11, జూన్ 2013, మంగళవారం

పద్య రచన - 369

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. అన్నపూర్ణలు నన్నదాతలు నాదరాన పొలమ్ములో
    సన్నయమ్ముగ నాట్లు వేయుచు సంతసమ్మున బొంగుచున్
    వన్నె చిన్నెల నొల్కబోయుచు బాడుచుండిరి గీతముల్
    చిన్ని కృష్ణుని సన్నుతించుచు చిత్తమారగ నత్తరిన్

    రిప్లయితొలగించండి
  2. చిత్ర మయ్యది జూడుడు చిత్ర మందు
    నాటు చుండిరి వరిపైరు నడుము వంచి
    అన్నదాతలు వీ రలె యంద రకును
    చూడ చక్కటి దృశ్యము చూపరులకు

    రిప్లయితొలగించండి
  3. నాట్లప్పుడు పాడే పాట రూపంలో స్రగ్విణి..

    నాకమే భూమియౌ, నాటవే మొక్కలన్
    సాకు పోకెందుకే చాలు చాలించవే
    నీకు నాకియ్యదే నింపునే బొజ్జలన్
    పాకలన్ నింపగా భాగ్యమౌ నెల్లెడన్.

    రిప్లయితొలగించండి
  4. అవనీమాతకునాప్తులై బ్రజకు నిత్యాహార కార్యార్థులై
    జవసత్త్వంబుల తోడ భూరిజము సస్యంబౌటగాఁజేసి మా
    ధవచింతామృతభక్తిగానముల సంధానించి ప్రహ్లాదులై
    స్తవనీయంబగు వృత్తినందుగల క్షేత్రాజీవి ధన్యుండహో!

    రిప్లయితొలగించండి
  5. శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారి పద్యము మంచి ధారాశుద్ధి కలిగి యున్నది. అభినందనలు. ధన్యుండహో అని పుల్లింగముతో సమాప్తి చేసేరు. స్త్రీమూర్తుల గురించి ప్రస్తావన లేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. వంటలు వార్చెడు వారలె!
    పంటలు పండించుచోట వంగెడు వారే!
    యింటిని దీర్చెడు నింతులె!
    మింటిని తారకలె! జాతి మెచ్చదె వారిన్!

    రిప్లయితొలగించండి
  7. గురుదేవులు శ్రీ నేమాని వారికి నమస్సులు.

    స్త్రీ లింగ ప్రస్తావన లేనిమాట నిజమే. అందులోనూ చిత్రములో కేవలము స్త్రీలే ఉన్నారు కూడా.

    "స్తవనీయంబగు వృత్తినందుగల క్షేత్రాజీవితం ధన్యమౌ!"

    అని సవరిస్తే సరిపోతుందనుకుంటాను. "క్షేత్రాజీవితం " అనే పదమే ఒకింత సందేహము కలిగిస్తూన్నది.

    రిప్లయితొలగించండి
  8. తరుణుల చేతి మహత్యము
    వరి నాటిన పంట పండు పారమ్యము గన్ !
    సరసపు పాటలు పాడుచు
    నర మరికలు లేని క్షేత్ర మతివల తోడన్ !

    రిప్లయితొలగించండి
  9. అయ్యా శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ!
    నా సూచన - 4వ పాదమును ఇలాగ సవరించుదాము:

    "స్తవనీయంబగు వృత్తి సేద్యమిడు నుత్సాహంబు ధన్యత్వమున్"
    స్వస్తి

    రిప్లయితొలగించండి
  10. కవిమిత్రులకు నమస్కౄతులు.
    కొద్ది రోజులుగా అనారోగ్యం, ఆపై తప్పని సరిగా ఊళ్ళు తిరగడం కారణంగా పూరణలపై, పద్యాలపై, వ్యాఖ్యలపై వెంటవెంటనే స్పందించలేక పోతున్నాను. ఈరోజు మా మనుమడి నామకరణోత్సవము. అదికూడా మా కోడలి ఊళ్ళో.. రేపటి నుండి తప్పక అందుబాటులో ఉంటాను. మన్నించండి..
    నిన్నటి చిత్రాన్ని చూసి మంచి పద్యాలను రచించిన కవిమిత్రులు...
    పండిత నేమాని వారికి,
    సుబ్బారావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    సహదేవుడు గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి