కవిమిత్రుకు నమస్కృతులు. నిన్న మా బావమరది ఇంట్లో ఒక కార్యక్రమానికి వెళ్ళి రాత్రి ఆలస్యంగా ఇల్లు చేరాను. అలసట కారణంగా రాత్రి మీ పూరణలపై, పద్యాలపై స్పందించలేకపోయాను. మన్నించండి. * పండిత నేమాని వారూ, ‘మోహ ముద్గరము’ అనే నామాంతరం గలిగిన ‘భజగోవిందమ్’ యొక్క నేపథ్యాన్ని చక్కగా వివరించారు. అభినందనలు, ధన్యవాదాలు. * లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * డా. విష్ణునందన్ గారూ, మీ వాకోవాక్య సీసపద్యం అద్భుతంగా ఉంది. దానితో పాటు భజగోవిందమ్ సంక్షేపానువాదాన్ని మా భాగ్యవశంగా ప్రసాదించారు. ధన్యవాదాలు. * రాజేశ్వరి అక్కయ్యా, బాగుంది మీ పద్యం. అభినందనలు. * శ్రీనివాస్ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. నేమాని వారి సవరణలను గమనించారు కదా! * తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
రఘురామ్ గారూ, మీ ప్రయత్నం ప్రశంసింపదగినది. కొన్ని లోపాలున్నాయి. ‘అన్నీ, మనిషినీ’ అని వ్యావహారిక పదాలను ప్రయోగించారు. ‘మదముల్ ఏ గొప్ప’ అని పాదం మధ్య విసంధిగా అచ్చు ప్రయోగించారు. ఇప్పుడు నిర్దోషంగా, చక్కని ధారాశుద్ధితో పద్యాలు వ్రాస్తున్నవారిలో కొందరు ప్రారంభంలో మీకన్నా ఎక్కువ తప్పులు చేసినవారే. నిరుత్సాహపడకుండా పద్యరచన కొనసాగించండి. స్వస్తి!
వ్యాకరణంబును వల్లించుచుండగా
రిప్లయితొలగించండి....వృద్ధాప్యమం దొక్క విప్రు డకట
నతనికిన్ కాలంబు వ్యర్థమొనర్పక
....మోక్ష సాధనములు పూనుమనుచు
జ్ఞానబోధను సేయ బూని శ్రీ శంకరా
....చార్యులున్ శిష్యులున్ సన్మనమున
వేదాంత సారమున్ వెలువరించిరి చాల
....సరళమౌ భాషలో సంగ్రహముగ
నలరె నది భజగోవింద మగుచు నవని
గానమున కనుగుణమైన దాని విభవ
మద్భుతంబంచు విశ్వాన వ్యాప్తినొందె
శాశ్వతంబయి నిలిచె నాచార్యు సుకృతి
"భజనఁ జేయుము మానసమ్మున భక్తినింపగ నెంచుమా,
రిప్లయితొలగించండినిజమటంచును లౌకికమ్మును నీవు నమ్మకు సోదరా!"
రుజయు మృత్యువు దాటనెంచిన లోకనాథునిఁ గొల్వగా
ప్రజల మేలును కోరి బల్కెను పారమార్థికుడెన్నడో.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆచార్యులు : నీవేమి చదువుచుంటివి ? చెప్పుమోయి !
రిప్లయితొలగించండివృద్ధుడు : అష్టాధ్యాయి సూత్రాల వ్యాకరణము ;
ఆచార్యులు : ఫలమేమి ?
వృద్ధుడు : దాన నే పండితుడను పేరు సాధించెదను !
ఆచార్యులు : దాన సౌఖ్యమేమి ?
వృద్ధుడు : అమిత సంపదలతో హాయి నొందెదను !
ఆచార్యులు : ఎంత దనుక ?
వృద్ధుడు : నే మరణించు దనుక ;
ఆచార్యులు : పిదప ?
వృద్ధుడు : ఆఁ ! పిదప ... పిదప ...
ఆచార్యులు : ఆముష్మిక ఫలమ్ము సాధింపవలెను శాశ్వత సుఖమ్ము ;
వృద్ధుడు : సత్యమే !
ఆచార్యులు : దానికై కృషి సల్పుటెపుడు ?
వృద్ధుడు : ఇప్పుడే !
ఆచార్యులు : సరి ! కాలమ్ము నిటుల రిత్త పుచ్చబోకుము ; వైరాగ్య బుద్ధి గల్గి తత్వ చింతన సాధింపదగును భ్రాత !
(వాకో వాక్ప్రక్రియ - సీస పద్యము )
కాలమాసన్నమయిన - వ్యాకరణ సూత్ర
రిప్లయితొలగించండిగత ' డుకృఞ్ కరణే ' నిన్ను గావబోదు ;
వినుము ! గోవింద గోవింద యని భజించి
మూఢమతి ! మహోన్నతమైన ముక్తి గనుము !
మూఢమతి ! ధనాగమ తృష్ణ మునుగవలదు ;
మనము నాశారహితముగ మలచవలయు ;
కర్మ ఫల లభ్యమైన పైకమ్ము నొంది
చిత్తమునఁ దుష్టి నొందుట క్షేమమగును !
స్త్రీల స్తనభర నాభీ ప్రదేశములను
గాంచి యధిక మోహావేశ గతిని గనకు ;
రక్త మాంసావయవ వికారమ్ములవియ
యనుచు నహరహమ్ము గణింపుమాత్మ యందు !
