10, ఏప్రిల్ 2013, బుధవారం

పద్య రచన - 307

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“అభయ హస్తము”

11 కామెంట్‌లు:

  1. మాలిమి తోడ నన్నుఁ గని మాయలలోకమునందు వైచినన్,
    మేలిమి ప్రీతిఁజూపు; నను మిన్నగ గాచెడు రామచంద్రుడే,
    లీలగ నేలు, రామునికి లెస్సగఁ జేతును వందనమ్ము; నా
    పాలిటి కష్టమెల్ల నిక బాపెను దా, నభయంపు హస్తమై.

    రిప్లయితొలగించండి
  2. వెల్గె కైలాస శిఖరమ్ము నాల్గు దిశల
    మ్రోగ ఢమరుక ధ్వనులంత ముజ్జగముల
    నటన మాడెను నటరాజు జటలు కదల
    అభయ హస్త మభినయపు హస్తమయ్యె

    రిప్లయితొలగించండి
  3. విశ్వ గురుడగు సాయిని వేడు కొనిన
    కనిక రించుచు దప్పక గరుణ తోడ
    అభయ హస్తము జూపును నాక్ష ణ మున
    బాధ తొలగును నిజమను భవ ము నాది .

    రిప్లయితొలగించండి
  4. కలిమి బలిమి యొసగు కలియుగదైవంబు
    వేంకటేశ్వరుండు విశ్వమునకు
    నభయహస్త మెప్పు డందించుచుండంగ
    భయము నందనేల? భక్తకోటి.

    రిప్లయితొలగించండి
  5. కోపము తాపమున్ తగని కోరిక బొంకును దూకుడున్ పటా
    టోపము మోసమున్ సుజన దూషణ యీ ర్ష్య లసూయలాదిగా
    లోపములన్ని నామనము లోనికి జేరగనీయ బోకుమా
    యాపద లార్పగా నభయ హస్తము నీయవె వేంకటేశ్వరా !!!

    రిప్లయితొలగించండి






  6. కరుణ గురిపించు గలువల కన్నులందు,
    నభయమిచ్చును దక్షిణహస్తమందు,
    వరదముద్రను బట్టెను వామహస్త
    మందు నాయంబికామాత యదియె కనుమ.

    రిప్లయితొలగించండి
  7. అభయ హస్తమ్మ మాది మాదని పలువురు
    పాద యాత్రలఁ జేయుచు పలుకు చుండ
    కాచునెవరో? తమను పట్టి దోచు నెవరొ?
    మారి భస్మాసురుల వలె మాడ్చు నెవరొ?
    దిక్కు తోచక జనులకు తిక్క రేగి
    దిమ్మతిరిగెడు తీర్పీయ తేల్చిరేమొ?

    రిప్లయితొలగించండి
  8. భయమును బడుచును మరి ' ని
    ర్భయలా ' మన పడుచు లెల్ల బాధల బడక
    న్నభయపు ' హస్తము' తో ని
    ర్భయులై తిరుగాడు రోజు వచ్చే దెపుడో !

    రిప్లయితొలగించండి
  9. వెఱ్ఱి శివుడిచ్చె వరమంచు విఱ్ఱ వీగి
    అభయ హస్తము నిక్కమౌ విభవ మెంచ
    తెలుసు కొనగోరి యసురుడు తెలివి యనుచు
    తనదు కరమును శిరముపై తాకి మలిగె !

    రిప్లయితొలగించండి
  10. ‘అభయహస్త’మన్న అంశంపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
    లక్ష్మీదేవి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    సుబ్బారావు గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    మంద పీతాంబర్ గారికి,
    కమనీయం గారికి,
    సహదేవుడు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    నేదునూరి రాజేశ్వరి అక్కయ్యకు
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి