4, జూన్ 2013, మంగళవారం

పద్య రచన - 362 (గోరంత దీపము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“గోరంత దీపము”

9 కామెంట్‌లు:

  1. మానస లోచనమ్ములకు మాత్రమె గోచరమౌను లెస్సగా
    ధ్యానమొనర్చు యోగులకు తత్త్వ మయాంచిత దీప మాత్మగా
    నేనదె యన్న భావనయె నిత్యము గల్గెడునట్టి వారి వి
    జ్ఞానమె దీపమై జగతి కాంతుల నింపును, బాపు మాయలన్

    రిప్లయితొలగించండి
  2. చిక్కటి చీకటి భ్రాంతిని
    చిక్కక తొలగించు నొక్క చిరు దీపమ్మే !
    ఒక్క క్షణం నీదు మదిని
    మక్కువగా వెలగ నిస్తె మలిగెద నేనై !

    రిప్లయితొలగించండి
  3. దీపము గోరంత నిలిచి
    పాపపు దేహమునుఁ గాచు- భగవంతుండా
    రూపమున నెల్ల వారల
    నీ పగిది జవమునొసగుచు నెక్కుడు కృపతోన్.

    రిప్లయితొలగించండి
  4. గోరంత దీ ప మయ్యది
    ఆరని యా జ్యోతి వెలుగు లాశలు దీర్చున్
    ఊరూరి దేవళం బున
    గోరంత లె వెలుగు చుండు గొండంత లుగన్

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారూ,
    గోరంత దీపాన్ని గురించి కొండంత భావాన్ని తెలియజేసారు. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
    ‘ఇస్తె’ అని గ్రామ్య పదాన్ని ఉపయోగించారు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. గురువులకు ధన్య వాదములు
    ఒకసారి అంధ్ర జ్యోతి వారు దీపావళి ప్రత్యేక సంచికలో నా కవితకి బహుమతి నిచ్చారు .దాన్ని కిట్టించి వ్రాసాను . ఆకవిత సరదాకి మాత్రమే

    " త్వమేవాహం "
    ------------
    కోటి దివ్వెల కాంతి నువ్వు
    కటిక చీకటి భ్రాంతి నేను
    ఒక్క క్షణం నీ హృదిలో
    మక్కువతో [ గా ] వెలగ నిస్తె
    దివ్వె దివ్వెకు వెలుగు నేనై
    మలిగి పోతా నిజము నమ్ము !

    రిప్లయితొలగించండి




  7. గోరంత దీపమ్ము కొండలకు వెలుగు,
    మా చంటి పాపాయి మా కళ్ళ వెలుగు ,
    ఇల్లాలి చిరునవ్వు ఇంటికే వెలుగు ,
    మెరయు నా జాబిల్లి మింటికే వెలుగు.

    రిప్లయితొలగించండి