పండిత నేమాని వారూ, ‘విగత దారిద్ర్యము’ సుఖపెట్టునన్న మీ పూరణ, అందులోనూ కందపాదాన్ని తేటగీతిలో ఇమిడ్చిన నైపుణ్యం అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు. * గుండు మధుసూదన్ గారూ, ‘పునర్జన్మపు దారిద్ర్యము’ను గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, దాదాపు ఒకే భావంతో రెండు పూరణలు చేసారు. లేక రెండవది మొదటి దానికి సంస్కరణమా? రెండూ బాగున్నవి. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, పగటి కలల దారిద్ర్యంపై మీ పూరణ బాగుంది. అభినందనలు.
శ్రీనివాస్ గారూ, మీ ప్రయత్నం ప్రశంసింపదగినదే. కానీ పద్యంలో ప్రాసదోషం ఉంది. రెండు పాదాల్లో సంయుక్తాక్షరాలను వేసారు. మూడవ పాదంలో ప్రాస పూర్వాక్షరం హ్రస్వమైంది.
శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో, ======*======= నేరము గాదుగ బ్రతికిన దారిద్ర్యము నందు,సుఖము తప్పక దొరకున్ ధీరులకు దారి జూపెడి తారక రాముని గొలిచిన ధర్మనిరతితో
గురువు గారు, ధన్యవాదములు. నరసింహమూర్తి గారూ, నమస్సులు. బావున్నానండీ. మీరు కుశలమని భావిస్తాను.మీరు చెప్పిన నియమం గుర్తు పెట్టుకుంటాను. తెలియజెప్పినందులకు ధన్యవాదములు. భవదీయుడు
అవని ప్రారబ్ధ కర్మము ననుసరించి
రిప్లయితొలగించుకష్ట సుఖములు జనులకు గలుగుచుండు
ఔర! విగత దారిద్ర్యమునందు సుఖము
తప్పక దొరకున్ సుగుణాఢ్య! ధర్మనిరత!
ధారుణి జన్మించిన ప్రతి
రిప్లయితొలగించుపూరుషునకుఁ గష్ట దుఃఖములు గలిగెడిచో;
ధీరునకు పునర్జన్మపు
దారిద్ర్యమునందు సుఖము తప్పక దొరకున్!
నేరక జేయుచునుండగ
రిప్లయితొలగించుక్రూరపు కర్మముల నెపుడు; కూరిమి తోడన్
దారిని దైవము చూపిన-
దారిద్ర్యమునందు సుఖము తప్పక దొరకున్.
నేరక చేసితి నెన్నో
రిప్లయితొలగించుక్రూరపు కర్మముల; కరుణ కోరుచు నిన్నే
చేరితి స్వామీ యనిన
దారిద్ర్యమునందు సుఖము తప్పక దొరకున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించునేరక చేసితి నెన్నో
రిప్లయితొలగించుక్రూరపు కర్మముల; కరుణ కోరుచు నిన్నే
చేరితి స్వామీ యనుచో
దారిద్ర్యమునందు సుఖము తప్పక దొరకున్.
వేరెక్కడ లేదయ్యా
రిప్లయితొలగించుచేరెను కష్టములనుచును చింతలవేలా
కోరిక పగటి కలల సిరి
దారిద్ర్యమునందు సుఖము తప్పక దొరకున్.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించు‘విగత దారిద్ర్యము’ సుఖపెట్టునన్న మీ పూరణ, అందులోనూ కందపాదాన్ని తేటగీతిలో ఇమిడ్చిన నైపుణ్యం అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
‘పునర్జన్మపు దారిద్ర్యము’ను గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
దాదాపు ఒకే భావంతో రెండు పూరణలు చేసారు. లేక రెండవది మొదటి దానికి సంస్కరణమా?
రెండూ బాగున్నవి. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
పగటి కలల దారిద్ర్యంపై మీ పూరణ బాగుంది. అభినందనలు.
శౌర్యము,, ధైర్యము, తేజము
రిప్లయితొలగించులార్యులు మెచ్చెడి గుణములు లావుగ గల్గన్
స్థిర చిత్తులకు, విబుధు లకు,
దారిద్ర్యము నందు సుఖము తప్పక దొరుకున్
శ్రీనివాస్ గారూ,
రిప్లయితొలగించుమీ ప్రయత్నం ప్రశంసింపదగినదే.
కానీ పద్యంలో ప్రాసదోషం ఉంది. రెండు పాదాల్లో సంయుక్తాక్షరాలను వేసారు. మూడవ పాదంలో ప్రాస పూర్వాక్షరం హ్రస్వమైంది.
మారదు కర్మఫలము సమ
రిప్లయితొలగించుకూరిన విత్తమున దృప్తి కోరిన గలుగున్
కోరకు ధనాగమమ్మును
దారిద్ర్యమునందు సుఖము తప్పక దొరకున్
గురువుగారు,
రిప్లయితొలగించుసంస్కరణే నండీ. మొదటిదీ ఉండనిమ్మని ఉంచేసినాను.
ధన్యవాదాలు.
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించుసంతోషం! ఎందుకంటే నేను పూరణ చెప్పాలనుకున్న భావంతో మీరు చెప్పారు. చాలా బాగుంది. అభినందనలు.
పోరుట నేరము గాదుగ
రిప్లయితొలగించుదారిద్ర్యమునందు ; సుఖము తప్పక దొరకున్
ధీరతగలవారికి చే
కూరును విజయములు పెక్కు, కువలయమందున్ !!!
