శ్రీ గూడా రఘురాం గారూ! శుభాశీస్సులు. మీ సీస పద్యము బాగుగనున్నది. కొన్ని సూచనలు:
1. వాయిద్య అనుట సాధు ప్రయోగము కాదు. వాద్య అనవలెను. లేదా వాయిదము అనికూడా అనవచ్చును. 2. సలిపేటి - కి బదులుగా : సలిపెడు అనవలెను. 3. జడమగు.... అనే పాదమునకు బదులుగా ఈ విధముగా మార్చండి: "జడమైన జగతిలో జగదీశు గనుటెట్లు"......
లలిత కళల్ సమస్త కళలన్ బరికీర్తిని గాంచి లెస్సగా యలరును నృత్య గీత కవనాదులుగా; దనరార జేయు ని చ్చలు జన మానసంబులను; సత్కళ లిమ్ముగ నభ్యసించి భా సిలిరి కదా యనేకులు విశేషముగా రస సాంద్ర మూర్తులై
శ్రీరఘురాం గారూ! శుభాశీస్సులు. మీరు నన్ను మాష్టారూ అని సంబోధించేరు. సంతోషము. నేను వృత్తిరీత్యా "కంపెనీ సెక్రెటరీ" - ప్రవృత్తి పద్య కవిత్వము - అధ్యాత్మ విద్య. స్వస్తి.
పండిత నేమాని వారూ, కళాపూర్ణమైన మీ పద్యం మనోరంజనాన్ని కలిగించింది. అభినందనలు. ‘లెస్సగా నలరును’ అని ఉండాలనుకుంటాను. * నాగరాజు రవీందర్ గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. ‘కాణాచి + ఇదియే’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘కాణాచి యిదే’ అందాం. * రాజేశ్వరి అక్కయ్యా, బాగుంది మీ పద్యం. అభినందనలు. రెండవ పాదంలో ఒక లఘువు తక్కువయింది. ‘కలతలు’ అంటే సరి! * మిస్సన్న గారూ, నేమాని వారి ద్వారా పద్యాన్ని పంపినందుకు ధన్యవాదాలు. మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు. లెస్సగా నలరును అని నుగాగమమునే చేయాలి. సవరించినందులకు సంతోషము.నిన్న ఏ మాత్రము తీరిక లేకున్నా హడవుడిలోనే టైపు చేసాను. స్వస్తి.
సంగీతము సాహిత్యము
రిప్లయితొలగించండిహంగుగ నాట్యమ్ము శిల్పమాదియు మరియున్
రంగారు చిత్ర కళయును
బంగారీ! యొకటి యున్న భాగ్యమె మనకున్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
లలితకళలని వేటి నందురనగా...
రిప్లయితొలగించండిలలితముగ మనముల పరగ
నలరించెడు కళలనెల్ల నందురు, నయన
మ్ముల, శ్రవణమ్ముల మూలము
శిల వంటి మనుజుల కరుగజేయును మహిలో.
లలిత కళలు మిగుల లలితము గానుండి
రిప్లయితొలగించండిమనసు దోచు కొనుచు మరులు గొలుపు
మమత కలుగ జేసి మఱి మఱి గన జేయు
కళలు లోన మిన్న కళలు నమ్ము
ఓంకారమదియేఁగ ఆలవాలము సర్వ
రిప్లయితొలగించండిసంగీత,వాయిద్య శాస్త్రములకు |
నటరాజు సలిపేటి తాండవంబున గాఁద
నాట్యశాస్త్రము తొలినడకనేర్చె |
జగము మాయయనుకూర్చముతోనొడలిపైన
శివుడు గీసికొనిన చిత్రపటము |
జడమగు జగతిన జగపతిఁగనుటెట్లొ
శిలలఁశిల్పముఁజూపు శిల్పిదెలుపు |
హరుని డమరుకానాదములందె వేద
సాహితీవాఙ్మయము తొలి శ్వాసనొందె
పంచకళలఁబూజించెనాభవుడు దేవి
లలితనవ్విధిన్; అవి నేటి లలితకళలు ||
పైన వ్రాసిన పద్యమందు తొలి పాదమును,
రిప్లయితొలగించండి"ఓం కారమదియేగ ఊతమయ్యెను సర్వ
సంగీత, వాయిద్య శాస్త్రములకు".. అని సవరించుకుందాము..
- ధన్యమావదములు
శ్రీ గూడా రఘురాం గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ సీస పద్యము బాగుగనున్నది. కొన్ని సూచనలు:
1. వాయిద్య అనుట సాధు ప్రయోగము కాదు. వాద్య అనవలెను. లేదా వాయిదము అనికూడా అనవచ్చును.
2. సలిపేటి - కి బదులుగా : సలిపెడు అనవలెను.
3. జడమగు.... అనే పాదమునకు బదులుగా ఈ విధముగా మార్చండి:
"జడమైన జగతిలో జగదీశు గనుటెట్లు"......
స్వస్తి.
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
*
రఘురామ్ గారూ,
మీ సీసపద్యం చాలా బాగుంది. అభినందనలు.
నేమాని వారి సవరణలను గమనించారు కదా...
‘వాయిద్య శాస్త్రములకు’ అన్నదానిని ‘వాద్య సుశాస్త్రములకు’ అనండి.
*
పండిత నేమాని వారూ,
ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిలలిత కళల్ సమస్త కళలన్ బరికీర్తిని గాంచి లెస్సగా
యలరును నృత్య గీత కవనాదులుగా; దనరార జేయు ని
చ్చలు జన మానసంబులను; సత్కళ లిమ్ముగ నభ్యసించి భా
సిలిరి కదా యనేకులు విశేషముగా రస సాంద్ర మూర్తులై
కళ లరువది నాల్గు, లలిత
రిప్లయితొలగించండికళ లందున నైదు వెరసి ; కలిగెను భువిలోన్ !
కళలకు కాణా చివియే !
కళ లన్నిట మేలు లలితకళలగు నెపుడున్.
మీ సవరణలు చాలా బాగున్నవి నేమాని మాష్టారు గారు..
రిప్లయితొలగించండిమీ సూచనలకు ధన్యవాదములు..
మీ చంపకమాల చక్కగానున్నది..
వాద్య సు శాస్త్రములన్న మాట చక్కగా కుదురుకున్నది.. ధన్యవాదములు శంకరయ్య మాష్టారు గారు..
శ్రీరఘురాం గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీరు నన్ను మాష్టారూ అని సంబోధించేరు. సంతోషము. నేను వృత్తిరీత్యా "కంపెనీ సెక్రెటరీ" - ప్రవృత్తి పద్య కవిత్వము - అధ్యాత్మ విద్య. స్వస్తి.
అరువది నాలుగు కళలవి
రిప్లయితొలగించండిమరపించి మదిని కలత మటు మాయమవన్ !
కరిగించి ముదము గూర్చగ
వర మిచ్చిన దైవ మునకు వాలెద భక్తిన్ !
శ్రీ మిస్సన్న గారి పద్యము:
రిప్లయితొలగించండితళుకు తళుక్కునన్ మెరయు తారల కాంతులు, లోక మంతటన్
వెలుగుల నింపు భాస్కరుని వేడిమి, రాలను గూడ వెన్న ము
ద్దలవలె జేయు రేవిభుని తత్త్వము, నన్నియు నెంచి చూడ, నీ
కళలని నమ్ముదున్ లలిత! కాంతుల కాంతివి నీవె చిన్మయీ!
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండికళాపూర్ణమైన మీ పద్యం మనోరంజనాన్ని కలిగించింది. అభినందనలు.
‘లెస్సగా నలరును’ అని ఉండాలనుకుంటాను.
*
నాగరాజు రవీందర్ గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
‘కాణాచి + ఇదియే’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘కాణాచి యిదే’ అందాం.
*
రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
రెండవ పాదంలో ఒక లఘువు తక్కువయింది. ‘కలతలు’ అంటే సరి!
*
మిస్సన్న గారూ,
నేమాని వారి ద్వారా పద్యాన్ని పంపినందుకు ధన్యవాదాలు.
మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిలెస్సగా నలరును అని నుగాగమమునే చేయాలి. సవరించినందులకు సంతోషము.నిన్న ఏ మాత్రము తీరిక లేకున్నా హడవుడిలోనే టైపు చేసాను. స్వస్తి.