16, జూన్ 2013, ఆదివారం

పద్య రచన - 374(తాత, మనుమలు)

కవిమిత్రులారా,
 పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

  1. మనమలరగ మనుమడు తా
    తను గని ముద్దిడినయంత తాతయు పొంగెన్
    మనుమని కిచ్చుచు పలు దీ
    వెనలును కానుకలు మిగుల వేడుక గూర్చెన్

    రిప్లయితొలగించండి
  2. తాత యందలి ప్రేమచే తనరి మిగుల
    ముద్దు లాడుచు నుండెను మోము నిండ
    చూడ ముద్దును గొల్పును జూ పరులకు
    తాత మనుమల యనురాగ మెంత టి ది యొ .

    రిప్లయితొలగించండి
  3. గుసగుసలాడుచు నాడుచు
    పసివానికి వానితాత పరమానందం
    బొసగుచు ప్రేమను పంచుచు
    పసివాడుగ మారె గనుడు బాగున్నదిదే.

    రిప్లయితొలగించండి
  4. అరయ పౌత్రుడు దౌహిత్రుడనెడి భేద
    భావమును జూపు సంస్కృత భాష కన్న
    యిరువురిని యేక రీతిగ నిష్టపడుచు
    మనుమడనెడి తెనుగు భాష ఘనము కాదె!!

    రిప్లయితొలగించండి
  5. శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో ,
    గురువు గారికి ధన్యవాదములు
    =======*=======
    కోతలు మాయము జూపిన
    ప్రేమను ప్రీతిని మనుమలు పెనగొని,యాపై
    తాతకు ముద్దులనిచ్చెడి
    రీతిని గని పులము నొందు రేజోతి నిలన్

    రిప్లయితొలగించండి
  6. తాత మనుమల అనుబంధాన్ని వర్ణిస్తూ చక్కని పద్యాలు రచించిన కవిమిత్రులు....
    పండిత నేమాని వారికి,
    సుబ్బారావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    వరప్రసాద్ గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పద్యంలో మంచి భావాన్ని పలికించారు. అభినందనలు.
    అయితే అత్తో, పినతల్లో తెలియని ‘ఆంటీ’ని, మామయ్యో, బాబాయో తెలియని ‘అంకుల్’ను మనం నిరసిస్తున్నాము కదా!
    కూతురు కొడుకైనా, కొడుకు కొడుకైనా ‘మనుమని’ ముద్దు ముచ్చటలు మనకి ఆనందాన్ని కలిగిస్తాయి. అందులో సందేహం లేదు.

    రిప్లయితొలగించండి
  7. తాతా మనుమల బంధము
    మాతా పితరులను మించి మమతను పెంచున్ !
    శీతల మలదిన ముద్దిడి
    తాతా యని పిలచి నంత తన్మయ మొందన్

    ఇక్కడ శీతలము = మంచి గంధము

    రిప్లయితొలగించండి
  8. శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
    మీరు ప్రాసను ఒకమారు పరిశీలించండి మీ పద్యములో. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. శ్రీపండితనేమాని గురువులకు నమస్సులతో, అన్న మిస్సన్నగారి పున:ప్రేరణతో

    బుడిబుడి యడుగుల నడచు బుడుత యతడు
    ముదిమి వయసున సతతము ముదుము నిడుచు
    ముద్దు మురిపాల నొలికించి ముద్దు దీర్చు
    మనుమ డనగనెత్తాతకు మనసు గాదె!

    రిప్లయితొలగించండి
  10. మనుమని యాటలు పాటలు,
    మన మలరగ జేయు వాని మది దోచెడు క-
    మ్మని ముద్దులు, సుద్దులు కడు
    తనియించగ తాత జన్మ ధన్యము గాదే!

    రిప్లయితొలగించండి
  11. వరప్రసాద్ గారూ,
    నేమాని వారి చెప్పేవరకు మీ పద్యంలోని ప్రాసదోషం నేను గమనించలేదు. రెండవ పాదాన్ని ... 'ప్రీతిని ప్రేమను...' అని ప్రారంభించండి.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    చక్కని పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. ముడుతల మోమును బట్టుకు
    బుడతడు ముద్దులిడ తాత మోదముఁ గనరే!
    పుడమిన తాతా మనుమల
    విడదీయగలేని ప్రేమ వేడుక కాదే?!

    రిప్లయితొలగించండి