మన ధర్మమ్ము సనాతన మ్మలరు ప్రామాణ్య ప్రకాశమ్ముతో ఘన విజ్ఞాన నిధానమై సకల లోక శ్లాఘ్యమై యంచు పావన భావంబుల వెల్వరించిరి గురుల్ ప్రఖ్యాత సమ్మేళనం బున వేదాంత వివేక మార్గ నిరతుల్ మోదింపగా లోకముల్
హిందూ మత భావమ్మును పొందికగా లోకమునకు బోధించుటకై అందరు గురువులు నిలచిన సుందర దృశ్యమ్ము మిగుల శోభన్ గూర్చెన్.
ఆది శంకరా చార్యులు మధ్య నుండిధర్మ గురువులు వరుసగ దరిని వెలుగుచిత్ర మయ్యది జూడుడు శిశి వు లార !పుణ్య దినమిది నిజముగా బుణ్య దినము
మతాచార్యులను ఒక్కచోట దర్శించడం మన భాగ్యమే.. చిత్రాన్ని చూసి స్పందించి చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు...పండిత నేమాని వారికి,గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,సుబ్బారావు గారికి,అభినందనలు, ధన్యవాదాలు.
దేశము నాలుగు చెఱగుల క్లేశము లేకుండ జనులు కెరలు కొనంగన్ ! కాశీ నాధుని రూపమునాశీర్వాదంబు లిడిరి యా గురువు లనంగా ! కరలు కొను = పొంగు , అతిశయించు ,చెలరేగు
క్షమించాలి కెరలు కొను = పొంగు , చెలరేగు అతిశయించు
మన ధర్మమ్ము సనాతన మ్మలరు ప్రామాణ్య ప్రకాశమ్ముతో
రిప్లయితొలగించండిఘన విజ్ఞాన నిధానమై సకల లోక శ్లాఘ్యమై యంచు పా
వన భావంబుల వెల్వరించిరి గురుల్ ప్రఖ్యాత సమ్మేళనం
బున వేదాంత వివేక మార్గ నిరతుల్ మోదింపగా లోకముల్
హిందూ మత భావమ్మును
రిప్లయితొలగించండిపొందికగా లోకమునకు బోధించుటకై
అందరు గురువులు నిలచిన
సుందర దృశ్యమ్ము మిగుల శోభన్ గూర్చెన్.
ఆది శంకరా చార్యులు మధ్య నుండి
రిప్లయితొలగించండిధర్మ గురువులు వరుసగ దరిని వెలుగు
చిత్ర మయ్యది జూడుడు శిశి వు లార !
పుణ్య దినమిది నిజముగా బుణ్య దినము
మతాచార్యులను ఒక్కచోట దర్శించడం మన భాగ్యమే.. చిత్రాన్ని చూసి స్పందించి చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సుబ్బారావు గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
దేశము నాలుగు చెఱగుల
రిప్లయితొలగించండిక్లేశము లేకుండ జనులు కెరలు కొనంగన్ !
కాశీ నాధుని రూపము
నాశీర్వాదంబు లిడిరి యా గురువు లనంగా !
కరలు కొను = పొంగు , అతిశయించు ,చెలరేగు
క్షమించాలి
రిప్లయితొలగించండికెరలు కొను = పొంగు , చెలరేగు అతిశయించు