మిత్రులారా! మంచి సమస్యకు మంచి పూరణలు వచ్చునని యీ నాటి సమస్య లెస్సగ సెలవిచ్చుచున్నది. పూరించిన మిత్రులు శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి, శ్రీ గుండు మధుసూదన్ గారికి శ్రీ దువ్వూరి వెంకట నరసింహ సుబ్బా రావు గారికి శుభాశీస్సులు అభినందనలు. ఇంకా ఎన్నో మంచి పూరణలు కూడా వచ్చునని ఆశించుదాము. స్వస్తి.
దిగ్గని లేచి భీముడతి ధీరత కౌరవ రాజు యూరువున్ నుగ్గును చేసె, ఫల్గుణుడు నోటమి జూడని వీరుడై చు తా నిగ్గిన కర్ణు జంపె, శకునిన్ మరి శల్యుని జంపె దక్కి నా ముగ్గురు, పంచపాండవులు మూడు జగంబులవన్నెకెక్కరే?
అ ఆ ఇ ఈ లతో బాపు ముగ్గు వేసారు కదా ! అదే నా పూరణకు స్ఫూరణ ;
పద్య రచన - 169
కవిమిత్రులారా, పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి. వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 11/23/2012 06:34:00 ఆం 24 వ్యాఖ్యలు: గురువారం 22 నవంబర్ 2012
ఈ సమస్యను నేను నా 3వ అష్టావధానములో కొవ్వూరులో 1988లో పూరించేను ఈ విధముగా:
రిప్లయితొలగించండిఅగ్గలికంపు శక్తిమెయి నాహవమందు విరోధిజాలమున్
నుగ్గొనరించిరంచును వినోదముతో విజయోత్సవమ్మునన్
దిగ్గున లేచి యాడెడు ప్రదీప్తి యశో విభవాన్వయాంగనల్
ముగ్గురు పంచపాండవులు మూడు జగంబుల వన్నెకెక్కరే?
ఎగ్గులు జేయు సంఘటనల నేమియు ధర్మము దప్పకుంటచే
రిప్లయితొలగించండినుగ్గుగ జేయ కౌరవుల నూతన తేజము లొప్ప దీవెనల్
తగ్గవిధమ్ము కృష్ణుడును తాముగ శూలియు మారుతీయగా
ముగ్గురు, పంచపాండవులు మూఁడు జగంబుల వన్నె కెక్కరే!
ఎగ్గొనరింపఁ బూని, నయహీనులు కౌరవ బృందమెప్పుడున్
రిప్లయితొలగించండిసిగ్గును లేక, జ్ఞాతులను జిక్కులఁ ద్రోయుచునుండ, నోర్చియున్,
వెగ్గలమైన ధీరతను, వెన్నుని తోడును బూని, యిర్వుఱున్
ముగ్గురు పంచపాండవులు మూఁడు జగంబుల వన్నెకెక్కరే?
నేమాని పండితార్యా! మనోహరమైన పూరణ చేశారు.
రిప్లయితొలగించండిపగ్గము వైచె కోర్కెలకు పాండు నృపుండు, బలీయ మౌటచే
యొగ్గి శిరమ్ము నవ్విధికి, యూరడిలెన్ ముని వాక్కు చొప్పునన్
తగ్గ సుతద్వయమ్మగుట తన్వికి మాద్రికి, కల్గ కుంతికిన్
ముగ్గురు, పంచపాండవులు మూడు జగంబుల వన్నెకెక్కరే!
మధుసూదన్ గారు బలే చక్కగా పూరించారు.
రిప్లయితొలగించండినుగ్గొనరించి శత్రులఁ వినూత్న విచిత్ర భయంకరాజిలోఁ
రిప్లయితొలగించండికగ్గొనబోని ధైర్యము ప్రకాండపరాక్రమ సాహసంబులున్
వెగ్గలధీరశక్తి గల భీష్ముడు, ద్రోణ కృపార్యు లంచు నీ
ముగ్గురు, పంచపాడవులు, మూడుజగంబుల వన్నె కెక్కరే!
కగ్గొనబోని = వన్నె తగ్గని
మిత్రులారా!
రిప్లయితొలగించండిమంచి సమస్యకు మంచి పూరణలు వచ్చునని యీ నాటి సమస్య లెస్సగ సెలవిచ్చుచున్నది. పూరించిన మిత్రులు శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి, శ్రీ గుండు మధుసూదన్ గారికి శ్రీ దువ్వూరి వెంకట నరసింహ సుబ్బా రావు గారికి శుభాశీస్సులు అభినందనలు. ఇంకా ఎన్నో మంచి పూరణలు కూడా వచ్చునని ఆశించుదాము. స్వస్తి.
భగ్గున రేగు జ్వాలవలె పంతముఁ బూనిన ద్రోణపుత్రుడే
రిప్లయితొలగించండియెగ్గొనరింప, పాండు సుతులేవురజట్టు; హిడింబి పుత్రుడున్
తగ్గని ధీరుడై విజయ దాహముతో నభిమన్యవీరుడున్
ముగ్గురు, పంచపాడవులు; మూడుజగంబుల వన్నె కెక్కరే!
