గుండు మధుసూదన్ గారూ, తన పగ తీరునట్లు భీముని చేత చచ్చే అవకాశాన్ని కల్పించినందుకు ద్రౌపది దుశ్శాసనుని కీర్తించిందన్న మీ పూరణ బాగుంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, దుశ్శాసనుడి రొమ్ము జీల్చిన భీముని కీర్తించిందన్న మీ పూరణ బాగుంది. అభినందనలు. * తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ, విరుపుతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. ‘దుస్ససేనుని’ తరువాత కామా పెడితే సులభగ్రాహ్యమౌతుంది.
శ్రీనివాస్ గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. మూడవ పాదంలోని గణదోషం మీ దృష్టికి రాలేదనుకుంటాను. ‘రక్తము’ను ‘రక్తమ్మును’ అని సవరిస్తే సరి! * గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఱొమ్ముఁ జీల్చియుఁ ద్రాగ రక్తమ్ము; మఱియుఁ
రిప్లయితొలగించండిదనదు కేశ సంస్కరణమ్ముఁ గొనలు సాఁగఁ;
గదన రంగాన "భీమున" కదను నిడిన
దుస్ససేనునిఁ గీర్తించె ద్రుపదతనయ!
ప్రతిన నెరవేర్చ బూనుచు బలము తోడ
రిప్లయితొలగించండిరొమ్ముజీల్చియు మరి రుధిరమ్ము ద్రావ
యుద్ధమందున భీముండు గ్రుద్ది గ్రుద్ది
దుస్ససేనునిఁ, గీర్తించె ద్రుపదతనయ.
శ్రీపండితనేమాని గురువులకు నమస్సులతో
రిప్లయితొలగించండివలువలూడదీయ పనుప తులువ నీచ
దుస్ససేనునిఁ గీర్తించె ద్రుపదతనయ
మాన సంరక్షణార్థియై మనసు నందు
అచ్యుతుని నన్య మెరుగక నార్తితోడ.
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండితన పగ తీరునట్లు భీముని చేత చచ్చే అవకాశాన్ని కల్పించినందుకు ద్రౌపది దుశ్శాసనుని కీర్తించిందన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
దుశ్శాసనుడి రొమ్ము జీల్చిన భీముని కీర్తించిందన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
విరుపుతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
‘దుస్ససేనుని’ తరువాత కామా పెడితే సులభగ్రాహ్యమౌతుంది.
కౌరవేంద్రుడు, వలువల జీరునట్టి
రిప్లయితొలగించండిదుస్ససేనునిఁ కీర్తించెఁ, ద్రుపదతనయ
భక్తిపూర్వక వేదన ఫలముచేత
నక్షయంబుగ వస్త్రంబులరసిగాంచె
భీమసేనుండు యేరిని భీకరముగ
రిప్లయితొలగించండిజంపె? నారదుడు హరిని దలచెనెట్లు?
ద్రౌపది యనగ నెవ్వరి తనయ యగును?
దుస్ససేనునిఁ,గీర్తించె,ద్రుపదతనయ.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండివిరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
భీషణ ప్రతినను చేసిన భీము డపుడు
రిప్లయితొలగించండికదనమున కాలునివలె కాలు దువ్వి
గుండె జీల్చి రక్తము గ్రోలి జంప
దుస్ససేనుని, కీర్తించె ద్రుపద తనయ
రిప్లయితొలగించండిఆర్యా!
రెండవ పాదము లో గణ దోషము సవరించి పంపుచున్న పూరణ గమనించ గలరు. (శీనా )శ్రీనివాస్.
భీషణ ప్రతినను చేసిన భీము డపుడు
కదనమున కాలునివలెను కాలు దువ్వి
గుండె జీల్చి రక్తము గ్రోలి జంప
దుస్ససేనుని, కీర్తించె ద్రుపద తనయ
ఆ మహా భారతానీక మందు తాను
రిప్లయితొలగించండిజేసిన ప్రతిజ్ఞ నెరవేర్చ జీల్చి రొమ్ము
భీమ సేనుండు చంపెను పెచ్చ గిల్లి
దుస్ససేనుని, గీర్తించె ద్రుపద తనయ .
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీపండితనేమాని గురువులకు నమస్సులతో
రిప్లయితొలగించండిరుద్రుడై రొమ్ము చీల్చుచు రుధిరము గొని
దుస్ససేనునిఁ, గీర్తించె ద్రుపదతనయ
తనదు కేశాగ్రముల పూయ తనివి తీర
భీమసేను ప్రతిన తీర ప్రీతి తోడ.
శ్రీనివాస్ గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
మూడవ పాదంలోని గణదోషం మీ దృష్టికి రాలేదనుకుంటాను. ‘రక్తము’ను ‘రక్తమ్మును’ అని సవరిస్తే సరి!
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.