్ రోగముల్
    ....చీకాకులను గూర్చు చిత్తములకు
    వడలును దేహమ్ము సడలు పటుత్వంబు
    ....మృతిని గూర్చి భయమ్ము మిక్కుటమగు
    దినము గడచుట కష్టమ్ము కనరు వినరు
    తనదు దుస్థితి నితరులు, తనకు సాయ
    పడెడు వాడొక్క దైవమే, వాని దలచి
    ముదముతో మనుటొప్పగు ముసలివారు

    రిప్లయితొలగించండి
  5. తనదు కాయమ్ము జెప్పిన వినదు మాట
    ముసలి వారంచు ప్రతివారు మూల జూప
    నిత్య దేవతారాధన నిష్ట తోడి
    సంఘ సేవయే నందించు సంత సమ్మ!

    రిప్లయితొలగించండి
  6. ఈస డింపులు కసురులు విసురు లనగ
    విలువ నీయరు తనయులు కలల నైన
    ధనము మిగిలిన దోచుకు తినగ నెంచి
    వ్యార్ద్ధక్య మందు బ్రతుకన వ్యర్ద్ధ మేను !

    రిప్లయితొలగించండి
  7. పిల్ల లందరు దేశాలు వలస బోయి
    గగన సీమల దేలుచు భోగ మందు
    వృద్ధులై పోవ తలిదండ్రి వ్యర్ద్ధ మనుచు
    మరచి పోయిరి సుఖముల మైక మందు

    రిప్లయితొలగించండి
  8. దయచేసి ప్రతి వ్యాక్య కి లైక్ బటన్ యాడ్ చేయండి. ఎందుకంటె చాలా మంది చదివి నచ్చిన వాక్యకి లైక్ కొడతారు

    రిప్లయితొలగించండి
  9. వార్ధక్యాన్ని గురించి మంచి పద్యాలను రచించిన కవిమిత్రులు...
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    పండిత నేమాని వారికి,
    సహదేవుడు గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    అమ్మా జిలేబీ,
    వార్ధక్యంలో పాణిగ్రహణం చేసినా బ్లాగు పూర్ణమ్మ మాత్రం నాతో ఈ మూడు సంవత్సరాలుగా సంతోషంగా కాపురం చేస్తున్నదని నమ్ముతున్నాను. నన్ను చేసుకున్న పూర్ణమ్మ సంప్రదాయాన్ని గౌరవిస్తుంది కదా!
    *
    9919929934 గారూ,
    మీ సూచన అనుసరణీయమే. ధన్యవాదాలు. కాని దానిని ఎలా జోడించాలో తెలియదు. దయచేసి వివరించండి.

    రిప్లయితొలగించండి