3, జూన్ 2013, సోమవారం

సమస్యాపూరణం – 1071 (భర్త భామ యయిన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
భర్త భామ యయిన భార్య మురిసె.

21 కామెంట్‌లు:

  1. నాటకమునఁ దాము నటియించి నందునఁ
    జాల తృప్తి పడెను జంట యొకటి.
    కృష్ణుడై నటించి కృప దైవముదనగ
    భర్త, భామ యయిన భార్య మురిసె

    రిప్లయితొలగించండి
  2. satyabhaama paatra sarasaMbugaa vEsi
    naatakaMbunaMdu nalugureduTa
    meppunaMdi tEga 'kappu ' nokkaTi naaDu

    భర్త, భామ యయిన భార్య మురిసె

    రిప్లయితొలగించండి
  3. satyabhaama paatra sarasaMbugaa vEsi
    naatakaMbunaMdu nalugureduTa
    meppunaMdi tEga 'kappu ' nokkaTi naaDu

    భర్త "భామ" యయిన భార్య మురిసె

    రిప్లయితొలగించండి
  4. "జంబ లకిడి పంబ" చలన చిత్రమునందు
    నౌషధ ప్రభావ మలరు కతన
    భార్య భర్త కాఁగ, భర్త భార్యయుఁ గాఁగ,
    భర్త భామ యయిన భార్య మురిసె!

    రిప్లయితొలగించండి
  5. మన్ననలను పొందు మగువ లందరిచేత
    ప్రేక్షకులకు మిగుల ప్రీతి గూర్చు
    వీధి నాటకమున వెలది పాత్రను వేసి
    భర్త బామ యయిన భార్య మురిసె .

    రిప్లయితొలగించండి




  6. నాటకమ్ములందు నారీమణులపాత్ర
    చూపరులకు మివుల చోద్యమగుచు
    నటన జేయునట్టి నటశేఖరుండగు
    భర్త,భామయైన భార్య మురిసె.

    రిప్లయితొలగించండి
  7. సత్య భామ నంచు సరస మాడెడి భర్త
    పరమ ప్రీతి జెంది పడతి వలెను
    చీర చుట్టు కొనుచు నారియై నటియించు
    భర్త భామ యయిన భార్య మురిసె

    రిప్లయితొలగించండి
  8. రాజేశ్వరి నేదునూరి గారూ పూరణ సింపుల్ గ చక్కగా ఉంది.
    సత్య భామ నంచు సరస మాడెడి భర్త
    పరమ ప్రీతి జెంది పడతి వలెను

    రిప్లయితొలగించండి
  9. సత్యభామ పాత్ర సరసంబుగా వేసి
    నాటకంబునందు నలుగురెదుట
    మెప్పునంది తేగ 'కప్పు ' నొక్కటి నాడు
    భర్త "భామ" యయిన భార్య మురిసె

    రిప్లయితొలగించండి
  10. భవుని వరము చేత భస్మాసురుడు క్రొవ్వి
    ఆ భవుని శిరమున హస్తమిడగ
    తలచి తఱముచుండ, తరుణియయ్యెను హరి
    భర్త భామ యయిన భార్య మురిసె!!

    రిప్లయితొలగించండి
  11. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘దైవముదనగ’...?
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    హాస్యప్రధానమైన ఆ చలన చిత్రాన్ని ప్రస్తావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    లక్కరాజు వారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. జిగురు సత్యనారాయణ గారూ,
    భస్మాసుర వృత్తాంతంతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. అకట!ఫల్గుణుడెటులజ్ఞాతమందన
    నమర కాంత శాపమమరెననుచు
    విరటు కొల్వునుండ విజయుడింతిగ మార
    భర్త భామ యయిన భార్య మురిసె!!

    రిప్లయితొలగించండి
  14. నారి పొందుగోరి నర్తనశాలకు
    కీచకుండు రాగ, కీళ్లు కాల్లు
    విఱువ పైటదాల్చె భీముడు పోరుకై
    భర్త భామ యయిన భార్య మురిసె!!

    రిప్లయితొలగించండి
  15. సుధను పంచుచున్న సుందరి యెవరని
    సురల నడుగ లక్ష్మి, హరి యనంగ,
    నౌర స్వామి లోన నంత జాణయె యంచు
    భర్త భామ యయిన భార్య మురిసె.

    రిప్లయితొలగించండి
  16. జిగురు సత్యనారాయణ గారూ,
    మీ తాజా పూరణలు రెండూ దేనికదే ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    పూరణలలో మీ ‘జాణతనం’ ఎప్పటికప్పుటి కొత్త కొత్తగా ప్రస్ఫుటమౌతున్నది. చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. గురువు గారు, ధన్యవాదములు.
    మరింత స్పష్టత కోసం ఈ సవరణ. గమనించగలరు.

    భర్త కృష్ణునిగా, భార్య (సత్య) భామగా నటించిన సందర్భంలో.....

    నాటకమునఁ దాము నటియించి నందునఁ
    జాల తృప్తి పడెను జంట యొకటి.
    కృష్ణుడై నటించి కృప దేవునిదె యనె
    భర్త, భామ యయిన భార్య మురిసె

    రిప్లయితొలగించండి
  18. గురువుగారూ! ధన్యవాదాలు. మీ ప్రోత్సాహమే దానికి కారణం.

    రిప్లయితొలగించండి