16, జూన్ 2013, ఆదివారం

నేమాని వారికి శుభాకాంక్షలు!

పండిత నేమాని వారికి పౌత్రోదయము

శ్రీమాన్ పండిత నేమాని వారు  తమ చిన్న కుమారుడు చి. నందకిశోర్ మరియు చి.సౌ. పావని దంపతులకు (అమెరికా - న్యూజెర్సిలో)  వంశోద్ధారకుడగు సుపుత్రుడు జననమొందినాడను శుభవార్తను తెలియజేసినారు. 

 పండిత నేమాని వారికి, నందకిశోర్, పావని దంపతులకు శుభాకాంక్షలు!
చి. పండిత నేమాని ‘చిన’ రామజోగి సన్యాసి రావుకు శుభాశీస్సులు. 

13 కామెంట్‌లు:

  1. శ్రీ శంకరయ్య గారికి శుభాశీస్సులు.
    మా మనుమనికి "సత్య శ్రీవిభు" అని నామకరణము జేయ నుత్సహించుచున్నారు. స్వస్తి
    నేమాని రామజోగి సన్యాసి రావు

    రిప్లయితొలగించండి
  2. గురుతుల్యులు పండిత నేమాని వారికి పౌత్రోదయ శుభాకాంక్షలు.

    నేమాని, భవద్గృహ జన
    కామిత శుభ వరము, కమ్ర కాంచన ఫలమౌ,
    ప్రేమాంకిత సుమ తనువౌ
    ప్రాముఖ్య సుపౌత్ర జనన వందన శతముల్.

    రిప్లయితొలగించండి
  3. పండితుల వారికి వారి కుటుంబానికి శుభాభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. పూజ్యనీయులు అన్నయ్యగారికి మనుమడు జన్మించిన శుభ సమయమున వారికి ,చిరంజీవి నందకిశోర్ గారికి, చిరంజీవి సౌభాగ్యవతి పావని గారికి అభినందనలు. బుల్లి మనుమనికి శుభాశీస్సులు.

    రిప్లయితొలగించండి
  5. శ్రీపండితనేమాని గురువులకు నమస్సులతో
    వంశాభివృద్ధి నొందుచు పౌత్రుని గాంచిన బ్రహ్మశ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసిరావు పుణ్యదంపతులకు, చి.శ్రీ నందకిశోర పావని దంపతులకు అభినందనలు. చి. సత్యశ్రీవిభుకు ఆశీస్సులతో
    పావన చరితు “నందకిశోర” “పావని”కిని
    “సత్యశ్రీవిభు” జనియించి సంతసమున
    “పండిత” గురు “నేమాని”కి పౌత్రుడగుచు
    తాత తండ్రుల ధీ కీర్తి తనరు గాత!

    రిప్లయితొలగించండి
  6. శ్రీపండితనేమాని గురువులకు నమస్సులతో
    వంశాభివృద్ధి నొందుచు పౌత్రుని గాంచిన బ్రహ్మశ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసిరావు పుణ్యదంపతులకు, చి.శ్రీ నందకిశోర పావని దంపతులకు అభినందనలు. చి. సత్యశ్రీవిభుకు ఆశీస్సులతో
    పావన చరితు “నందకిశోర” “పావని”కిని
    “సత్యశ్రీవిభు” జనియించి సంతసమున
    “పండిత” గురు “నేమాని”కి పౌత్రుడగుచు
    తాత తండ్రుల ధీ కీర్తి తనరు గాత!

    రిప్లయితొలగించండి
  7. గురువు గారికి ధన్యవాదములు
    తండ్రుల దినోత్సవమున పౌత్రుని గాంచి తండ్రియైన శ్రీ నందకిశోర పావని దంపతులకు అభినందనలు.
    బ్రహ్మశ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసిరావు పుణ్యదంపతులకు, గురువర్యులకు,బ్లాగు వీక్షకులందరికీ తండ్రుల దినోత్సవమున శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని వారికి పౌత్రోదయ వార్తకు స్పందించి శుభాకాంక్షలు తెలిపిన మిత్రులు....
    గుండు మధుసూదన్ గారికి,
    సుబ్బారావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    వరప్రసాద్ గారికి,
    జిగురు సత్యనారాయణ గారికి
    ...................... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. నేమాని పండితార్యులకు శుభాకాంక్షలు.
    మీకు పౌత్రోదయ మైనందుకు చాలా సంతోషంగా ఉంది.
    మాతా శిశువులు కుశలమని తలుస్తున్నాము.


    రిప్లయితొలగించండి
  10. నమస్కారములు
    ఇంత మంచి శుభ వారత విని పించిన పూజ్య గురువుల కుటుంబ సభ్యు లందరికి హృదయ పూర్వక శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి
  11. మన మలరగ మన మిత్రులు
    మనుమని కాశీస్సులిడిరి, మాన్యు లయిన వా
    రిని వినుతించుచు మోద
    మ్మును దెలుపుచునుంటి మిగుల ముచ్చట పడుచున్

    రిప్లయితొలగించండి