29, ఏప్రిల్ 2013, సోమవారం

పద్య రచన - 326 (గోంగూర పచ్చడి)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“గోంగూర పచ్చడి”

18 కామెంట్‌లు:

  1. ఆంధ్ర మాతగ పేరున్న యాకు కూర
    ఉల్లి పాయను కలుపగా నొల్ల ననరు
    నూనె గోంగూర గా చేయ నోరునూరు
    ఆంధ్రు డెట్లౌను తినకున్న యంధుడేను.

    రిప్లయితొలగించండి
  2. కంటికి నదురుగ నుండును
    వంటికి శక్తిని యొసగును వండుట తగునే
    ఇంటిని యైనను నాటిన
    వెంటనె గోంగూర పెరుగు వినవే బాలా!

    రిప్లయితొలగించండి
  3. మాన్చ్చి ఘాటుగా పెట్టారుగా నూనెగోంగూరలో తిరగమోత శాస్త్రిగారూ. అద్దిరిందిఫో. గుంటూరు వాళ్ళని పించారు మొత్తానికి :-)

    రిప్లయితొలగించండి
  4. ‘పిశుపాటి చిదంబర శాస్త్రి గారి పద్యము’
    సీ.
    ఇది మహాలేహ్యమం చెదలోన భావించి
    చక్కగా హూణులు మొక్కుచుండ
    ఇది ప్రాణపదమంచు నెదలోన భావించి
    భారతీయులు భద్రపఱుచుచుండ
    ఇది మహానిధి యంచు నెదలోన భావించి
    యన్యదేశస్థు లల్లాడుచుండ
    ఇది వర్ణనీయమం చెదలోన భావించి
    కవులు వర్ణన సేయ గడగుచుండ
    తే.గీ.
    ఆన్ని వ్యంజనములలోన వన్నెకెక్కి
    కుండలో మాగియుండిన గోగుకూర
    పచ్చడి వెలింగెడిని నొకపఱిని దానిఁ
    దినిన నాతన సౌఖ్యంబు దేవుఁ డెఱుఁగు.
    (‘అవధాన విద్య’ గ్రంథమునుండి)

    రిప్లయితొలగించండి
  5. శంకరార్యా ! బాగా మాగిన (పాత) గోంగూర పచ్చడిని రుచి చూపించారు. బాగుంది. చంద్ర శేఖర్ గారూ ! నేను చేసిన పచ్చడి రుచి బాగుందని చెప్పినందులకు ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  6. చిన్న సవరణ తో...

    ఆంధ్ర మాతగ పేరున్న యాకు కూర
    ఉల్లి కలుపుచు నూరగా నొల్ల ననరు
    నూనె గోంగూర వేయించ నోరునూరు
    నోరు కాదది తినకున్న నొట్టి " బోరు ".

    రిప్లయితొలగించండి
  7. ఆకు కూర యని అలుసుగా చూడకు
    శాఖంబరీ దేవి దివ్య పప్రసాదమది
    ఒక పరి గోంగూర పచ్చడి, ఉల్లి కలిపి తిన్న
    యిక మారు మాట రాదు, తల్లి తోడు

    రిప్లయితొలగించండి
  8. పచ్చడి లన్నిటి గంటెను
    యిచ్చం బగు పచ్చ డిదియ యెవరికి నైనన్
    పచ్చటి గోం గూ రాకులు
    అచ్చముగా మెత్త రుబ్బి హత్తుము పోపున్ .


    రిప్లయితొలగించండి
  9. టి.యం. రవీంద్ర గారూ,
    మీ భావానికి నా పద్యరూపం.....

    కొద్దిగాఁ జూడవల దాకుకూర యనుచు
    నమ్ము శాకంబరీ ప్రసాద మ్మిదియట,
    యుల్లితోఁ గల్పి తిన్నచో యుల్ల మలర
    జేయు గోంగూర పచ్చడి, శిష్టజనులు
    వల్లె యని మెచ్చుకొందురు తల్లితోడు

    రిప్లయితొలగించండి
  10. యింగిలీసు వారు హైబిస్కస్ కన్నాబినస్ అని పిలిచెదరు
    గోంగూర పత్ర రాజమని యెరుగరు,గోంగూర పచ్చడి,వుల్లి
    సంగమము చేసి అన్నమందు కలిపారగించినపుడదియె
    రంగ రంగ వైభోగమని తిన్న వారికె తెలియు తత్ మహిమ

    రిప్లయితొలగించండి
  11. అట్లతద్ది పర్వ మాడపిల్లలు తిందు
    రుట్టి క్రింది ముద్ద నూర నోళ్ళు
    పెరుగు బువ్వ లోన భేషైన గోంగూర
    వ్యంజనమ్ము, నుల్లి పాయ పులుసు.

    రిప్లయితొలగించండి
  12. గురువుగారూ శ్రీ చిదంబర శాస్త్రి గారి పద్యం మాంచి రుచిగా ఉంది.

    రిప్లయితొలగించండి
  13. తాండ్రపాపారాయుడు...

    చొంగలు కార్చుచు నోటిన
    గోంగూరను పచ్చడట్లు కోరుచు తిని తా
    సంగర మందున దూకన్
    బెంగపడిన శత్రు సేన బెబ్బులి యనరే!

    రిప్లయితొలగించండి
  14. పొంగారు రుచులు మెండుగ
    గోంగూర యందు కలవని కోరుచు తినగా !
    రంగారు పండు మిరపను
    బెంగయె లేకుండ కలుప భేషుగ నుండున్ 1

    రిప్లయితొలగించండి



  15. గోంగూర తోడ చవులూ
    రంగా, చట్నీని జేసి రంజుగ భుజియిం
    పంగా ,నన్నము ,నూనెయు
    మాంగాయయు తోడుగాగ మరి చెప్పవలెన్!

    రిప్లయితొలగించండి
  16. శ్రీపండితనేమాని గురువులకు నమస్సులతో

    ద్వివిధ వర్ణ పత్రములతో తింత్రిణీక
    రుచిని పప్పు పులుసు లందు రుచ్యమగుచు
    నుల్లితో నూనె దట్టింప నుప్పతిల్లు
    నప్డు గోంగూర పచ్చడి యన్నమందు
    కలిపి తిన నాకలోకమె కందువోయి!

    రిప్లయితొలగించండి
  17. అన్నా! మిస్సన్నా! 43 సంవత్సరాలు వెనుకకు తీసికెళ్ళి
    పల్లెటూరిలో అక్కచెల్లెళ్ళ వలె కలసిమెలసి పంచుకొన్న ఆనందాల్నిగుర్తుచేసారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. mee padyalu chala chala bagunnayi.. nenu maa avakaya group lo post chesukuntunnanu ..
    మన తెలుగు ప్రజలకు ఆవకాయ ఎంత ప్రీతి కరమైనదో గొంగూర కు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు
    అందుకే అంటారు గొంగూర ఆంధ్ర మాట అయితే ఆవకాయ ఆంధ్ర పిత అని
    sahityam bagundi..

    రిప్లయితొలగించండి