రాజేశ్వరి అక్కయ్యా, బాగుంది మీ పద్యం. అభినందనలు. రెండవ పాదంలో ఒక అక్షరం 'దాగిలి మూతలు' ఆడుతున్నది. సవరించండి. * పండిత నేమాని వారూ, భవమే దాగిలి మూతలనీ, దానినుండి విముక్తి నివ్వమని 'భవుణ్ణి' కోరడం బాగుంది. మంచి పద్యం. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, ముచ్చటైన పద్యం చెప్పారు. అభినందనలు.
శీనా శ్రీనివాస్ గారూ, మీ సీస పద్యంలో చక్కని భావాన్ని ఆవిష్కరించారు. అభినందనలు. * వలిరెడ్డి శ్రీను గారూ, బ్లాగును సందర్శించినందుకు ధన్యవాదాలు. మీరు కోరినట్టుగా పద్యాలకు భావాన్ని ఇవ్వడం కదురక పోవచ్చు. పద్యాలను, పూరణలను వ్రాసిన కవిమిత్రులు వాటి భావాలను కూడా ఇస్తే అభ్యంతరం లేదు. స్వాగతిస్తున్నాను. బ్లాగు నిర్వాహకుడిగా అందరి పద్యాల భావాలను ఇవ్వడం నాకు సాధ్యం కాదు. అయినా బ్లాగులో వ్రాయబడుతున్న పద్యాలు చాలావరకు సరళంగా, సుబోధకంగా ఉంటున్నాయి. ప్రారంభంలో కాస్త ఇబ్బంది కలిగించినా చదువుతూ పోతే క్రమక్రమంగా పద్యాల భావాలను అవగాహన చేసుకొనే నేర్పు పట్టుబడుతుంది. స్వస్తి!
లోగిలి దాటుచు పరుగిడి
రిప్లయితొలగించండిదాగిలి మూతల టంచు దబ్బఱ క్రీడన్ !
బాగుగ నాడుచు పిల్లలు
వేగముగా దొరికి పోయి వెక్కస పడగన్ !
దాగిలి మూత లయ్యెను గదా భవ మియ్యది యీ యవస్థలో
రిప్లయితొలగించండినాగతి వీవెయంచు శరణంబును వేడుచునుంటి కావవే
భోగివరేణ్య భూషణ! విముక్తి నొసంగుము దేవ దేవ! నే
సాగిలి నీ పదాంబురుహ సన్నిధి మ్రొక్కెద సాదరంబుగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిలోగిలిలో తోటలలో
రిప్లయితొలగించండిమూగిన పిల్లలకునెంతొ ముచ్చట గొలుపున్
దాగిలి మూతలనాడగ
దాగుడుమూతను పలుకుచు దండాకోరున్
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిబాగుంది మీ పద్యం. అభినందనలు.
రెండవ పాదంలో ఒక అక్షరం 'దాగిలి మూతలు' ఆడుతున్నది. సవరించండి.
*
పండిత నేమాని వారూ,
భవమే దాగిలి మూతలనీ, దానినుండి విముక్తి నివ్వమని 'భవుణ్ణి' కోరడం బాగుంది. మంచి పద్యం. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ముచ్చటైన పద్యం చెప్పారు. అభినందనలు.
ఆడకు దాగిలి మూతలు
రిప్లయితొలగించండిఆడకు మా దొంగ యాట హాస్యము కొఱకున్
ఆడినచో లో కువగుదు
వాడాలని యుండు నపుడు నమ్మను నడుగూ .
దాగిలిమూతలాడె శశి దానదె మబ్బులఁ దేలె జూడుడా
రిప్లయితొలగించండిలోగిలి వెల్గగా పుడమి లోపల వెన్నెల నింప, మెల్లగా
సాగుచుఁ నున్నదా గగన చంపకమల్లదె గాంచరండహో
వేగమె, నాలసింపకుడి; విందగు కన్నుల, సోయగమ్మదో!
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మనోహరంగా ఉంది మీ పద్యం. అభినందనలు.
గోపాలుని బిలిచి గోపకాంతలు దాగెదరు చెట్టు పుట్టల దాపు సరస
రిప్లయితొలగించండిమతులైచు, వినగను మాధవు వేణు గాన మపుడు మురియుచు నాద లోలు
లై మైమర పున చాలముదమొంది గనగ నల్లనయ్య నపుడు నాతు లరిగె
దాపుల వీడుచు దామోదరుని లీలలు మరగి గోపిక లొక్క రొకరు
వేణు మాధవు డెంతటి వేడుక పడు
నాడ దాగిలి మూతలు, నాతుల మది
దోచి మన్మధ జనకుడు దొంగ లాగ
దాగ వెదుకగా లలనలు దాగు కొనుచు
గురువులకు నమస్కారములు. దయచేసి పద్యాలకు తాత్పర్యము కూడా జత చేయగలరు అని నా మనవి.
రిప్లయితొలగించండిశీనా శ్రీనివాస్ గారూ,
రిప్లయితొలగించండిమీ సీస పద్యంలో చక్కని భావాన్ని ఆవిష్కరించారు. అభినందనలు.
*
వలిరెడ్డి శ్రీను గారూ,
బ్లాగును సందర్శించినందుకు ధన్యవాదాలు.
మీరు కోరినట్టుగా పద్యాలకు భావాన్ని ఇవ్వడం కదురక పోవచ్చు. పద్యాలను, పూరణలను వ్రాసిన కవిమిత్రులు వాటి భావాలను కూడా ఇస్తే అభ్యంతరం లేదు. స్వాగతిస్తున్నాను.
బ్లాగు నిర్వాహకుడిగా అందరి పద్యాల భావాలను ఇవ్వడం నాకు సాధ్యం కాదు.
అయినా బ్లాగులో వ్రాయబడుతున్న పద్యాలు చాలావరకు సరళంగా, సుబోధకంగా ఉంటున్నాయి. ప్రారంభంలో కాస్త ఇబ్బంది కలిగించినా చదువుతూ పోతే క్రమక్రమంగా పద్యాల భావాలను అవగాహన చేసుకొనే నేర్పు పట్టుబడుతుంది. స్వస్తి!
లోగిలి దాటుచు పరుగిడి
రిప్లయితొలగించండిదాగుడు మూతలు యనెడి దబ్బఱ క్రీడన్ !
బాగుగ నాడుచు పిల్లలు
వేగముగా దొరికి పోయి వెక్కస పడగన్ !
గురువులకు ధన్య వాదములు
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిఇప్పటికీ అదే దోషం... అక్షరలోపం. అంతేకాక 'మూతలు + అనెడి' అన్నప్పుడు యడాగమం రాదు.
"దాగుడు మూతలనెడి యొక దబ్బఱ క్రీడన్" అందాం.
క్షమించాలి శ్రమ ఇచ్చినందుకు ఒకోసారి అస్సలు తట్టదు . సరి జేసి నందులకు ధన్య వాదములు
రిప్లయితొలగించండి