10, జూన్ 2013, సోమవారం

సమస్యాపూరణం – 1078 (నరసింహుని ప్రియసుతుండు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
నరసింహుని ప్రియసుతుండు నారాయణుఁడే.

26 కామెంట్‌లు:

  1. నరసింహుడు అనగా నరులలో శ్రేష్ఠుడు - దశరథుడు - అను భావముతో ఈ నా పూరన:

    ధరణిన్ ధర్మమును సము
    ద్ధరించుటకు నవతరించె దశరథసుతుడై
    హరి, దశరథ భూవరుడను
    నరసింహుని ప్రియసుతుండు నారాయణుడే

    రిప్లయితొలగించండి
  2. వరమడుగుచు పూజించితి
    నరసింహుని; ప్రియసుతుండు నారాయణుడే
    ధర దిగి వచ్చెననుచు నే
    మురిసితి మనమున, మరి మరి మోదము హెచ్చెన్.

    రిప్లయితొలగించండి
  3. హరినీ పది యవతారము
    లెరిగిన వారికి కలుగదులే సందియమే
    హరి తానె పితయు సుతుడును
    నరసింహుని ప్రియసుతుండు నారాయణుఁడే.

    రిప్లయితొలగించండి
  4. విష్ణువు తానె నరసింహుడు నారయణుడూనూ అంటే ఆయన నుండి ఆయనే అవతరించుతాడు కావున ఆయనే తండ్రి ఆయనే కొడుకు అనే భావనతో వ్రాసాను. అంతే కాక "ఆత్మావై పుత్ర నామాసి " అని ఉండనే ఉన్నది . ఒకవేళ నా పూరణ లో కానీ భావన లో కాని తప్పు ఉన్న యెడల పండితులు మన్నించి సవరింతురు గాక

    రిప్లయితొలగించండి
  5. గురువులు దీవెన లిడగ న
    చిరకాలమె పెండ్లి యగును జ్యేష్ఠ సుతుండున్
    వరుడౌటయు నిక్కము నీ
    నరసింహుని ప్రియసుతుండు నారాయణుడే !

    మా జ్యేష్ఠపుత్రుడు చిరంజీవి భార్గవ నారాయణమూర్తి వివాహము చిరంజీవి సౌభాగ్యవతి పరిగె హారికతో నిశ్చయ మైన శుభవార్తను గురువు గారి వేదికపై మిత్రులతో పంచుకొంటున్నాను. మా ద్వితీయపుత్రుడు చిరంజీవి భవానీ శంకర్ ( గురువు గారి పేరింటి వాడు ) కూడా మాకు ప్రియసుతుడే !

    రిప్లయితొలగించండి
  6. మిత్రులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తిగారికి ప్రియపుత్ర వివాహ శుభాకాంక్షలు.

    నరసింహమూర్తికుదయిం
    చెర వరసుతుఁడని యనుచు వచించెదఁ దా ని
    ద్ధర నారాయణమూర్తియె!
    నరసింహుని ప్రియసుతుండు నారాయణుఁడే!!

    రిప్లయితొలగించండి
  7. వరహృదయుడు గన్నవరపు
    వరాహ నరసింహ మూర్తి వైద్య నిపుణుడున్
    పరమ హితుడు కవివరుడా
    నరసింహుని ప్రియసుతుండు నారాయణుడే

    రిప్లయితొలగించండి
  8. అరవిందు డనెడు వాడే
    నరసింహుని ప్రి య సుతుండు,నారాయణుడే
    నరులను బోషించు భువిని
    నరనారాయణు లిరువురు నందుని కాప్తుల్

    రిప్లయితొలగించండి
  9. కనకకశిపుడు నరసింహుని చూచిన తర్వాత స్వగతంలో:

    అరయగ నైతి కుమతినై
    నరసింహుని; ప్రియసుతుండు నారాయణుఁడే
    పరదైవమ్మని కుశలము
    నెరపునెడ పెడచెవి బెట్టి నిందించితినే.

    రిప్లయితొలగించండి
  10. యిరువురు భామల నేల, ము
    రారికి తగును విజయ నగరాధీశునకు త
    గు,రిపుంజయుడతడు, తుళువ
    నరసింహుని ప్రియ సుతుండు నారాయణుడే

    రిప్లయితొలగించండి
  11. నరసింహుని పుత్రిక యే
    వరముల బొందినదొ గన్నవర పన్వయమే
    దొరకొన్నది! వరుడా? మన
    నరసింహుని ప్రియసుతుండు నారాయణుడే !

