12, జూన్ 2013, బుధవారం

పద్య రచన - 370

కవిమిత్రులారా,

పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9 కామెంట్‌లు:

 1. చదువగ దీక్షతో వివిధ శాస్త్రములన్ గురులొద్ద నెంతయున్
  ముదమున పాఠశాలలకు బోవగ జూచుచునుండి రొప్పుగా
  నుదయమునందు నాత్రముగ నుండిరి యెందరొ బాలబాలికల్
  పదపడి వేచియుండిరట వాహన మెన్నడు వచ్చునో గదా!

  రిప్లయితొలగించండి
 2. వాహనమ్ముల నెక్కి యేగెడు పాఠశాలల బాలలం
  పాహి యంచును దేవదేవుని పైన నమ్మకముంచుచున్
  వాహనమ్ముల నిండు దారుల పట్టణమ్ముల సాగగా
  సాహసమ్మగు నేటి వేళల జంకు గొంకుల వీడుచున్

  రిప్లయితొలగించండి
 3. బాల బాలిక లందఱు పాఠశాల
  కేగు దృశ్యము జూడగ నిష్ట మయ్యె
  యూని ఫారము ధరియించి మేను నిండ
  ఒక్క రీ తిని నుండిరి యొక్క రొకరు

  రిప్లయితొలగించండి
 4. అమ్మా! రాజేశ్వరిగారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము తొలి పాదములో ప్రాసను మరిచేరు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 5. చదివెడిది యాంగ్ల చదువట
  చదివించెడి వాడు తండ్రి సహనము తానై
  చదివిన ధనహరమగునట
  చదువుము వేరొండు చదువు చదవగనేలా?

  చెల్లునొ చెల్లవో తమరు జేసెడి కోర్సులు కొల్వు జేరగన్
  తొల్లి గతించె, నేడు పెను దుడ్డును పెట్టిన కాని రాదు, మీ
  తల్లియు తండ్రియున్ కడు ముదంబు వహింప కొల్వు జేసెదో
  యెల్లి నిరాశ గూర్చెదవొ? యేర్పడ చింతన జేయు బాలకా!!

  రిప్లయితొలగించండి
 6. కాదనక బరువు మోయుచు
  వీధిన బడి పరుగు లిడుచు వేగిర పడగన్ !
  బాధలు పడి బడి జేరగ
  బోధించెడి గురువు లెంత పూజ్యు లనంగా ! ?

  గురువులకు ప్రణామములు

  రిప్లయితొలగించండి
 7. చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు...
  పండిత నేమాని వారికి,
  లక్ష్మీదేవి గారికి,
  సుబ్బారావు గారికి,
  జిగురు సత్యనారాయణ గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి