6, జూన్ 2013, గురువారం

సమస్యాపూరణం – 1074 (వేంకటశాస్త్రికి మనుమలు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
వేంకటశాస్త్రికి మనుమలు విల్సన్, ఖాదర్.

29 కామెంట్‌లు:

 1. ఈ రోజుల్లో ఇది వింతేమీ కాదు. ఎన్నో ఇళ్ళల్లో ఇట్లా జరుగుతూనే ఉంది.

  రిప్లయితొలగించండి
 2. శంకరు డీయ సమస్యను
  వేంకట శాస్త్రికి మనుమలు విల్సన్ ఖాదర్
  జంకక పూరించి బళా!
  లంకేశ్రు మహాప్రశంసలన్ గని రహహా!

  రిప్లయితొలగించండి
 3. నా పద్యము 4వ పాదములో ఒక టైపు పొరపాటు "లంకేశ్రు" కి బదులుగా లంకేశు అని చదువుకొందాము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 4. వేంకటశాస్త్రినిగూర్చి యిద్దఱు వ్యక్తుల సంభాషణ...

  శంకర, శ్రీధరశాస్త్రులు
  వేంకటశాస్త్రికి మనుమలు; విల్సన్, ఖాదర్,
  బంకట్ సింగులు స్నేహితు;
  లింకను వీరందరెంతొ హితబాంధవులే

  రిప్లయితొలగించండి
 5. జంకక ఖాదర్ బీ నే
  మంకుగ పెండ్లాడి కొడుకు మతమే మారెన్
  ఇంకేమి చెపుదు చూడగ
  వేంకట శాస్త్రికి మనుమలు విల్సన్ ఖాదర్

  రిప్లయితొలగించండి

 6. శంకరపట్నములోన శు
  భంకరులగు నిరుగు పొరుగు బాలకులే ని
  శ్శంకను "తాతా!" యనుటన్
  వేంకటశాస్త్రికి మనుమలు విల్సన్ ఖాదర్.

  రిప్లయితొలగించండి
 7. ఇంకొక మతమని యెంచక
  వంకర యోచనలు లేని వాని సుతుండున్
  గొంకక సాకగ నయ్యిరి
  వేంకట శాస్త్రికి మనుమలు విల్సన్ ఖాదర్

  రిప్లయితొలగించండి
 8. మాస్టరుగారూ !బహు చక్కని పూరణ .. బాగుంది.

  పండిత నేమాని వారు, మధు గారి పూరణలు వైవిధ్యంగా ఉన్నాయి.

  రిప్లయితొలగించండి
 9. ’కొంకణి’ని క్రైస్తవులతో,
  ’బేంకాక్’ ముస్లిముల తోడ వియ్యంబందెన్
  సంకుచిత భావ రహితుడు -
  వేంకటశాస్త్రికి మనుమలు విల్సన్, ఖాదర్!

  రిప్లయితొలగించండి
 10. శాస్త్రి గారూ ! ధన్యవాదములు. మీరు డొంక మార్గము పట్టకుండా చెప్పారు.. బాగుంది.

  రిప్లయితొలగించండి

 11. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో ,
  శ్రీ శంకరయ్య గురువర్యులకు ధన్యవాదములు

  మన్మోహన్ మంత్రి వర్గమంతయు కళంకిత మంత్రులతో నిండియుండినది
  =========*==========
  జంకక కింకర మూకలు
  పొంకముగా మంత్రి పదవి బొంది జనులపై
  బొంకుచు దిరుగ, జనులనెరి
  వేంకటశాస్త్రికి మనుమలు విల్సన్,ఖాదర్!
  (వేంకటశాస్త్రి= మన్మోహన్ ,మనుమలు= మంత్రులు )

  రిప్లయితొలగించండి
 12. ఒక గృహిణి:

  కుంకలకు అసలు పనిలే
  దింక! కిరికెటు, సినిమాలు, ధీటుగ టీవీ.
  సంకటమొచ్చెర రామా!
  వేంకటశాస్త్రికి మనుమలు విల్సన్,ఖాదర్!