    రిప్లయితొలగించండి
  12. సోదరులు గన్నవరపు వారి ప్రియ పుత్రుని వివాహ సందర్భమున నూతన వధూ వరులకు పాత దంపతులు సోదరులు గన్నవరపు వారు వారి సతీమణి గారికీ హృదయ పూర్వక శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి
  13. సుతుని వివాహము నిశ్చయింపబడిన శుభ సందర్భములో - గన్నవరపు భిషగ్వరుల వారి కుటుంబానికంతటికీ ఆనందం ద్విగుణీకృతము కావాలని ఆశిస్తూ -


    స్థిర మంగళకర పరిణయ
    మరయగనౌ ; నయము మీర హారిక నిదుగో
    వరియించెను 'గన్నవరపు
    నరసింహుని' ప్రియసుతుండు నారాయణుఁడే !

    రిప్లయితొలగించండి
  14. యిరువురు భామల నేల, ము
    రారికి తగును విజయ నగరాధీశునకు న
    ప్పు ,రిపుంజయుడతడు, తుళువ
    నరసింహుని ప్రియ సుతుండు నారాయణుడే

    చిన్న సవరణ తో ఈ పూరణను తిరిగి పంపిస్తున్నాను. గమనించ గలరు.

    రిప్లయితొలగించండి
  15. వరపుత్రు డాత్మజుండట
    నరసిం హుని ప్రియ సుతుండు నారాయణు డే !
    పరి పరి విధముల మురియుచు
    సుర లోకము పొగిడి నంత సూనృత మదియే !

    రిప్లయితొలగించండి
  16. ఖరకరజాగ్రజుఁడౌ వా
    నరసింహుని ప్రియసుతుండు, నారాయణుఁడే
    కరుణించఁగ, "నంగదుఁ"డటు
    పరుగునఁ జనె వార్తికునిగఁ బౌలస్త్యు సభన్.

    రిప్లయితొలగించండి
  17. శ్రీపండిత నేమాని గురువులకు, శంకరార్యులకు, అన్న మిస్సన్నగార్కి బ్లాగు మిత్రులందరికీ నమస్సులతో

    భ్రాతృసమాన శ్రీ గన్నవరపు వరాహ నరసింహమూర్తి గారి అబ్బాయి వివాహనిశ్చితార్థ వేడుక కన్నుల పండుగగా జరగాలని కోరుతూ

    పరిగతమైనదిట పరిగె
    నరసింహుని “హారిక’కును నాయకుడౌటన్
    వరుడిట మాగన్నవరపు
    నరసింహుని ప్రియసుతుండు నారాయణుఁడే.

    రిప్లయితొలగించండి
  18. గురువర్యులు శ్రీ శంకరయ్య గారికి, అన్నయ్య గారు శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారికి, సోదరీమణులు శ్రీమతి నేదునూరి రాజేశ్వరి గారికి ,శ్రీమతి లక్ష్మీ దేవి గారికి , మిత్రులు శ్రీ గుండు మధుసూదన్ గారికి, శ్రీ సుబారావు గారికి,శ్రీ షీనా గారికి, శ్రీ మిస్సన్న గారికి, డా.విష్ణునందన్ గారికి, శ్రీ రవి గారికి మనతెలుగు చంద్రశేఖరుల వారికి, శ్రీ గోలి హనుమచ్ఛాస్రి గారికి, సోదరులు శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి, హృదయ పూర్వక ధన్యవాదములు.
    ( శాస్త్రి గారూ శ్రీ పరిగె సుధాకర్ గారిది మీ గుంటూరే !)

    రిప్లయితొలగించండి
  19. శ్రీ సుబ్బారావు గారూ ! అచ్చుతప్పునకు మన్నించండి.

    రిప్లయితొలగించండి
  20. ఈనాటి సమస్యకు ఒక ప్రత్యేకత ఉన్నది. కొందరు గన్నవరపు నరసింహ మూర్తి గారికి శుభాకాంక్షలు తెలుపడానికి పూరణను సాధనంగా చేసుకున్నారు. చక్కని పూరణలు చెప్పిన కవిమిత్రులు...
    పండిత నేమాని వారికి,
    లక్ష్మీదేవి గారికి,
    (శీనా) శ్రీనివాస్ గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    సుబ్బారావు గారికి,
    రవి గారికి,
    మిస్సన్న గారికి,
    డా. విష్ణునందన్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    (తమమీద తామే పూరణ చెప్పుకున్న) గన్నవరపు వారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. అరవక తెలుపుము శంకర!
    నరసింహుని ప్రియసుతుండు నారాయణుఁడే
    తరగతి లోనిది పాఠము?
    పరమార్థము తెలుపుమయ్య పరపతి దక్కున్!

    రిప్లయితొలగించండి


  23. అరవపు యమ్మణి కథలన్
    బరబర బేర్చెను గడగడ పరగడుపునట
    న్నరయగ కథనంబందున
    నరసింహుని ప్రియసుతుండు నారాయణుఁడే :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. నరవర! ప్రహ్లాదుండే
    నరసింహుని ప్రియసుతుండు; నారాయణుఁడే
    నరసింహుని రూపమ్మున
    ధరణిని నెల్లూరునందు తనరెను కొండన్

    రిప్లయితొలగించండి