10, జూన్ 2013, సోమవారం

గన్నవరపు వారికి శుభాకాంక్షలు!

గన్నవరపు నరసింహ మూర్తి గారు తమ జ్యేష్టపుత్రుడు చిరంజీవి భార్గవ నారాయణమూర్తికి, చిరంజీవి సౌభాగ్యవతి పరిగె హారిక ( శ్రీ పరిగె లక్ష్మీ నరసింహ సుధాకర్ ,శ్రీమతి లక్ష్మీ సుందరిల ఏకైక కుమార్తె )తో  వివాహ నిశ్చయము జరిగినదని. వివాహ ఉత్సవము అక్టోబరు 12 వ తేదీన శనివారము ఉదయము శాన్ హోసే ,కాలిఫోర్నియా రాష్ట్రములో జరుగుతుందని తెలియజేసారు. సంతోషం.
వారికి నా శుభాకాంక్షలు.

శ్రీరస్తని 'గన్నవరపు
నారాయణ మూర్తి'ని శుభనాముని మోదం
బారగ దీవింతు 'పరిగె
హారతిఁ' జేపట్టు వరుఁడునై శోభిల్లన్.


గన్నవరపు వంశమ్మున
నెన్నఁగ నరసింహ మూర్తి! హిత సద్గుణ సం
పన్నుఁడవు, నీ కుమారుని
చెన్నగు కళ్యాణ వార్త నిదె చెప్పితివే!


మంచి వార్తఁ దెలిపి మా మనంబులను రం
జింపఁ జేసినాఁడ వీ దినమున,
నయ సుగుణ నిధాన! నరసింహ మూర్తి! మీ
కెల్లరకు శుభంబు లీశుఁ డిడుత!


కంది శంకరయ్య

14 కామెంట్‌లు:

  1. గన్నవరపు నరసింహ మూర్తి గారికి శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  2. గురువులు దీవెన లిడగ న
    చిరకాలమె పెండ్లి యగును జ్యేష్ఠ సుతుండున్
    వరుడౌటయు నిక్కము నీ
    నరసింహుని ప్రియసుతుండు నారాయణుడే !

    మా జ్యేష్ఠపుత్రుడు చిరంజీవి భార్గవ నారాయణమూర్తి వివాహము చిరంజీవి సౌభాగ్యవతి పరిగె హారికతో నిశ్చయ మైన శుభవార్తను గురువు గారి వేదికపై మిత్రులతో పంచుకొంటున్నాను. మా ద్వితీయపుత్రుడు చిరంజీవి భవానీ శంకర్ ( గురువు గారి పేరింటి వాడు ) కూడా మాకు ప్రియసుతుడే !

    రిప్లయితొలగించండి
  3. గురువు గారికి, అన్నయ్యగారికి, అక్కయ్యగారికి, పెద్దలకు నమస్సులు, కృతజ్ఞతలు. శ్రీమతి లక్ష్మీ దేవిగారికి ,మిస్సన్న మహాశయులకు, శ్రీ చింతా రామకృష్ణ రావు గారికి, శ్రీ హనుమచ్ఛాస్త్రిగారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  4. నరసింహుని పుత్రిక యే
    వరముల బొందినదొ గన్నవర పన్వయమే
    దొరకొన్నది! వరుడా? మన
    నరసింహుని ప్రియసుతుండు నారాయణుడే !

    రిప్లయితొలగించండి
  5. సోదరులు గన్నవరపు వారి ప్రియ పుత్రుని వివాహ సందర్భమున హృదయ పూర్వక శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి
  6. పెద్దలు గన్నవరపు నరసింహమూర్తి గారికీ వారి కుటుంబసభ్యులకు అభినందనలు.నూత్నవధూవరులకు శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  7. డా. మూర్తి మిత్రమా! మీ కుటుంబ సభ్యులందరికి మా శుభాకాంక్షలు, భార్గవ-హారికలకు ప్రత్యేకించి.

    రిప్లయితొలగించండి

  8. గన్నవరపు నరసింహమూర్తి గారికీ వారి కుటుంబసభ్యులకు అభినందనలు.నూత్నవధూవరులకు శుభాకాంక్షలు.


    హారిక వధువై వెలుగగ
    నారాయణ మూర్తి తగిన నవవరుడవగా
    ఆరయ నరసింహునికిని
    వారందరికిని శుభమును వాంఛింతునుగా.

    రిప్లయితొలగించండి
  9. గురువర్యులు శ్రీ శంకరయ్య గారికి, అన్నయ్య గారు శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారికి, సోదరీమణులు శ్రీమతి నేదునూరి రాజేశ్వరి గారికి ,శ్రీమతి లక్ష్మీ దేవి గారికి , మిత్రులు శ్రీ గుండు మధుసూదన్ గారికి, శ్రీ సుబారావు గారికి,శ్రీ షీనా గారికి, శ్రీ మిస్సన్న గారికి, డా.విష్ణునందన్ గారికి, శ్రీ రవి గారికి మనతెలుగు చంద్రశేఖరుల వారికి, శ్రీ గోలి హనుమచ్ఛాస్రి గారికి, సోదరులు శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి, హృదయ పూర్వక ధన్యవాదములు.
    ( శాస్త్రి గారూ ! శ్రీ పరిగె సుధాకర్ గారిది మీ గుంటూరే !)

    రిప్లయితొలగించండి
  10. నరసింహ మూర్తి గారూ,
    హార్దిక శుభాభినందనలు. చిరంజీవులిరువరకూ శుభాశీస్సులు.

    విద్యాసాగర్ అందవోలు.

    రిప్లయితొలగించండి
  11. మిత్రులు అందవోలు విద్యాసాగర్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  12. మిత్రులు గన్నవరపు నరసింహ మూర్తి గారికి శుభాకాంక్షలు తెలిపిన కవిమిత్రులు...
    లక్ష్మీదేవి గారికి,
    మిస్సన్న గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    'మన తెలుగు' చంద్రశేఖర్ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    అందవోలు విద్యాసాగర్ గారికి,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి