గన్నవరపు నరసింహ మూర్తి గారు తమ జ్యేష్టపుత్రుడు చిరంజీవి భార్గవ నారాయణమూర్తికి, చిరంజీవి సౌభాగ్యవతి పరిగె హారిక ( శ్రీ పరిగె లక్ష్మీ నరసింహ సుధాకర్ ,శ్రీమతి లక్ష్మీ సుందరిల ఏకైక కుమార్తె )తో వివాహ నిశ్చయము జరిగినదని. వివాహ ఉత్సవము అక్టోబరు 12 వ తేదీన శనివారము ఉదయము శాన్ హోసే ,కాలిఫోర్నియా రాష్ట్రములో జరుగుతుందని తెలియజేసారు. సంతోషం.
వారికి నా శుభాకాంక్షలు.
శ్రీరస్తని 'గన్నవరపు
నారాయణ మూర్తి'ని శుభనాముని మోదం
బారగ దీవింతు 'పరిగె
హారతిఁ' జేపట్టు వరుఁడునై శోభిల్లన్.
గన్నవరపు వంశమ్మున
నెన్నఁగ నరసింహ మూర్తి! హిత సద్గుణ సం
పన్నుఁడవు, నీ కుమారుని
చెన్నగు కళ్యాణ వార్త నిదె చెప్పితివే!
మంచి వార్తఁ దెలిపి మా మనంబులను రం
జింపఁ జేసినాఁడ వీ దినమున,
నయ సుగుణ నిధాన! నరసింహ మూర్తి! మీ
కెల్లరకు శుభంబు లీశుఁ డిడుత!
కంది శంకరయ్య