5, జూన్ 2013, బుధవారం

పద్య రచన - 363 (సన్మాన సభలు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“సన్మాన సభలు”

9 కామెంట్‌లు:


 1. డా.మాడుగుల నాగ ఫణి శర్మగారిచే చేయబడిన సప్తోత్తరద్విశతావధానము గురించి చింతా రామకృష్ణారావు గారు వ్రాసిన వివరాలు తప్పక చూడగలరు.

  http://andhraamrutham.blogspot.in/2013/06/blog-post_5.html

  రిప్లయితొలగించండి
 2. సన్మా నింతురు కవులను
  సన్మానపు సభలు జరిపి సముచిత రీ తిన్
  సన్మా నించుట మన విధి
  సన్మానము నీ యు తృప్తి సత్క వుల కునున్

  రిప్లయితొలగించండి
 3. పండితులును మరియు ప్రాశస్త్యమునుఁ బొంది
  నట్టి గొప్ప కవులు నైన వారు
  జనహితులగు వారు సన్మానమునుఁ బొంద
  గలరు సభలయందు కనుడు నిజము.

  రిప్లయితొలగించండి
 4. సన్మానము కోరకనే
  సన్మిత్రులు చేయుచుంద్రు సహృదయ మెలయన్
  ఉన్మాదులు కొందరెపుడు
  సన్మానము కోరుకొంద్రు స్వార్థ మనస్కుల్.

  రిప్లయితొలగించండి
 5. స్వాగత గీతముల్ స్వరసుధల్ చిలుకుచు
  ....నాలపించెదరు సమాదరమున
  మోయజాలని పెద్ద పూల మాలల వేసి
  ....యంజలి బట్టెద రతినయమున
  కాంతులు చిందెడు కాశ్మీరు శాలువల్
  ....కప్పెద రెంతయు నొప్పుమీర
  ఇంద్రుండు చంద్రుండు నితనికి సరిరార
  ....టంచు ప్రశంసింతు రద్భుతముగ
  అర్హులైన వారి కారీతి సన్మాన
  సభల జరుపుటెల్ల సముచితంబు
  కాని వారి నెల్ల గౌరవించుట నేడు
  చూడలేదె? మిగుల చోద్యమనుచు

  రిప్లయితొలగించండి
 6. లక్ష్మీదేవి గారూ,
  ‘ఆంధ్రామృతం’ బ్లాగులో ఆ అవధాన విశేషాలను చదివి ఆనందించాను. ధన్యవాదాలు.
  *
  ‘సన్మాన సభలు’ అన్న అంశంపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు...
  సుబ్బారావు గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  కమనీయం గారికి,
  పండిత నేమాని వారికి,
  అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. సన్మాన సభల పేరిట
  నున్మాదము పెరిగి వేడ్క నూరి జనంబుల్ !
  తన్మయము నొంది పొంగుచు
  నున్మేషము లేక తనరు నూతన మంచున్ !

  ఉన్మేషము = కాంతి , అభివృద్ధి, వికాసము !

  రిప్లయితొలగించండి
 8. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి