ప్రాతర్వేళల స్నానమెక్కడిది ? దైవ ప్రార్థనా భాగ్య మే రీతిన్ గల్గును ? శౌచమెక్కడిది ? దారింబోవునవ్వానికిన్ వీతాభ్యాసమె ధ్యానమున్ ; జపతపావృత్తమ్ము నిర్ధూతమే చేతశ్శాంతము శూన్యమే యగు గదా ! శిష్యా ! నిజమ్మే కదా !
అగ్ని భయము పెక్కు వ్యాధుల భయమింక జల భయమ్ము యాత్ర సలుపు వాని వెన్ను నంటి యుండు వినుమయ్య నా మాట ! యాత్రలందు నేమి హాయి కలదు ?
బడలిక చెంది చెంది ; పలు బాధల గీడ్పడి క్షుత్పిపాసలన్ దొడిబడి ; చోర భీతి గనుదోయిని మూయక నిద్ర లేమిచే నడలు గదా సదా పథికు డాతని కెట్టుల దైవ భక్తి ని ల్చెడు"నని శంకరుండు తన శిష్యునితో బలుకంగ నాదటన్ -
"ఈ గురు పీఠి యందే గల్గు సకల పు ణ్య క్షేత్రములు శంకరార్య ! నిజము ! ఈ గురు వచనమందే సర్వ వేద శా స్త్రాళి వర్తిలు శంకరార్య ! నిజము ! ఈ గురు సేవ యందే లభియించు పు ణ్య విభూతి యో శంకరార్య ! నిజము ! ఈ గురు రూపమందే నెలకొను దేవ తాశేష తతి శంకరార్య ! నిజము !
గురుని బోధ మీరకూడని దాచార్య ! గురున కెదురు పల్కకూడదార్య ! కాని చిన్న వినతి - కడు దయ నాలింప వలయు" ననియె పద్మపాదుడంత !
డా. విష్ణునందన్ గారు ఒక మంచి ఖండికను వెల్వరించిరి. వారికి శుభాభినందనలు. సముచితమైన విషయము - శ్రీ శంకర భగవత్పాదులకు శ్రీ పద్మపాదాచార్యునకు జరిగిన సంవాదం చాల బాగుగనున్నది. స్వస్తి.
జిలేబీ గారూ, ఈ నాటి మీ వ్యాఖ్యలో తేటగీతి ఛాయలు కనబడుతున్నవి. కొద్దిగా శ్రమిస్తే మీరూ పద్యాలు వ్రాయవచ్చు. స్వస్తి! * పండిత నేమాని వారూ, చాలా చక్కని పద్యం చెప్పారు. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * డా. విష్ణునందన్ గారూ, శంకర పద్మపాద సంవాద రూపమైన మీ తీర్థయాత్రా వృత్తాంతం మనోహరంగా, జ్ఞానదాయకంగా ఉంది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు.
శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో , ======*======= పాప కర్మలందు బడిన పంచకమున కర్మ యన్న కర్పూరము గరుగ,జనులు తిరుమలేశుని గాంచిన తీర్థ యాత్ర పుణ్య ఫలము నొందు మునుపు పుడమి నందు (పంచకమున= యుద్దభుమిలో )
తీర్థ యాత్రలు చేయంగ దక్కు పుణ్యమ్ము
రిప్లయితొలగించండిబ్లాగు యాత్రలు చేయంగ వచ్చు కిక్కు
యాత్రల లో ఇదియేమి విశేషమో మరి
చేసిన వారికి తెలియవచ్చు నిజముగ జిలేబి
జిలేబి
కల వెన్నెన్నియొ క్షేత్రరాజము లిలన్ కాశీ గయా ముఖ్యముల్
రిప్లయితొలగించండివిలసన్మానసు లట్టి క్షేత్రముల సేవింపన్ మహాయోగముల్
కలుగున్ ధారుణిపై ననంతరము ప్రజ్ఞాన ప్రభల్ పొంది సత్
ఫలమున్ గాంతురు బంధముక్తులయి కైవల్యమ్ము ప్రాప్తించగా.
తీర్ధయాత్రలు సేయుచు ద ఱచు గాను
రిప్లయితొలగించండిస్నాన మాడిన నందలి సరసు లందు
పుణ్య మబ్బును మఱియును పాప చయము
తొలగు వెనువెంట నిజమిది తోయజాక్షి !
పద్మపాద తీర్థ యాత్రా వృత్తాంతము
రిప్లయితొలగించండి"గురువర్య ! విన్నపమ్మిదె
స్థిర భక్తి సమస్త పుణ్య తీర్థమ్ముల కే
నరిగి సకల దైవతముల
కరుణా ప్రాబల్యమందగా గాంక్షింతున్ !
మనమునకు హాయి గూర్చును ;
జనియింపగ జేయు నాత్మ సంతృప్తిని ; నూ
తన సజ్జన సాంగత్య
మ్మొనగూర్చుచు తీర్థ యాత్ర యుల్లాసమిడున్ "
పద్మపాదుడిటుల బ్రార్థింప నా సంయ
మీశ్వరుండు దానికియ్యకొనక
యాత్రలందు గల్గు నాయాసములను జె
ప్పందొడంగె శిష్య వత్సలుడయి -
"ఇడుమలు గల్గు ; వేళకు లభింపవు భోజనముల్ ; జలమ్ము లె
ప్పుడు సమకూర నేరవిక ముండ్లను గల్గెడి కాలి బాటలో
నడక యపాయ హేతువు ; వనమ్ముల నేగెడి వేళ భీతి గొ
ల్పెడి పలు క్రూర జంతువుల పీడలు తప్పవు బాటసారికిన్ ;
ప్రాతర్వేళల స్నానమెక్కడిది ? దైవ ప్రార్థనా భాగ్య మే
రీతిన్ గల్గును ? శౌచమెక్కడిది ? దారింబోవునవ్వానికిన్
వీతాభ్యాసమె ధ్యానమున్ ; జపతపావృత్తమ్ము నిర్ధూతమే
చేతశ్శాంతము శూన్యమే యగు గదా ! శిష్యా ! నిజమ్మే కదా !
అగ్ని భయము పెక్కు వ్యాధుల భయమింక
జల భయమ్ము యాత్ర సలుపు వాని
వెన్ను నంటి యుండు వినుమయ్య నా మాట !
యాత్రలందు నేమి హాయి కలదు ?
బడలిక చెంది చెంది ; పలు బాధల గీడ్పడి క్షుత్పిపాసలన్
దొడిబడి ; చోర భీతి గనుదోయిని మూయక నిద్ర లేమిచే
నడలు గదా సదా పథికు డాతని కెట్టుల దైవ భక్తి ని
ల్చెడు"నని శంకరుండు తన శిష్యునితో బలుకంగ నాదటన్ -
"ఈ గురు పీఠి యందే గల్గు సకల పు
ణ్య క్షేత్రములు శంకరార్య ! నిజము !
ఈ గురు వచనమందే సర్వ వేద శా
స్త్రాళి వర్తిలు శంకరార్య ! నిజము !
ఈ గురు సేవ యందే లభియించు పు
ణ్య విభూతి యో శంకరార్య ! నిజము !
ఈ గురు రూపమందే నెలకొను దేవ
తాశేష తతి శంకరార్య ! నిజము !
గురుని బోధ మీరకూడని దాచార్య !
గురున కెదురు పల్కకూడదార్య !
కాని చిన్న వినతి - కడు దయ నాలింప
వలయు" ననియె పద్మపాదుడంత !
"జలము లభించునో - మెతుకు చాలునొ చాలదొ - బాటలో మృగ
మ్ములు పయి గ్రమ్మునో - వివిధముల్ రుజలీ తనువాక్రమించునో
కలుగునొ పెక్కు చిక్కులని కాడ్పడి యాత్రల మానుటెట్లు ? మే
నలయక పుణ్య సంపదలహా కొనవచ్చునె ధారుణీ స్థలిన్ ?
జన్మ జన్మాంతరార్జిత సకల పాప
చయము వ్యాధియై పీడించు ; స్వస్థలమున
నున్న గాని లేదేని వేరొండు దేశ
మందునున్నను గాని తథ్యముగ గల్గు !
తలపంగా నటవీ ప్రదేశమయినన్ దైవానుకూల్యమ్మునన్
గలుగున్ బెక్కు శుభంబులున్ ; జలములున్ ఖాద్యమ్ములున్ బొందనౌ ;
తొలగున్ సర్వము దుస్సహంబగు మహా దుఃఖమ్ము పీడించు వం
తలపాలౌ నరుడెక్కడున్న నకటా దైవ ప్రతీపమ్మునన్ !
లలిగొని యాత్రకేగు నెడ లాభములెన్నియొ కల్గు , సజ్జనా
వళి గలువంగ వచ్చును ; స్వభావ మనోహరమైన జ్ఞాన సం
కలనము గల్గు యాత్ర వలనం బలు దేశములన్ జరింప నం
దలి పలు రీతులన్ దెలియనౌ కద ! దేశిక ! యానతీయవే !"
అని వినయమ్మున గోరెడు
తన శిష్యుని కుతుక మెడద దలచిన వాడై
గొనకొని యాత్రల కాతడు
సనుటకు నానతి నొసంగె శంకరుడంతన్
"నీ పలుకుల్ మనోజ్ఞములు ; నిక్కువముల్ కద ! తావకీన కాం
క్షా పరిపూర్తి కేనెపుడు కాదని పల్కను పోయి రమ్ము ; దీ
క్షా పరిపాక సిద్ధి గుతుకమ్మును దీర్చికొనంగ జాలి యా
త్రా పరితుష్ట చిత్తమున రాదగు బిమ్మట శిష్య తల్లజా ! "
( ధర్మదండము - సంస్కార కాండము )
పంచచామరము.
రిప్లయితొలగించండిప్రయాసకోర్చి తీర్థయాత్ర ప్రాజ్ఞురెల్ల జేయరే?
దయాళువైన స్వామి మ్రొక్క ధన్యులెల్ల జేరరే?
భయమ్ముఁ దీర్చి కావు మంచు భక్తితోడ వేడరే?
జయమ్ము నిచ్చు నమ్మకమ్ముఁ జాల పొందనేగరే?
డా. విష్ణునందన్ గారు ఒక మంచి ఖండికను వెల్వరించిరి. వారికి శుభాభినందనలు. సముచితమైన విషయము - శ్రీ శంకర భగవత్పాదులకు శ్రీ పద్మపాదాచార్యునకు జరిగిన సంవాదం చాల బాగుగనున్నది. స్వస్తి.
రిప్లయితొలగించండిశ్రీ పండిత నేమాని గారికి సాదర ధన్యవాద సాహస్రి !
రిప్లయితొలగించండిజిలేబీ గారూ,
రిప్లయితొలగించండిఈ నాటి మీ వ్యాఖ్యలో తేటగీతి ఛాయలు కనబడుతున్నవి. కొద్దిగా శ్రమిస్తే మీరూ పద్యాలు వ్రాయవచ్చు. స్వస్తి!
*
పండిత నేమాని వారూ,
చాలా చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
డా. విష్ణునందన్ గారూ,
శంకర పద్మపాద సంవాద రూపమైన మీ తీర్థయాత్రా వృత్తాంతం మనోహరంగా, జ్ఞానదాయకంగా ఉంది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో ,
రిప్లయితొలగించండి======*=======
పాప కర్మలందు బడిన పంచకమున
కర్మ యన్న కర్పూరము గరుగ,జనులు
తిరుమలేశుని గాంచిన తీర్థ యాత్ర
పుణ్య ఫలము నొందు మునుపు పుడమి నందు
(పంచకమున= యుద్దభుమిలో )
పున్నెము కొఱకని పూర్వము
రిప్లయితొలగించండిమన్నెములను దాటి చనిరి మలహరు జేరన్ !
మిన్నగు యాత్రా స్థలములు
తెన్నులు బహు విధము లాయె తీర్ధము లన్నన్ !
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పద్యం. అభినందనలు.