5, జూన్ 2013, బుధవారం

సమస్యాపూరణం – 1073 (నీతిఁ జెప్పఁబోఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
నీతిఁ జెప్పఁబోఁడు నిజగురుండు.

14 కామెంట్‌లు:

 1. తప్పుతోవనడువ దండనంబును జేయు
  పలుకులందు శుచిని కలుగజేయు
  శిష్యతతినిగాచి చేకూర్చు ధీ; యవి
  నీతిఁ జెప్పఁబోఁడు నిజగురుండు.

  రిప్లయితొలగించండి
 2. తప్పు జేయ మిగుల దండించి శిష్యుని
  విద్య గ ఱ పి మంచి వేత్త జేయు
  నీ తి గార వములు నేర్పును నవి
  నీ తి జెప్ప బోడు నిజ గు రుండు

  రిప్లయితొలగించండి
 3. జనులహితముఁ గూర్చు చక్కటి గుణములఁ
  బెంచు నెపుడు దాను పేర్మితోడ;
  సుమతిఁ జేయు శిష్యు; జూడగా నహిత కు
  నీతిఁ జెప్పఁబోఁడు నిజగురుండు.

  రిప్లయితొలగించండి
 4. ధర్మ మార్గమందుఁ దప్పక నడచుచు,
  నీతిఁ దప్పఁ బోని నియమ గామి
  సత్యమే జయించు సతమను గాని, దు
  ర్నీతిఁ జెప్పఁ బోఁడు నిజగురుండు!

  రిప్లయితొలగించండి
 5. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో,
  తాజా రాజకియములపై
  =========*==========
  గద్దె నెక్కి ఘనులు గడ్డి దినుట నేర్చి
  నీతి దప్పి దిరుగు నీచ జాతి,
  నింద లెల్ల నేడు నేతలపై బడ్డ
  నీతి జెప్ప బోడు నిజ గురుండు

  రిప్లయితొలగించండి
 6. సకల జనహితమ్ము సర్వ భద్రాత్మక
  మైన బోధసేయు నంచితముగ
  ఒక్కరొక్కరికిని నొక్కొక్క రీతిగా
  నీతి జెప్ప బోడు నిజగురుండు

  రిప్లయితొలగించండి
 7. తాను నీతి బాట దప్పక నడచుచు
  నదియె బోధ సేయు ననవరతము
  నాచరింపబోక నన్యుల కెన్నడు
  నీతిఁ జెప్పఁబోఁడు నిజగురుండు.

  రిప్లయితొలగించండి
 8. చదువు సంపద బెంచి సత్కార్య నిరతితో
  సజ్జనునిగ నెదుగ సకల బుద్ది
  కలుగ జేయు గాని కపటం బు తోనవి నీతి జెప్ప బోడు నిజ గు రుండు

  రిప్లయితొలగించండి
 9. "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
  ఈరోజు ప్రథమ తాంబూలం మీదే... మంచి పూరణ. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మూడవ పాదంలో గణదోషం.. ‘నేర్పును తా నవి..’ అంటే సరి!
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  అందరకు ఒకే నీతిని గురుడు బోధిస్తాడన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  ఆచరించి చెప్పె గురుని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  మొదటి పాదంలో గణదోషం. ‘చదువు సిరులు బెంచి..’ అందామా?

  రిప్లయితొలగించండి
 10. పరమ పూజ్యుడైన గురుబోద లేకున్న
  చక్క బడదు విద్య నిక్కముగను
  బొంకి నంత నఘము పొంద బోడను శుక్ర
  నీతిఁ జెప్పఁ బోఁ డు నిజ గురుండు !

  రిప్లయితొలగించండి
 11. శ్రీ కంది శంకరయ్య గురుతుల్యులకు
  నమస్కారములు
  మీ సూచన సిరోదార్యము . గణభంగమును గమనిచనే లేదు

  రిప్లయితొలగించండి
 12. aacariMci coopu naacaaryDE maMci
  kaakayunna viluva kalade bhuvini
  neeti lEni panulanE jEsi yorulaku
  నీతిఁ జెప్పఁ బోఁ డు నిజ గురుండు.

  రిప్లయితొలగించండి
 13. రాజేశ్వరి అక్కయ్యా,
  ‘బొంకవచ్చు నఘముఁ బొందఁ డధిప’ అన్న శుక్రనీతిని ప్రస్తావించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి