29, జూన్ 2013, శనివారం

పద్య రచన – 387 (అదృష్టము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“అదృష్టము”

13 కామెంట్‌లు:

  1. గురువు గారికి, గురుపత్ని గారికి త్వరలో స్వస్థత చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నాను.

    నిన్న రఘురామ్ గారి తాతయ్య గారి పడక కుర్చీ జ్ఞాపకాలు బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  2. ధైర్యము గల వీరులకును
    స్తైర్యము మిన్నుగ గలిగిన స్థిర చిత్తులకున్
    శౌర్యము గుణసంపద గను
    కార్యము లను చేయు వారి కదృష్టమదే

    రిప్లయితొలగించండి

  3. దృ ష్టము గానిది పుడమిని
    స్పష్టము గా జూడ లేము సాకార ముగన్
    శిష్టులు వక్కాణిం తురు
    దృష్టము మఱి కాని దంత దృ ష్ట మ యగునౌ

    రిప్లయితొలగించండి
  4. మట్టి పట్టినగాని మాణిక్యమై మారి
    ........జిల్గువెల్గుల కాంతిఁ జిలుకరించు
    చిన్ని ప్రయత్నంబు జేయగల్గినఁ జాలు
    ........ భూరి ఫలముల తోడ జీరబల్కు
    తండోపతండమై తప్పుజేసినగాని
    .........చిక్కనివ్వదు దీని సేవఁ గనుడు
    కత్తి చేతఁ బట్ట తత్తర పడువాడు
    ..............రాజ్యాభిషిక్తుడై రాజ్యమేలు

    నెవరి చేతనైననెఱిగించ తరమౌనే
    భువి నదృష్టమిచ్చు భూరి గతులఁ
    పోరి సేయవలయు పురుషప్రయత్నంబు
    దైవ నిర్ణయంబు తథ్యమౌను.

    రిప్లయితొలగించండి
  5. దృష్టయును కానని యెడనదృష్టమగును,
    భాగ్యమునకు కూడనిదియె పలుకుబాటు,
    పూరణమునకు నెద్దాని పొసగజేతు
    తెలియలేదు గాననిటుల తృప్తి పడితి.

    రిప్లయితొలగించండి
  6. ఉదృత మగు ప్రళ యాగ్నులు
    అదృష్టము కలిసి రాక యాపద లిచ్చున్ !
    సదృశ మైన శక్తిని
    యదృశ్యము సలిపి జనుల నాటాడించున్ !

    రిప్లయితొలగించండి

  7. కంది శంకరయ్య గారి యదృష్టము
    గూర్చి చెప్పు నెడల కొంత నయము
    చిరుప్రమాదముమందు చిన్న గాయములతో
    బయట పడెను కాదె బాగు బాగు

    రిప్లయితొలగించండి
  8. అదృష్టము గూర్చి ఈ నాడు వచ్చిన పద్యములు చాల బాగుగ నున్నవి. పంపిన వారందరకీ శుభాశీస్సులు.

    1. శ్రీ శ్రీనివాస్ గారు: 4వ పాదములో అదృష్టమదే అనుచోట గణభంగము. "అ" గురువు కాలేదు.

    2. శ్రీ సుబ్బారావు గారు: 4వ పాదమును ఇలాగ మార్చండి: దృష్టముకానిదె కదర యదృష్టమనంగా

    3. శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు:
    -- భూరి ఫలములతో జీర బల్కు - అని మార్చాలి.
    -- కత్తి చేతను బట్ట తత్తర పడు వాడు - అనాలి.
    -- తేటగీతిలో: తరమౌనె - టైపు పొరపాటును దిద్దాలి.

    4. శ్రీమతి లక్ష్మీదేవి గారు: తృప్తిగా వ్రాసేరు పద్యమును.

    5. శ్రీమతి రాజేశ్వరి గారు: ఉద్ధృతమగు అనాలి. 2, 3, 4 పాదములలో గణ భంగము. ఉద్ధృతమునకు ప్రాస వేయుట కష్టము.

    రిప్లయితొలగించండి
  9. స్పష్టము జేయుచునుంటిన
    దృష్టము మరిలేకయున్న తెలివెంతున్నన్
    కష్టము మానవునకు సం
    తుష్టిగనే బ్రతుకు గడుప తోడెవరున్నన్.

    రిప్లయితొలగించండి
  10. నా పద్యము 3వ పాదములో 'ము" ఎక్కువగా నున్నది. ఆ అక్షరమును తొలగించి చిరు ప్రమాద మందు అని చదువుకొనవలెను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారి పద్యము బాగుగ నున్నది. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. కవిమిత్రులకు నమస్కృతులు..
    నిన్న ఉదయం పద్యరచనకు శీర్షిక ఏమివ్వాలా అని ఆలోచిస్తుండగా నా ఆక్సీడెంట్ విషయం తెలిసి పరామర్శించడానికి పొరుగింటాయన వచ్చాడు. మాటల సందర్భంలో “అదృష్టం.. చిన్న గాయాలతో అయిపోయింది..” అన్నాడు. వెంటనే ఆ “అదృష్టం” శీర్షిక అయిపోయింది.
    పండిత నేమాని వారు సరిగ్గా ఊహించి తగిన పద్యాన్ని వ్రాసి నాకు సాంత్వన కల్గించారు. వారికి ధన్యవాదాలు.
    ఇక చక్కని పద్యాలను వ్రాసిన కవిమిత్రులు.....
    ‘శీనా’ శ్రీనివాస్ గారికి,
    సుబ్బారావు గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి