30, ఏప్రిల్ 2013, మంగళవారం

పద్య రచన - 327 (చీపురు కట్ట)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“చీపురు కట్ట”

14 కామెంట్‌లు:

  1. మొత్తము పేరుకు పోయిన
    చెత్తను తొలగించు నీకు జేజే లమ్మా !
    మెత్తని చీపురు కట్టా !
    హత్తెరి మా ' మూల ' ధనము హా హా నీవే !

    రిప్లయితొలగించండి
  2. కొప్పరపు సోదరుల పద్యము....
    సీ.
    మలినంబు బాపి నిర్మలత జూపుట జేసి
    యల్ల గంగాదేవి యనఁగవచ్చు
    నఖిల ప్రదేశములందు దోచుట జేసి
    యల పరమాత్మయే యనఁగవచ్చు
    నిత్యాభిషేకంబు నెమ్మి గాంచుట జేసి
    యల జలస్థిత లింగ మనఁగవచ్చు
    స్త్రీ కరగ్రహణము చెలిమి నందుట జేసి
    యల పురుషోత్తముఁ డనఁగవచ్చు
    తే.గీ.
    ననుచు నెట్టెట్టొ పొగడఁగా నయ్యెగాదె
    యదియు సింగారపుంగట్ట యనుటఁ జేసి
    కాక యద్దాని జీపురుకట్ట యనిన
    నింతగా వర్ణనము సేయ నెవఁడు దలఁచు.

    శ్రీ పిశుపాటి వారి పద్యము....
    శృంగారపుగట్టా! నిను
    బంగారపుగట్ట వనుచుఁ బలికెద, లేకు
    న్నం గడు బుణ్యాత్ములు బలె
    నంగనల కరాంబుజంబులం దాడుదువే?
    (‘అవధాన విద్య’ గ్రంథమునుండి)

    రిప్లయితొలగించండి
  3. మూల నున్న కట్ట మూర్కొను నేలంత
    కీర్తి గాంచు నూడ్చి గేహ మంత
    తరుణి యాయుధమ్ము ధరణి చీపురుకట్ట
    స్త్రీల చేతి తొడవు ! చేటు పెఱల !

    రిప్లయితొలగించండి
  4. చీ పురు కట్టలు సేతురు
    సాపుగ మఱి యీ నె తీ సి సమమగు సైజున్
    చీ పురు లూ డ్చును గదులను
    బాపురె యిది లేని యిల్లు వమ్ముయె సుమ్మీ !

    రిప్లయితొలగించండి
  5. చీపురు కట్టలు గొనుటకు
    రేపున నే బోదు నికను రేపల్లెకునున్
    ఏపుగ నుండును నచ్చట
    మాపటి వేళగును నాకు మరలుట నచట న్

    రిప్లయితొలగించండి
  6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ మీ మూల ధనం "చీపురు కట్ట" మెచ్చుకోలు పద్యం బాగుంది.

    మొత్తము పేరుకు పోయిన
    చెత్తను తొలగించు నీకు జేజే లమ్మా !
    మెత్తని చీపురు కట్టా !
    హత్తెరి మా ' మూల ' ధనము హా హా నీవే !"

    రిప్లయితొలగించండి
  7. చీపురు పర్యావరణపు
    కాపై! గృహసీమ మట్టి కల్లముఁ గాకుం
    డాపెడు సాధన మిలలో
    మాపును తానట్టి, శుభ్ర మన్నది యొసగున్!

    రిప్లయితొలగించండి
  8. అంగనల హస్త భూషణ
    ముంగిళ్ళను శుభ్ర పఱచి ముగ్గులు నింపన్ !!
    శృంగారపు కట్ట యనుచు
    పొంగారెడు సిరుల నిడగ పొంగును గృహముల్ !

    రిప్లయితొలగించండి
  9. రాజేశ్వరి నేదునూరి గారూ --- వావ్!
    అంగనల హస్త భూషణ
    ముంగిళ్ళను శుభ్ర పఱచి ముగ్గులు నింపన్ !!

    రిప్లయితొలగించండి
  10. శ్రీపండితనేమాని గురువులకు నమస్సులతో

    లక్ష్మి రాకను గోరి య లక్ష్మి పోవ
    నుపక రించెడి సాధన మూడ్చు టకును
    మాట వినని మగని యందు మగువలగుచు
    సూర్యకాంత ఛాయాదేవి చూపె మహిమ
    చీపురి పురివిప్పుచునంత చిత్ర మందు.

    రిప్లయితొలగించండి





  11. చీపురే యంచు నననేల ఛీ యటంచు
    పరిసరమ్ముల బరిశుభ్ర పరచు, గృహిణి
    చేతి యాయుధమ్మును గూడ చెలగినపుడు
    పనికిరాని వస్తువు లేదు ప్రకృతి యందు.

    రిప్లయితొలగించండి
  12. ‘కాదేదీ కవిత కనర్హం’ అన్నట్టు చీపురుకట్టను ‘చీపు’గా చూడక, చక్కని పద్యములను రచించిన కవిమిత్రులు...
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    సుబ్బారావు గారికి,
    సహదేవుడు గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    కమనీయం గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    చీపురు కట్ట యటంచును
    ‘చీపు’గ చూడక రచించి చిక్కని భావం
    బేపారు పద్యముల నా
    కీ పట్టున ముదము గూర్చి రివె వందనముల్.

    రిప్లయితొలగించండి