21, జూన్ 2013, శుక్రవారం

పద్య రచన - 379 (అస్తి-నాస్తి)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
"అస్తి - నాస్తి"

14 కామెంట్‌లు:

 1. శ్రీపండితనేమాని గురువులకు నమస్సులతో

  అండ పిండ బ్రహ్మాండము నందు నిండి
  యుండె పరమాత్మ యన్నది యున్న మాట
  అన్న మాటను నమ్మక యంధులగుచు
  అస్తి-నాస్తి యనుచు వాదులాడు జనులు.

  రిప్లయితొలగించండి
 2. నాస్తినిజూడగ నరుడా
  అస్తియెగలదందు వీడుమనుమానంబే
  అస్తియె లేనిచొ వ్రాయగ
  నాస్తియె లేదయ్య రెంటి నడుమదె బ్రతుకౌ.

  రిప్లయితొలగించండి
 3. కలదని మరి లేదనుటకు
  కలదొక్కటి నరునియొక్క కలనో, భావం
  బుల యందో, కాదనుటకు
  నిలలో నెవ్వరికయినను హేతువు కలదే?

  రిప్లయితొలగించండి
 4. శ్రీపండిత గురువులకు నమస్సులతో

  ఆస్థి పాస్తులు పొందుటె యస్తి నేడు
  సద్గుణంబులు నాస్తియై సాగుచుండె
  రంగ మేదియైనను గాని రాజ్యమేలు
  నేతలందరి మాటలు నేతి బీర.

  రిప్లయితొలగించండి
 5. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  'లేనిచొ' అని హ్రస్వంగా ప్రయోగించరాదు కదా!
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
  చాలా బాగుంది మీ పద్యం. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. కలడు కలడను వానికి కలడు యతడు
  లేడు లేడను వానికి లేడు యతడు
  కలడు లేడను విచికిత్స కలుగ నేల
  కలడతడు సర్వ జగముల గనగ నెపుడు

  వాదు లాటల మునుగుట వ్యర్ధ మనియు
  దేవ దేవుని గనుచును దేహ భ్రాంతి
  వీడ, దేవుని పొందుట వింత కాదు
  ఆస్తి నాస్తి వాదము లేలను దార్యులార

  రిప్లయితొలగించండి
 7. ఉండినవాడెవడట? లే
  కుండగ పోయినదెవడట? గుండెల నిండా
  మెండగు విశ్వసముండగ
  అండ నిలువు ధర్మమునకు; అదియే దైవం ||

  రిప్లయితొలగించండి
 8. కలడొ లేడోయంచు కలుగును శంకలు
  ....జగదీశు గూర్చి జిజ్ఞాసువులకు
  కలదొ లేదోయంచు కలుగు సందేహంబు
  ....ధర్మమ్మునున్ గూర్చి ధరణి నేడు
  కలదొ లేదోయంచు కలిగెను మీమాంస
  ....కలికి నడుము గూర్చి కవివరునకు
  కలదొ లేదోయంచు తెలియదయ్యెను గదా
  ....తెలుగు సంస్కృతియును తెలుగు బాస
  కలదొ లేదొయనుచు కలవరపడనేల
  లేదు లేదు రక్ష లేదు లేదు
  విశ్వమందు నిల్లు వీడి వెడలు వాడు
  చేరగలడొ మరల చేరలేడొ?

  రిప్లయితొలగించండి
 9. మాస్టరుగారూ ! ధన్యవాదములు....
  సవరణతో...

  నాస్తినిజూడగ నరుడా
  అస్తియెగలదందు వీడుమనుమానంబే
  అస్తిని వదలుచు వ్రాయగ
  నాస్తియె లేదయ్య రెంటి నడుమదె బ్రతుకౌ.

  రిప్లయితొలగించండి
 10. యశము గలిగిన మిగులును వసుధ యందు
  యుగ యుగమ్ములు దాటిన జగతి మెచ్చ
  మంచి చెడు లన్న మాటలు వంచ నేను
  కలిమి లేములు క్షణికము కరుగు కలలు
  ఆస్తి పాస్తుల తలచుట నాస్తి యనగ

  రిప్లయితొలగించండి
 11. శ్రీనివాస్ గారూ,
  మీ పద్యాలు చక్కగా ఉన్నాయి. అభినందనలు.
  ‘కలడు + అతడు, లేడు + అతడు’ అన్నప్పుడు సంధి నిత్యము. యడాగమం రాదు. అక్కడ ‘కల డతండు, లే డతండు’ అంటే సరి!
  ‘ఏలనుదార్యులార’...? అది ‘ఏలనొ యార్యులార’ అనుకుంటాను.
  *
  రఘురాం గారూ,
  శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. సంతోషం!
  మీ పద్యం మంచి భావంతో బాగుంది. అభినందనలు.
  కాకుంటే చిన్న లోపాలు... ‘నిండా’ అనే వ్యావహారికం, గణంకోసం విశ్వాసమును ‘విశ్వసము’ అన్నారు. ‘ గుండెల నిండన్ / మెండగు విశ్వాస మలర...’ అందామా?
  *
  పండిత నేమాని వారూ,
  అద్భుతమైన పద్యంతో పలు అంశాలలో అస్తి నాస్తి విచికిత్స ఉన్నదో చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. నమస్కారం శంకరయ్య మాష్టారు గారు,
  తెలుగు బ్లాగు ప్రపంచం లో ఇచ్చావిహారం చేస్తున్న నాకు , మీరు నిర్వహిస్తున్న ఈ బ్లాగు తారసపడటము నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు పద్య రచన చేయదలచుకున్న వారికి ఒక చక్కని వేదికగా, వ్రాసిన పద్యాలను మీవంటి వారికి, ఇచ్చటనున్న పండిత పరిషత్తులో సమర్పించి, వాటిపై మీ అభిప్రాయాలను, సూచనలను, సవరింపులను తెలుసు కొనగలటం, పద్య రచనలో ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తున్న నా వంటి వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నా ఈ తప్పటడుగులు అప్పుడప్పుడు, "తప్పుటడుగులు"గా మారితే, నా మీద దయయుంచి వాటిని సరిదిద్దుకొనే సూచనలను తెలియజేయ ప్రర్ధన.
  చక్కటి విషయాలను తెలుసుకొని, నేర్చుకోగల ఈ అవకాశమును కల్పించిన మీకు కృతజ్ఞతాభివందనములు

  నా తోలి ప్రయత్నమునకు మీరిచ్చిన సవరణలు బాగున్నాయి. ధన్యవాదములు

  - శివ రఘురామ శర్మ.

  రిప్లయితొలగించండి
 13. శివ రఘురామ శర్మ గారూ! మీ పద్యం భావగర్భితంగా చాల బాగున్నది. అభినందనలు. ఔత్సాహిక పద్యకవులకు ఇది ఒక నిజమైన చక్కని తక్షశిలా విశ్వవిద్యాలయము. శ్రీ పండిత నేమానివారు శ్రీ శంకరయ్య మాష్టారు మున్నగు పెద్దలు మనలను తీర్చిదిద్దెదరు.

  రిప్లయితొలగించండి