మిత్రులారా! శుభాశీస్సులు, కొద్దిరోజులుగా మనము శ్రీ మిస్సన్న గారిని మన బ్లాగులో చూడలేక పోవుచున్నాము. దీనికి కారణము వారు చెప్పేరు - వారి కంప్యూటరుకి ఉన్న సమస్యలే అని. త్వరలో మళ్ళీ వారు మన బ్లాగులోకి వస్తారు అనుకొందాము. స్వస్తి.
పండిత నేమాని వారూ, మీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉన్నాయి. అభినందనలు. ఇంతకి మొదటిది పూరణమా? అధిక్షేపమా? అధిక్షేపాత్మక పూరణమా? ఏమైనా బాగున్నది. * గుండు మధుసూదన్ గారూ, క్రమాలంకారాన్ని ఆశ్రయించి మీరు చేసిన పూరణ బాగున్నది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, ‘కృష్ణ కుచేల’ నాటకంలో పాత్రధారులు రాజకీయ ప్రత్యర్థులంటారు. బాగుంది. మంచి పూరణ. అభినందనలు. * నాగరాజు రవీందర్ గారూ, విరుపుతో చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. * రఘురామ్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, మీ రెండు పూరణల ప్రయత్నం ప్రశంసింపదగినది. * మిత్రులారా, మనమందరం మిస్సన్న గారిని ‘మిస్’ అవుతున్నాము. త్వరలోనే వారి కంప్యూటర్ బాగుపడాలని కోరుకుందాం.
ఆ కుచేలుడు హరికి బ్రత్యర్ధి యగున
రిప్లయితొలగించండినెడు విధము సరిగాదయ్య! పడెను తప్పు
ముద్రణము చేయుచుండగా, భద్రశీల!
తప్పులను సరిదిద్దుమా యొప్పిదముగ
యాదవునిఁ జేరి సంపన్నుఁ డాయె నెవఁడు?
రిప్లయితొలగించండిఆ గజేంద్రుఁడు నెవనికి నార్తిఁ దెలిపె?
రామునకు రావణుం డిల నేమి యగును?
ఆ కుచేలుఁడు; హరికిఁ; బ్రత్యర్థి యగును.
ఊరియందున పార్టీలు వేరె యయిన
రిప్లయితొలగించండినాటకమ్మును వేసిరి నయము గాను
పగలు పగలేను రాతిరి పండుగనుచు
ఆ కుచేలుఁడు హరికిఁ బ్రత్యర్థి యగును.
చిత్రముగ కృష్ణునకు బాల్యమిత్రు డగును
రిప్లయితొలగించండిఆ కుచేలుడు ; హరికి ప్రత్యర్థి యగును
దానవేంద్రు డా కశిపుడు ; తనయు డేమొ
హరికి భక్తుడు ప్రహ్లాదు డయ్యె నాడు
అటుకులనుఁ దెచ్చి యిచ్చిన యనుగు మిత్రు
రిప్లయితొలగించండిడా కుచేలుడు హరికి బ్రత్యర్ధి? యగును
ప్రాణ సఖుడగుచో, హరి ప్రతిగ నిచ్చె
సంపదలనెన్నొ నతనికి సంతసముగ.
(అగుచో ప్రాణ సఖుడగును)
మరియొక ప్రయత్నము:
రిప్లయితొలగించండిగురు కులమ్మున నుండిన తరుణమందు
పాఠముల నభ్యసించుచు స్ఫర్ధ మీర
పెంపు గనెనంచు జనులలో పేరు గనిన
యా కుచేలుడు హరికి ప్రత్యర్ధి యగును
గోపకులు ఆవులను కాచి, గోకులమున
రిప్లయితొలగించండిఅలుపుదీరుటకు కలిసి ఆటలాడ
కృష్ణుడొక జట్టునకు నాయకత్వమిడును
ఆ కుచేలుడు హరికి ప్రత్యర్థియగును ॥
ఎవరి కెవరందు రీనాడు నిలను కనగ
రిప్లయితొలగించండిప్రాణ మున్నంత వరకేను ప్రాకు లాట
గగన మందున జేరగ కనగ నెవరు
ఆ కుచేలుడు హరికి ప్రత్యర్ధి యగును !
యమున తటి పైన నాడుచు యాగడమున
రిప్లయితొలగించండిగొల్ల వనితల వలువలు మెల్ల గాను
దాచి సరసమ్ము లాడుచు దాగి నపుడు
ఆ కుచేలుడు హరికి ప్రత్యర్ధి యగును !
మిత్రులారా! శుభాశీస్సులు,
రిప్లయితొలగించండికొద్దిరోజులుగా మనము శ్రీ మిస్సన్న గారిని మన బ్లాగులో చూడలేక పోవుచున్నాము. దీనికి కారణము వారు చెప్పేరు - వారి కంప్యూటరుకి ఉన్న సమస్యలే అని. త్వరలో మళ్ళీ వారు మన బ్లాగులోకి వస్తారు అనుకొందాము. స్వస్తి.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉన్నాయి. అభినందనలు.
ఇంతకి మొదటిది పూరణమా? అధిక్షేపమా? అధిక్షేపాత్మక పూరణమా? ఏమైనా బాగున్నది.
*
గుండు మధుసూదన్ గారూ,
క్రమాలంకారాన్ని ఆశ్రయించి మీరు చేసిన పూరణ బాగున్నది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
‘కృష్ణ కుచేల’ నాటకంలో పాత్రధారులు రాజకీయ ప్రత్యర్థులంటారు. బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
విరుపుతో చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
రఘురామ్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ రెండు పూరణల ప్రయత్నం ప్రశంసింపదగినది.
*
మిత్రులారా,
మనమందరం మిస్సన్న గారిని ‘మిస్’ అవుతున్నాము. త్వరలోనే వారి కంప్యూటర్ బాగుపడాలని కోరుకుందాం.
శ్రీపండితనేమాని గురువులకు నమస్సులతో
రిప్లయితొలగించండిగర్భ దారిద్ర్య మందుండ గాచ, యగునె
ఆ కుచేలుఁడు హరికిఁ బ్రత్యర్థి? యగును
నిక్కముగ ప్రాణమిత్రుడు నిజ మనంబు
నందు గొల్చు భక్తశిఖామణి యరయ గాను.
అయ్యా! శ్రీ కంది శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిభద్రశీలా! అని సంబోధన ఉండగా అది అధిక్షేపము అగునా? ఒక మంచి దిద్దుబాటు మాత్రమే. సంతోషము. స్వస్తి.
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
నాల్గవ పాదంలో గణదోషం. ‘మనంబు/నందు గొల్చెడి భక్తుడే యరయగాను’ అందామా?
*
నేమాని వారూ,
ధన్యవాదాలు.