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించువిరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో,
రిప్లయితొలగించు======*=======
నేరము గాదుగ బ్రతికిన
దారిద్ర్యము నందు,సుఖము తప్పక దొరకున్
ధీరులకు దారి జూపెడి
తారక రాముని గొలిచిన ధర్మనిరతితో
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించుసమస్యను విరిచి మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో,
రిప్లయితొలగించుగురువు గారికి ధన్యవాదములు
======*=======
సారము లేకున్నను సం
సారపు సాగరమునందు సాగుట కన్నన్,
కూరిమి నొందెడి జనులకు
దారిద్ర్యము నందు సుఖము తప్పక దొరకున్
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించుమీ తాజా పూరణ కూడా బాగున్నది. అభినందనలు.
భూరిశ్రమకోర్చుచు సం
రిప్లయితొలగించుస్కారంబుల గుణవరిష్ఠ సంస్త్యుత్యుండై
పేరిమి గల గృహమైనచొ
దారిద్ర్యమునందు సుఖము తప్పక దొరకున్.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించుచాలా మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
'ఐనచొ' అని హ్రస్వంగా ప్రయోగించారు. అక్కడ 'గృహమైనన్' అందామా?
శూరులు , పండితు లెప్పుడు
రిప్లయితొలగించుకోరరు భోగము లవనిన,గోరరు ధనమున్
ఓరిమి గలిగిన వారికి
దారిద్ర్యము నందు సుఖము తప్పక దొరుకున్
తారలకుఁ, బుడమి వేసవిఁ
రిప్లయితొలగించువారాశులనా'డమెరిక' వాసులకుఁ, దివిన్
వారాంగనలకును "వసన
దారిద్ర్యము"నందు సుఖము తప్పక దొరకున్!
శ్రీనివాస్ గారూ,
రిప్లయితొలగించుబాగుంది మీ పూరణ. అభినందనలు.
'భోగము లవనిన' అనడం కంటే 'భోగము లవనిని/భోగములు భువిని' అంటే బాగుంటుంది.
*
రామకృష్ణ గారూ,
మీ "వసన దారిద్ర్యపు" పూరణ చమత్కార జనకమై అలరిస్తున్నది. అభినందనలు.
నేరము గాదట లేమిని
రిప్లయితొలగించునేరుపుగా బ్రతికి నంత నీమము విడకన్ !
నోరిమిని దైవ చింతన
దారిద్ర్యము నందు సుఖము తప్పక దొరకున్ !
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించుబాగుంది మీ పూరణ. అభినందనలు.
'నోరిమి' అనడమే ఇబ్బంది. అక్కడ 'వారక' అందాం.
ధన్యవాదములు గురువు గారూ !
రిప్లయితొలగించుశ్రీపండితనేమాని గురువులకు నమస్సులతో
రిప్లయితొలగించుప్రేరణ పొందుచు నెపుడును
దారిద్ర్యమునందు సుఖము తప్పక దొరకున్
శ్రీరాముని చరితమ్మును
పారాయణ చేయుచుండ పాపము దొలగున్.
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
రిప్లయితొలగించుమీ పూరణ బాగుంది. అభినందనలు.
కూరిమి హరితో నుండగఁ
రిప్లయితొలగించుబోరాటము లేమి సలిపి ప్రోవు మనంగన్
శౌరి కృపను వారించెడి
దారిద్ర్యమునందు సుఖము తప్పక దొరకున్.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించుశౌరిచే వారింపబడిన దారిద్ర్యం తప్పక సుఖపెడుతుందన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
తారలకుఁ, బుడమి వేసవిఁ
రిప్లయితొలగించువారాశులనా'డమెరిక' వాసులకుఁ, దివిన్
రామకృష్ణ గారూ ! నమస్సులు ! బాగున్నారా ! వేసవి ,వాసులకు తర్వాత అర్ధానుస్వారము రాదు. సరళాదేశ సంధి జరుగుతేనే ద్రుతమునకు బిందువు వచ్చే అవకాశము ఉంది.
గురువుగారూ ! నమస్సులు , ధన్యవాదములు !
రిప్లయితొలగించుగురువుగారూ ! కుచేలుని దృష్టిలో నుంచుకొని చేసిన నా పూరణకు చిన్న సవరణ .
రిప్లయితొలగించుకూరిమి హరితో నుండగఁ
బోరాటము లేమి సలిపి పొంతకుఁ జేరన్
శౌరి కృపను వారించెడి
దారిద్ర్యమునందు సుఖము తప్పక దొరకున్.
గురువు గారు,
రిప్లయితొలగించుధన్యవాదములు.
నరసింహమూర్తి గారూ,
నమస్సులు. బావున్నానండీ. మీరు కుశలమని భావిస్తాను.మీరు చెప్పిన నియమం గుర్తు పెట్టుకుంటాను. తెలియజెప్పినందులకు ధన్యవాదములు.
భవదీయుడు
కోరక బాల్యపు మిత్రుడు
రిప్లయితొలగించుకూరిమితో సంపదలను కురిపించంగన్
కోరిక మీరగ తీరిన
దారిద్ర్యమునందు సుఖము తప్పక దొరకున్
కూరిమితో మనమోడియె
రిప్లయితొలగించుకూరగ నిమ్రాను నోరు గుడ్డల తోడన్
వారే! పాకిస్తానుల
దారిద్ర్యమునందు సుఖము తప్పక దొరకున్