27, జూన్ 2013, గురువారం

సమస్యాపూరణం – 1095 (కుండలోనఁ బెట్టె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కుండలోనఁ బెట్టెఁ గువలయమును.

20 కామెంట్‌లు:

 1. పూజ కనుచు కలువ పూవులు గొనితెచ్చి
  మందిరమును జేరి మనసు పొంగ
  తళుకు లీనుచుండు దళములు రాలిపో
  కుండ లోన బెట్టె గువలయమును

  రిప్లయితొలగించండి
 2. విశదముగను చెప్ప విద్యార్థులకు " భూమి "
  పాఠమొకటి తాను పంతులయ్య
  గ్లోబును కొనితెచ్చె గూడు తుడిచి పడ
  కుండలోనఁ బెట్టెఁ గువలయమును.

  రిప్లయితొలగించండి
 3. కలువ యొకటి విరియఁ గాసారమందున,
  వన్నెఁ గాంచి మనసు పడియు నపుడు
  తనివిఁ గోసి, తెచ్చి, దాని ఱేకులు వాడ
  కుండఁ లోనఁ బెట్టెఁ గువలయమును!

  రిప్లయితొలగించండి
 4. పోరగాండ్ల బిలిచి భూగోళమును జూపి
  పాఠములను జెప్పె పంతులయ్య
  పాఠమైన పిదప పడిపోయి దొర్లి పో
  కుండ లోన బెట్టె కువలయమును

  రిప్లయితొలగించండి
 5. హరుడు లోక రక్ష యద్భుతముగఁ జేసె
  కడలి నుంచి వచ్చు గరళము దినె,
  కాలకూట విషము కంఠభాగము దిగ
  కుండ లోనఁ బెట్టెఁ గువలయమును

  రిప్లయితొలగించండి
 6. పండిత నేమాని వారూ,
  కువలయానికున్న అర్థాంతరంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  గ్లోబును పడకుండా పెట్టిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  రేకులు వాడకుండా కలువను పెట్టిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  దొర్లిపోకుండా గ్లోబును పెట్టిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  చెడ్డదైన (విష)వలయాన్ని గొంతు దిగకుండ జేసిన శివుని పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. సాయి పూజ కొఱకు చామంతి పూలను
  దెచ్చి , వాడకుండ పచ్చి కొఱకు
  కుండలోన బెట్టె గువలయమును మఱి
  వాడ కుండ నుండు వార మైన .

  రిప్లయితొలగించండి
 8. చెఱువులోన నీది చెంతనె యుండిన
  కలువ పూవు నొకటి గాంచి యొకడు
  వాటముగను గోసి నీటితో నింపిన
  కుండలోన బెట్టె కువలయమును

  రిప్లయితొలగించండి
 9. మూలమందు తాను మూలస్వరూపుడై
  యుండె నపుడు శక్తి యుండె తనకు
  తోడు శివుడు శక్తి తోడునుండగ నింగి
  కుండ లోన బెట్టె గువలయమును

  రిప్లయితొలగించండి
 10. క్షౌణిఁబ్రోవను కనకాక్షుని చెరనుండి
  విష్ణువవతరించె విట్చరముగ
  నంతనాహరి తనదంతములఁకదల
  కుండ లోనఁబెట్టెఁగువలయమును ||

  రిప్లయితొలగించండి
 11. నేత్ర యుగళమందు నెలరాజు రవితేజు
  వక్షమందులక్ష్మి లక్షణముగ
  పాదమందుగంగ ,పద్మనాభుడుదర
  కుండ లోనబెట్టె గువలయము!!!

  రిప్లయితొలగించండి
 12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 13. శ్రీ పీతాంబర్ గారి పద్యము చిన్న సవరణతో:

  నేత్ర యుగళమందు నెలరాజు దినరాజు
  వక్షముపయి లక్ష్మి లక్షణముగ
  నలరు శౌరి నుదరమను నట్టి కొండొక
  కుండలోన బెట్టె గువలయమును

  రిప్లయితొలగించండి
 14. సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  పచ్చి కొరకు - ?
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ రెండవ పూరణ కూడా బాగున్నది. అభినందనలు.
  *
  ‘శీనా’ శ్రీనివాస్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  గూడ రఘురామ్ గారూ,
  మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
  ‘దంతములన్ + కదల’ అన్నప్పుడు ద్రుత సంధి జరిగి ‘దంతములఁ గదల, దంతములం గదల, దంతముల న్గదల’ అన్న రూపాలు వస్తాయి.
  *
  మంద పీతాంబర్ గారూ,
  నేమాని వారి సవరణతో మీ పూరణ బంగారానికి తావి అబ్బినట్లయింది. చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. శ్రీ నేమానిగారు నాపద్యానికిచేసినసవరణ చాలాబాగుంది, మార్గ దర్శకంగా నూ వుంది,వారికి కృతజ్ఞతలు పాదాభివందనములు.

  రిప్లయితొలగించండి
 16. రాత్రి యనెడి వనిత ప్రీతిగా కొని దెచ్చె
  వెన్నె లనెడి పాలు వేడ్క మీర
  తోడు బెట్ట నెంచి వేడి తొర్లించ నింగి
  కుండ లోన బెట్టె గువలయ మును

  రిప్లయితొలగించండి
 17. శ్రీమతి రాజేశ్వరి గారి పద్యము చిన్న సవరణతో:

  రాత్రి యనెడి ముద్దరాలు తా గొనితెచ్చె
  వెన్నెల యను పాలు వేడ్క మీర
  తోడు బెట్ట నెంచి తొర్లించ నట నింగి
  కుండలోన బెట్టె గువలయమును

  రిప్లయితొలగించండి
 18. నమస్కారములు
  అద్భుతంగా సవరణ జేసిన గురువులకు ధన్య వాదములు
  అనుకున్న భావాన్ని చంధో బద్దంగా ఇమడ్చ లేక పోయినందులకు క్షమించ గలరు.

  రిప్లయితొలగించండి

 19. పచ్చి కొఱకు అనగా పసుపు పచ్చ దనము కొఱకు
  గా అన్వయించుకొన ప్రార్ధన .

  రిప్లయితొలగించండి
 20. శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో ,

  గురువు గారికి ధన్యవాదములు
  ======+=======
  పులి కుండ లోన బెట్టె గు
  వలయమును, చిలుకలు నడచె వయ్యారము గన్
  తిలకించిన జనులకు మది
  పులకించగ పలు విధముల బొగడిరి బ్లాగున్
  =====+========
  గురువుల బలుకుల్ విని బడ కుండ లోన
  బెట్టె గువలయమును, పట్టు బట్టె చిలుక
  పావురముతోడ, యువతిని బలుక రించ
  ప్రేక్షకులు బరవశ మొందె ప్రీతి తోడ

  రిప్లయితొలగించండి