4, జూన్ 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1072 (రారమ్మని పిల్చె సాధ్వి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
రారమ్మని పిల్చె సాధ్వి రంజిల విటులన్.
(‘అవధాన వాణి’ గ్రంథం నుండి)

15 కామెంట్‌లు:

  1. పేరేమొ ' సాధ్వి ' యామెది
    హీరోయిను మోజు మీద హే ! చెన్నైకే
    చేరెను పస్తులు మాపగ
    రారమ్మని పిల్చె' సాధ్వి ' రంజిల విటులన్.

    రిప్లయితొలగించండి
  2. నీరమున విరియు పద్మము
    ఘోరమ్ముగ నెదురు జూచి కోపించ నెదన్ !
    భారము భ్రమరము లేకను
    రారమ్మని పిల్చె సాధ్వి రంజిల విటులన్ !

    ఇక్కడ విటులు = భ్రమరములు అనగా తుమ్మెదలు
    నిజానికి తుమ్మెదలు స్తీ స్వరూపమలు కదా ! కవులు కవిత్వము కోసం పురుష స్వరూపములు గా వాడతారు గనుక నేను వ్రాసినది సమం జసమేమో అనినా భావన పొరబడిన గురువులు మన్నించ గలరు

    రిప్లయితొలగించండి
  3. దూరమ్ము తగనిదనుచును
    రారమ్మని పిల్చె సాధ్వి, రంజిల విటులన్ [రంజిలవు + ఇటులన్]
    దారనుచేరక నొంటరి
    గారాత్రులుగడుపుటొప్పు కాదిలననుచున్

    రిప్లయితొలగించండి
  4. కష్టం మీద కిట్టించటానికి ప్రయత్నం చేశానండి
    సాధ్వి ఆ మాత్రం హెచ్చరిక చేస్తుందా అన్నది అనుమానమే

    రిప్లయితొలగించండి
  5. శ్రీరాము పూజకు పతిని
    రారమ్మని పిల్చె సాధ్వి; రంజిల విటులన్
    తా రమ్మనుచు పిలిచెనట
    ప్రారబ్ధ వశమున నొకతి పతితమ్మగుచున్.

    రామకృష్ణ గారు,
    పూరణ బాగున్నది.

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. చేరంగఁ జని మగని తా
    రారమ్మని పిల్చె సాధ్వి; రంజిల విటులన్
    రారండని వేశ్య పిలిచె;
    వేరైన పిలుపు లివియె వివేచన సేయన్!

    రిప్లయితొలగించండి
  8. ఆరమణుని సతి తోడన
    రారమ్మని బిల్చె సాధ్వి, రంజిల విటులన్
    నారీ మణు లుండు కతన
    భారముగా సాగు చుండె భార్యల బ్రదు కుల్

    రిప్లయితొలగించండి
  9. కీరమ్ములు కూతలిడగ
    భారమ్మయె క్రొమ్మధువులు వాసంతమునన్
    హేరాళమవ యళులు, విరి -
    రారమ్మని పిల్చె సాధ్వి; రంజిల విటులన్

    రిప్లయితొలగించండి
  10. నేరక జేసిరి తప్పులు
    తీరును మారిన కడుపుకు తినుటకు లేదే!
    కారుణ్యంబున కుడవగ
    రారమ్మని పిల్చె సాధ్వి రంజిల విటులన్!!

    రిప్లయితొలగించండి
  11. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ ప్రయత్నం ప్రశంసింప దగినది.
    *
    రామకృష్ణ గారూ,
    ఇదేదో ‘కిట్టించిన’ పూరణలా లేదు. ‘రంజిలవు + ఇటులన్’ అన్న విరుపులోనే మీ నైపుణ్యం ప్రస్ఫుటమౌతున్నది. చాలా చక్కని పూరణ. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘పతితమ్మగుచున్’ ఎందుకో ఈ ప్రయోగం అంత బాగా లేనట్లు అనిపిస్తున్నది. ‘పతితయె యగుచున్/ పతన మ్మగుచున్’ అంటే బాగుంటుందేమో!
    *
    గుండు మధుసూదన్ గారూ,
    ‘వివేచన’తో మీరు చేసిన పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    సబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    రవి గారూ,
    ఎంత కాలానికి పునర్దర్శనం! సంతోషం.
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి




  12. మారాము సేయు మగనిని
    రారమ్మని పిలిచె సాధ్వి .;రంజిల విటులన్
    చేరంగ రమ్మటంచును
    గారామున బిలుచుచుండ్రి గణికలు వీటన్.

    రిప్లయితొలగించండి
  13. కోరను ధన ధాన్యమ్ములు
    భారము నినువీడి మదిని భక్తిని కొలువన్ !
    చేరువ కావలె దివిజుల
    రారమ్మని పిల్చె సాధ్వి రంజిల విటులన్ !

    రిప్లయితొలగించండి
  14. కమనీయం గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘చుండ్రి’ ప్రయోగం తప్పనుకుంటున్నాను. అక్కడ ‘పిలుచుచుంద్రు’ అందామా?
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. "వేరొకరి భార్య పార్వతి
    పారూ! పారూ! అనకుర! పాపము గాదా!"
    వీరాంగన చంద్రముఖియె
    రారమ్మని పిల్చె సాధ్వి రంజిల విటులన్

    రిప్లయితొలగించండి