దిగ్గని లేచి భీముడతి ధీరత కౌరవ రాజు యూరువున్
రిప్లయితొలగించండినుగ్గును చేసె, ఫల్గుణుడు నోటమి జూడని వీరుడై చు తా
నిగ్గిన కర్ణు జంపె, శకునిన్ మరి శల్యుని జంపె దక్కి నా
ముగ్గురు, పంచపాండవులు మూడు జగంబులవన్నెకెక్కరే?
సరదాకు మరొకటి:
రిప్లయితొలగించండిదిగ్గున వెంగళప్ప తల దిమ్మగు రీతిని పల్కె మిత్రమా!
యెగ్గును చేతువా యడిగి? యింతయు నేరనె? చాలు చాలులే!
సిగ్గగు నాకు! మంచమును చెన్నుగ నిల్పెడు కోళ్ళ రీతిగా
ముగ్గురు పంచపాండవులు! మూడు జగంబులవన్నెకెక్కరే!
రిప్లయితొలగించండిదిగ్గున లేచి చెప్పెనొక డింగరి ప్రశ్నకు నుత్తరమ్ముగా
సిగ్గును వీడి చూపుచును జెచ్చర చేతిని రెండు వ్రేళులన్
మగ్గమునేయు తండ్రికిని మంచముకోళ్ళటు లెంచి చూడగా
ముగ్గురు పంచపాండవులు మూడు జగంబుల వన్నెకెక్కరే.
ఎగ్గులు బల్క కుండగను నేమరు పాటున నీతి దప్పకన్
రిప్లయితొలగించండిభగ్గున కోప తాపముల బాధను గొల్పెడి కీచకున్ గనన్
ధిగ్గున నాగ్రహం బుగను ధీరులు నైనను నోర్పు గల్గియా
ముగ్గురు పంచ పాండవులు మూడు జగంబుల వన్నె కెక్కరే !
హమ్మయ్య ఎలాగో కిట్టించాను గానీ ఎన్ని తప్పులో మరి
అగ్గిన బుట్టి తాను భరతాన్వయమందున మెట్టె కృష్ణయున్
రిప్లయితొలగించండిలగ్గన దైవమే యదుకులంబున జన్మిచె తాను కృష్ణుఁడై
మొగ్గ తొడంగె జాలరుల పోరికి మౌని వరాన కృష్ణుఁడీ
ముగ్గురు, పంచపాండవులు మూఁడు జగంబుల వన్నె కెక్కరే!!
రిప్లయితొలగించండిముగ్గులు బోలు వ్రాతలను ముంగిలి దెచ్చిరి భారతమ్మునున్
మొగ్గలు వేసి యాడగను మోదము నందున దెల్గు వారలున్
తగ్గరు తిక్క నెఱ్ఱనలు , త్రాతలె యాంధ్రము నన్నపార్యుతో
ముగ్గురు , పంచ పాండవులు , మూడు జగంబుల వన్నె కెక్కరే !
మిత్రుల పూరణలన్నీ అద్భుతం ! అన్నయ్యగారి పూరణ తలమానికముగా నున్నది.
రిప్లయితొలగించండిచి. తమ్ముడు డా. నరసింహమూర్తి పద్యములోని కవిత్రయ ప్రస్తావన ప్రశంసనీయముగా నున్నది. స్వస్తి.
రిప్లయితొలగించండిఅన్నయ్యగారికి అభివందనములు. ధన్యవాదములు. చిన్న సవరణతో ;
రిప్లయితొలగించండిముగ్గులు బోలు వ్రాతలను ముంగిలి దెచ్చిరి భారతమ్మునున్
మొగ్గలు వేసి యాడగను మోదము నందున దెల్గు వారలున్
తగ్గరు నన్నపార్యునికి , త్రాతలె తిక్కన యెఱ్ఱనాంధ్రమున్
ముగ్గురు , పంచ పాండవులు , మూడు జగంబుల వన్నె కెక్కరే !
అ ఆ ఇ ఈ లతో బాపు ముగ్గు వేసారు కదా ! అదే నా పూరణకు స్ఫూరణ ;
రిప్లయితొలగించండిపద్య రచన - 169
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 11/23/2012 06:34:00 ఆం 24 వ్యాఖ్యలు:
గురువారం 22 నవంబర్ 2012
రగ్గులు బొంతలన్ విడిచి లండను వీధిని నాటకమ్మునన్
రిప్లయితొలగించండిదగ్గులు తుమ్ములన్ గనక దారుణ రీతిని యుద్ధమందునన్
తగ్గని భీకరమ్మునను దాడిని చేసిన క్రీడి, భీము, తో
ముగ్గురు, పంచపాండవులు మూఁడు జగంబుల వన్నె కెక్కరే!