బాలతతి క్రీడలందు ; యువక గణమ్ము
సతత కాంతా నిరతి ; వృద్ధ సంఘమెప్పు
డుత్కటమ్మగు చింతల నొనరు నకట !
యెవ్వరా పరబ్రహ్మఁ జింతింపబోరు !
సరణి సత్సంగమందు నసంగ బుద్ధి ;
దాన ప్రచుర నిర్మోహత్వ తత్వమందు
నిశ్చలత్వమ్ము గల్గు నా నిశ్చలత్వ
కారణమున జీవన్ముక్తి కలుగగలదు !
వయసు గతియింప కామ భావనము నాస్తి ;
నీరు నశియింప కొలనను పేరు నాస్తి ;
ధనము నశియింప పరివార జనము నాస్తి ;
తత్వమెరుగ - సంసార బంధమ్ము నాస్తి !
అనుచు స్వామి పలుక నాలించి వృద్ధుండు
చేతులెత్తి మ్రొక్కి - చిత్తమందు
దేవదేవుడైన గోవిందు స్మరియించి
భక్తి పారవశ్య భావమొందె !
ఈషణ త్రయాది దోషమ్ములం ద్రుంచి
మోహ ముద్గరముగ ముక్తి నొసగు
తత్ప్రబోధ వెలసె - ధన్యుడై వర్థిల్లు
దాని నాచరించు మానవుండు !
(స్థల విస్తర భీతిచే కుదింపబడిన భజగోవిందానువాదము )
గోవిందు డనగ విష్ణువు
రిప్లయితొలగించండిసేవించిన ముదము జెంది సేదను దీర్చున్ !
గోవింద నామ జపమును
గావించిన గలుగు యశము కాలుని కైనన్ !
గోవిందా యను నామమెంత రుచిరా, గోవర్ధనోద్దార నిన్
రిప్లయితొలగించండిసేవిమ్పం గను భాగ్యమబ్బ ధరణిన్ శ్రీశేష శాయిన్ దలం
చే వారిన్ కృప జేసి నీవు సిరులన్ చే కూర్తు వేతండ్రి, నిన్
గోవిందా యని బిల్తు రావె వరదా కోనేటి రాయుండ వై
శ్రీ షీనా గారి పద్యము కొన్ని సవరణలతో:
రిప్లయితొలగించండిగోవిందా యను నామమెంతొ రుచిరా గోవర్ధనోద్ధార! నీ
సేవాభాగ్యము మాకు ప్రాప్తమగునో శ్రీశేషసాయీ! కృపా
భావా! నిన్ను భజించు వారికి మహాభాగ్యమ్ములన్ గూర్తువో
గోవిందా! నను బ్రోవరావె వరదా! కోనేటిరాయుండవై
శ్రీపండితనేమాని గురువులకు నమస్సులతో
రిప్లయితొలగించండిఅంత్య కాలము నందున అందుకొనగ
దేవదేవుని నామము తేలికగునె?
భుకితోపాటు నిత్యము భక్తి తోడ
నడపుమయ్య శ్రీగోవింద నామ భజన.
కవిమిత్రుకు నమస్కృతులు.
రిప్లయితొలగించండినిన్న మా బావమరది ఇంట్లో ఒక కార్యక్రమానికి వెళ్ళి రాత్రి ఆలస్యంగా ఇల్లు చేరాను. అలసట కారణంగా రాత్రి మీ పూరణలపై, పద్యాలపై స్పందించలేకపోయాను. మన్నించండి.
*
పండిత నేమాని వారూ,
‘మోహ ముద్గరము’ అనే నామాంతరం గలిగిన ‘భజగోవిందమ్’ యొక్క నేపథ్యాన్ని చక్కగా వివరించారు. అభినందనలు, ధన్యవాదాలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
డా. విష్ణునందన్ గారూ,
మీ వాకోవాక్య సీసపద్యం అద్భుతంగా ఉంది. దానితో పాటు భజగోవిందమ్ సంక్షేపానువాదాన్ని మా భాగ్యవశంగా ప్రసాదించారు. ధన్యవాదాలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
*
శ్రీనివాస్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
నేమాని వారి సవరణలను గమనించారు కదా!
*
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
"ఏ వారిన్గని నీకుమోహమదముల్ ఏగొప్పనీకున్నదో
రిప్లయితొలగించండినీవన్నీ మరణంబువచ్చు వరకే నిక్కంబురా! మూఢుడా!
గోవిందాయను నామమే మనిషినీ కూపంబుదాటించ"నే
సౌవాక్యంబుపదేశమిచ్చె జగదాచార్యుండవై శంకరా!
రఘురామ్ గారూ,
రిప్లయితొలగించండిమీ ప్రయత్నం ప్రశంసింపదగినది.
కొన్ని లోపాలున్నాయి. ‘అన్నీ, మనిషినీ’ అని వ్యావహారిక పదాలను ప్రయోగించారు. ‘మదముల్ ఏ గొప్ప’ అని పాదం మధ్య విసంధిగా అచ్చు ప్రయోగించారు.
ఇప్పుడు నిర్దోషంగా, చక్కని ధారాశుద్ధితో పద్యాలు వ్రాస్తున్నవారిలో కొందరు ప్రారంభంలో మీకన్నా ఎక్కువ తప్పులు చేసినవారే.
నిరుత్సాహపడకుండా పద్యరచన కొనసాగించండి. స్వస్తి!