అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు. "పాపిడి" అనే పదమును సీమంతము అనే అర్థములో నుపయోగించేరు శ్రీ జిగురు వారు. పాపట అనే పదమే సాధువు అని నా భావన. కొంచెము వివరించగలరు.
మిస్సన్న గారూ పూరణ బాగుంది.అన్నా ఆమె భార్యా ఏమన్నానా! తప్పు చేస్తే వెంటనే శిక్ష తప్పదు. అడిగిన ముచ్చట దీర్చక నడుగని తన తల్లి కొఱకు నౌరా! చీరా? కడిగెద నేడని బిగిసిన పిడి కొస లెరుపెక్క బతినిఁ బిలచెను సతియే."
కవిమిత్రులకు నమస్కృతులు. ఈ సమస్య ఆకాశవాణిలో ప్రసారమైనది. ప్రతి పదాన్నీ "సెన్సార్" చేసి ప్రసారం చేసే ఆకాశవాణిలో అశ్లీలం ఉండదని భావించి ఈ సమస్యను ఇవ్వడం జరిగింది. నేమాని వారు మన్నిస్తారని ఆశిస్తున్నాను. పూరణలు పంపిన కవిమిత్రులు... గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, సంపత్ కుమార్ శాస్త్రి గారికి, రవి గారికి, సుబ్బారావు గారికి, షీనా గారికి, గుండు మధుసూదన్ గారికి, మిస్సన్న గారికి, రాజేశ్వరి అక్కయ్యకు, జిగురు సత్యనారాయణ గారికి, అభినందనలు, ధన్యవాదాలు. * శ్రీనివాస్ (షీనా) గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. * జిగురు వారూ, నేమాని వారన్నట్టు `పాపిడి' శబ్ద ప్రయోగం దోషమే.
ఆయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈనాటి సమస్యలో నాకు కొంతవరకు అశ్లీలమే గోచరించుచున్నది. స్వస్తి.
రిప్లయితొలగించండితడిజేసి చేతి వ్రేళ్ళతొ
పడిపడితా మినపపప్పు పట్టుచు రుబ్బన్
వడిదిప్ప బట్టి పొత్రపు
పిడి, కొస లెరుపెక్క బతినిఁ బిలచెను సతియే.
అడవిని జనుచుండెడి తఱి
రిప్లయితొలగించండిపిడుగై దూకిన మృగమును భేదించగ న
త్తడవున వాడిన తన ము
ప్పిడి కొసలెరుపెక్కఁ బతినిఁ బిలిచెను సతియే.
ముప్పిడి = కత్తి
వడివడి ముదిరిన కందను
రిప్లయితొలగించండిఒడుపుగ తరుగునెడ చేయి ఉదుటున జారెన్
వెడలెను రక్తమట, ఛురిక
పిడి కొస లెరుపెక్క బతినిఁ బిలచెను సతియే.
వడగండ్ల వాన పడుటన
రిప్లయితొలగించండికడవలు నవి చిల్లు పడుచు కారెను జలముల్
కడవల యంచులు గీ చుకు
పిడి కొస లె రుపెక్క బతిని బి లచెను సతియే
" పిడి కొసలెరుపెక్క బతిని బిలిచెను సతియే " అను
రిప్లయితొలగించండి"శంకరాభరణం " Blog spot లో ఇవ్వబడిన సమస్యకు నా పూరణం "
మడి బట్ట జుట్టి తానతి
వడి తో పిండిని విసిరెడి వాసంతి కి తా
నడిపెడి చేయది నలగగ
పిడి కొసలెరుపెక్క బతిని బిలిచెను సతియే
ఇంటఁ బ్రవేశించిన దొంగను జంపనెంచిన భార్య సాహసము...
రిప్లయితొలగించండిఅడగోలుకొనఁ దలఁచి, దో
పిడి దొంగయె చొరఁబడంగఁ, బెంపగు కింకన్
బడఁ ద్రోసి, బాఁకునఁ బొడువ,
పిడి కొస లెఱుపెక్కఁ, బతినిఁ బిలిచెను సతియే!
అడిగిన ముచ్చట దీర్చక
రిప్లయితొలగించండినడుగని తన తల్లి కొఱకు నౌరా! చీరా?
కడిగెద నేడని బిగిసిన
పిడి కొస లెరుపెక్క బతినిఁ బిలచెను సతియే.
వడి వడిగా జర జరమని
రిప్లయితొలగించండికడు భీతిగ ప్రాకు చున్న కాళీయు గనన్ !
హడలుచు వణకుచు తన
పిడి కొసలెరు పెక్క బతినిఁ బిలిచెను సతియే !
అడగకనె చీరె సారెలు
రిప్లయితొలగించండికడుప్రీతిగ దెచ్చె భర్త కాంతా మణికిన్ !
ఎడదను ప్రేమను నింపుచు
పిడికిలి కొస లెరుపెక్క బతినిఁ బిలిచెను సతియే !
గుడికి వెడల పతి రమ్మన
రిప్లయితొలగించండివడివడి స్నానమును జేసి వాలుగ కురలన్
జడగట్టిన కుంకుమ పా
పిడి కొస లెరుపెక్క బతినిఁ బిలచెను సతియే!!
అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండి"పాపిడి" అనే పదమును సీమంతము అనే అర్థములో నుపయోగించేరు శ్రీ జిగురు వారు. పాపట అనే పదమే సాధువు అని నా భావన. కొంచెము వివరించగలరు.
మిస్సన్న గారూ పూరణ బాగుంది.అన్నా ఆమె భార్యా ఏమన్నానా! తప్పు చేస్తే వెంటనే శిక్ష తప్పదు.
రిప్లయితొలగించండిఅడిగిన ముచ్చట దీర్చక
నడుగని తన తల్లి కొఱకు నౌరా! చీరా?
కడిగెద నేడని బిగిసిన
పిడి కొస లెరుపెక్క బతినిఁ బిలచెను సతియే."
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఈ సమస్య ఆకాశవాణిలో ప్రసారమైనది. ప్రతి పదాన్నీ "సెన్సార్" చేసి ప్రసారం చేసే ఆకాశవాణిలో అశ్లీలం ఉండదని భావించి ఈ సమస్యను ఇవ్వడం జరిగింది. నేమాని వారు మన్నిస్తారని ఆశిస్తున్నాను.
పూరణలు పంపిన కవిమిత్రులు...
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
రవి గారికి,
సుబ్బారావు గారికి,
షీనా గారికి,
గుండు మధుసూదన్ గారికి,
మిస్సన్న గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
జిగురు సత్యనారాయణ గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
*
శ్రీనివాస్ (షీనా) గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
*
జిగురు వారూ,
నేమాని వారన్నట్టు `పాపిడి' శబ్ద ప్రయోగం దోషమే.
లక్కరాజువారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండి