7, జూన్ 2013, శుక్రవారం

పద్య రచన - 365 (మానవుఁడు - దానవుఁడు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“మానవుఁడు - దానవుఁడు”

11 కామెంట్‌లు:

  1. మానవుడనువాడు జనుల మంచి కోరు
    దానవుడయిన స్వార్థియై తనదు మంచి
    కొఱకు పరుల నాశనమును కోరుచుండు
    ననియె భావించుచుందురయ్య జగమందు.

    రిప్లయితొలగించండి
  2. భూతదయ చేత నరమూర్తి భువిని నలరు
    సాధువర్తన నడయాడి సంతసిల్లు !
    హింస సలుపుచు రంజిల్లు హీనజనుడు
    మనుజ రూపము నందుండు దనుజు డండ్రు !

    రిప్లయితొలగించండి
  3. మానవుడనగ నొక కొల మానముండు
    మానమేయది దానిని మానవలదు
    మానమన్నది లేకుండ మనినయెడల
    మానవుండగు నిక్కము దానవునిగ.

    రిప్లయితొలగించండి
  4. మానవత్వము గలిగిన మాన వుండు
    మెప్పు నొందును బరులకు మేలు జేసి
    దనుజ సంతతి యైనట్టి దాన వుండు
    మాం స భక్షణ మందున మమత జూపు

    రిప్లయితొలగించండి
  5. మానవుండయ్యు రారాజు దానవువలె
    దుష్టమార్గ మూనుచు బొందె దుర్గతులను
    దానవుండు ప్రహ్లాదుండు ధర్మ నిరతు
    డగుచు హరిభక్తుడై పొందె నతుల సుఖము
    భవముచే గాక సుగుణ వైభవము చేత
    మానవోత్తముడై భువి మనుట మేలు

    రిప్లయితొలగించండి
  6. మానవు డాతడే యగును, మాటకు మంచికి తోడు నీడ గా
    తానెపు డుండు రాముడు సుతారము యార్తుల బ్రోచువాడు, యా
    దానవ రాజు రావణుని ధారుణి గూల్చి ధరిత్రిని ధర్మముంచె, తా
    దానవు డయ్యె రావణుడు ధాత్రి తనూజను కోరి ధూర్తుడై

    రిప్లయితొలగించండి
  7. షీనా గారికి శుభాశీస్సులు.
    మీ పద్యమును గురించి కొన్ని సూచనలు గమనించండి:

    1. సుతారము + ఆర్తుల = నుగాగమము వలన సుతారము నార్తుల అగును;
    2. వాడు + ఆ = నుగాగమమువలన వాడు నా అగును
    3. 3వ పాదము చివరలో ఒక గణము ఎక్కువగా నున్నది.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. Pandita Nemani vaariki dhanyavadalu telpukonuchunnaanu. naa porapaatlanu sari chesinamduku sarvadaa krutagnudanu. sreenivas (sheenaa)

    రిప్లయితొలగించండి
  9. మానవ జన్మము నెత్తియు
    వానరులై సంచ రించి ప్రాణ హరంబౌ !
    గానక కన్నును మిన్నును
    దానవులై దిరుగు వారు తారకు లనగా !

    రిప్లయితొలగించండి
  10. మానవునకు, దానవునకు తారతమ్యాన్ని వివరిస్తూ, మానవునిలోని దానవుని నిరసిస్తూ చక్కని పద్యాలు చెప్పిన కవిమిత్రులు....
    లక్ష్మీదేవి గారికి,
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    పూరణలు పంపిన కవిమిత్రులు...
    షీనా (శ్రీనివాస్) గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి