గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * గుండు మధుసూదన్ గారూ, నేమాని వారి ప్రశంస లందుకున్న మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు. * శ్రీనివాస్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, బాగుంది మీ పూరణ. అభినందనలు. * పండిత నేమాని వారూ, సీతారామ కళ్యాణం చిత్రంలో మాయా రాముడు, మాయా శూర్పణఖల ప్రస్తావన ఉన్నది. మీ పూరణ చూడగానే ఆ సన్నివేశం గుర్తుకు వచ్చింది. చక్కని పూరణ. అభినందనలు.
ప్రేమగ నఖముల బెంచెను
రిప్లయితొలగించండిప్రేమయె తా గోళ్ళరంగు ప్రీతిగ వేసెన్
ప్రేమించి మేన బావగు
రాముఁడు 'శూర్పణఖ' నపుడు రహిఁ బెండ్లాడెన్.
ప్రేమన్ విద్యుజ్జిహ్వుఁడు,
రిప్లయితొలగించండిభీమాకృతి సహిత శత్రు భీకరుఁ, డతి సం
క్షేమాప్త దనుజ హృద్వి
శ్రాముఁడు శూర్పణఖ నపుడు రహిఁ బెండ్లాడెన్.
కాముడి శరముల వాడికి
రిప్లయితొలగించండిధీమతు లెందరు వశమయి దిమ్మరె నంచున్
కాముకి కలగాంచె నిటుల
రాముఁడు 'శూర్పణఖ' నపుడు రహిఁ బెండ్లాడెన్.
శ్రీ గుండు మధుసూదన్ గారి పూరణ చాల బాగుగ నున్నది. శుభాభినందనలు. స్వస్తి
రిప్లయితొలగించండిప్రేమగ పేరిడి రందరు
రిప్లయితొలగించండిచేమంతి ముఖము గలిగిన చేడియ కౌరా !
హేమంత ఋతువు నందున
రాముఁ డు శూర్పణఖ నపుడు రహిఁ పెండ్లాడెన్
రామునిపై పెరుగగ కడు
రిప్లయితొలగించండిబ్రేముడి, తన మాయ చేత వేరొక రామున్
భామిని సృజింప, మాయా
రాముడు శూర్పణఖ నపుడు రహి బెండ్లాడెన్
అజ్ఞాత కవి పూరణ (శతావధాన ప్రబంధము నుండి)
రిప్లయితొలగించండికామించి చూడఁబోఁ డే
భామను, శ్రీరాముఁ డేకపత్నీవ్రతుఁ డో
స్వామీ! యిటు లందువె? యే
రాముఁడు శూర్పణఖ నపుడు రహిఁ బెండ్లాడెన్?
గురుతుల్యులు పండిత నేమానివారికి నమస్సులు. నా పూరణ వారి మెప్పులనందినందులకు నాకు సంతోషముగనున్నది. ధన్యోస్మి.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
నేమాని వారి ప్రశంస లందుకున్న మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
*
శ్రీనివాస్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
సీతారామ కళ్యాణం చిత్రంలో మాయా రాముడు, మాయా శూర్పణఖల ప్రస్తావన ఉన్నది. మీ పూరణ చూడగానే ఆ సన్నివేశం గుర్తుకు వచ్చింది. చక్కని పూరణ. అభినందనలు.
అవును మధుసూదన్ గారి పూరణ చాలా బాగుంది.
రిప్లయితొలగించండిమోమైన జూడ డాయెను
రిప్లయితొలగించండిరాముఁడు శూర్పణఖ నపుడు, రహిఁ బెండ్లాడెన్
భూమిజ, నొకటే సతియౌ
రామునకని తెలియబోక రక్కసి రగిలెన్.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
పొమ్మని గట్టిగ జెప్పెను
రిప్లయితొలగించండిరాముడు శూ ర్పణ ఖ నపుడు, రహి బెండ్లాడెన్
అమ్మగు నాయిల జాతను
ఇమ్ముగ సంతోష మొప్ప నీశుడు రామున్
రామాయణమ్ము కెదురుగ
రిప్లయితొలగించండికీమాయణమును ద్రవిడులు క్రీడింపంగా
కామాతురుడై కొండొక
రాముఁడు శూర్పణఖ నపుడు రహిఁ బెండ్లాడెన్
కీమాయణము = రామసామి
నాయికరు వారి నాటకము
http://nptel.ac.in/courses/109104050/lecture34/34_4.htm
ధీమంతుండను నేనని
రిప్లయితొలగించండిశ్రీమతిని విడిచి నగవుచు శృంగారమునన్
వామపు పక్షము జేరిన
రాముఁడు శూర్పణఖ నపుడు రహిఁ బెండ్లాడెన్
రిప్లయితొలగించండిఏమంటిరి కందివరా!
రాముఁడు శూర్పణఖ నపుడు రహిఁ బెండ్లాడెన్?
స్వామి! యిటుల రాయుట నా
కేమో సరియనుచు తోచకే సూచనయౌ :)
జిలేబి