  రిప్లయితొలగించండి
 13. లక్ష్మీదేవి గారూ,
  మీ మాటలు వాస్తవమే. ఇంకెన్ని చూడనున్నామో?!
  *
  పండిత నేమాని వారూ,
  వ్యంగ్యాత్మకమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ఇటువంటి సమస్యను సమర్థంగా పూరించి అలరింపజేసే కవులకు 'లంకేశుని ప్రశంసల' కంటే 'లంకేశుని వైరి మెప్పులన్ గని రహహా' అనవచ్చు కదా!
  *
  గుండు మధుసూదన్ గారూ,
  విరుపుతో చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  కానీ ఒక సందేహం... ఇస్లాంను స్వీకరించిన వాని కొడుకు విల్సన్ ఎలా అవుతాడు?
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మతసామరస్యాన్ని ప్రస్తావిస్తున్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
  అంతర్రాష్ట్ర, అంతర్జాతీయపు వియ్యాల ప్రస్తావనతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  ఏ సమస్యనిచ్చినా ప్రస్తుత దేశకాల పరిస్థితులకు అన్వయించేలా పూరించే నైపుణ్యం మీది. బాగుంది. అభినందనలు.
  *
  రవి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. కొంకా పల్లిన నుండిన
  వేంకట శాస్త్రికి మనుమలు విల్సన్ ఖాదర్
  పంకాలు బాగు జేయుచు
  లెంకలు గా బ్రదుకు చుండ్రి లేమిని కతనన్

  రిప్లయితొలగించండి
 15. శంకరు నింటికి వచ్చెను
  లింకన్, జూపగ నమస్కరించిరి భక్తిన్
  జంకక శంకర్ తండ్రికి,
  వేంకటశాస్త్రికి, మనుమలు విల్సన్,ఖాదర్!

  రిప్లయితొలగించండి
 16. వంకలు లేని కుటుంబము
  సంకలి తము యింటి పేరు సకల సుఖంబుల్ !
  బంకమ్మ మరియ స్నుషలట
  వేంకట శాస్త్రికి మనుమలు విల్సన్ ఖాదర్ !

  రిప్లయితొలగించండి
 17. సంకటమౌ కాల్ సెంటర్
  కింకరులై కొల్వుఁ జేర కృష్ణుడు శివుడున్
  జంకక మార్చిరి పేర్లను
  వేంకటశాస్త్రికి మనుమలు విల్సన్, ఖాదర్!!

  రిప్లయితొలగించండి
 18. జిగురు సత్యనారాయణ గారూ - నిజం కాదా మరి. పూరణ బాగుంది.
  సంకటమౌ కాల్ సెంటర్
  కింకరులై కొల్వుఁ జేర కృష్ణుడు శివుడున్
  జంకక మార్చిరి పేర్లను
  వేంకటశాస్త్రికి మనుమలు విల్సన్, ఖాదర్!!"

  రిప్లయితొలగించండి
 19. జిగురువారి పూరణ మంచి గురిచూసి కొట్టిన బాణంలా దూసుకెళ్ళింది. కాల్సెంటర్ "అన్నపూర్ణ" "యాన్" అని చెప్పటం, వినీత్, విల్సన్ అని చెప్పటం స్వయానా నేనెరుగుదును. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  లక్కరాజు వారూ,
  చంద్రశేఖర్ గారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 21. ఆర్యా ! ధన్యవాదములు. ముస్లిం యువతిని పెండ్లాది, క్రిస్తియన్ మతం పుచ్చుకున్నాడని నాభావం...సవరణతో...

  జంకక హసీన బట్టెను
  మంకుగ కొడుకే యవనుల మతమే మారెన్
  ఇంకేమి చెపుదు చూడగ
  వేంకట శాస్త్రికి మనుమలు విల్సన్ ఖాదర్

  రిప్లయితొలగించండి
 22. గోలి హనుమచ్ఛాస్త్రి వారూ,
  ఇప్పుడు మీ పూరణ సమర్థనీయంగా ఉంది. సంతోషం!

  రిప్లయితొలగించండి
 23. శంకర్,మురళీకృష్ణులు,
  వెంకటశాస్త్రికి మనుమలు,;విల్సన్,ఖాదర్,
  లింకన్,మొహియుద్దీన్లకు ,
  పొంకముగానుండిరూర,పుత్రులు గాగన్.

  రిప్లయితొలగించండి
 24. జంకిక లేకయె "రాబర్ట్"
  పొంకమ్ముగ నల్లుడయ్యె పోకిరి కాదే !
  బొంకే లేదిట "సోనియ!":
  వేంకటశాస్త్రికి మనుమలు విల్సన్, ఖాదర్

  రిప్లయితొలగించండి


 25. బొంకిన నౌ యతుక వలెను
  బొంగరమువలె తిరుగాడు బొమ్మా ! యెచటే
  సింగారీ తెలుపదగును
  వేంకటశాస్త్రికి మనుమలు విల్సన్, ఖాదర్ ?

  జిలేబి

  రిప్లయితొలగించండి
 26. సంకర మవగా మతములు
  జింకలు కూడగ పులులను చిత్రపు రీతిన్
  జంకక వెడలిరి తిరుమల
  వేంకటశాస్త్రికి మనుమలు విల్సన్, ఖాదర్

  రిప్లయితొలగించండి