కనువిందున్ గొలిపించు దృశ్యమిది వృక్షంబుల్ లతల్ గుల్మముల్తనరారన్ బహుశోభలీనుచును తత్ప్రాంతం బరణ్యంబుగాగనుబట్టున్ దిరుగాడుచుండు నట వ్యాఘ్రంబుల్ కరుల్ సింహముల్చనుడీ భద్రముగా విహారమున కుత్సాహంబు దీపింపగన్
కారది మారెను చూడగ కారడవులు పెరిగియున్న కారణ ముననే కారుచునుండెను వర్షము కారగ నానందము మన కన్నులలోనన్.
మిత్రులారా!ముందుగ వర్షమును నేను గమనించలేదు. నా పద్యమును ఈ విధముగా మార్చుచున్నాను:కనువిందుల్ గొలిపించు దృశ్యమిది వృక్షంబుల్ లతల్ గుల్మముల్తనరారన్ బహు శోభలీనుచును కాంతారంబునన్ జిక్కగా పెనువర్షం బలరారె హర్షదమునై వీక్షించి మోదింపగామనమారన్ జనుతెంచుడీ హితమతుల్ మా కాన కుత్సాహులై
చిటపట రాలు చిన్కులయి, చిత్రముగా జడివాన వెల్లువై, కటకటలాడి యంబువులకై తపియించెడు ప్రాణికోటి కాయటమట దీర, హర్షముగ నయ్యదె వర్షము వచ్చె, నెల్లెడన్ చిటచిట దీర, పచ్చనగు చీరను గట్టె వనాంతరమ్ములున్.
వృక్షంబుల్ పలుదీవలున్ తడిసెనీ వృష్టిన్; మృగమ్ముల్ సదారక్షింపంబడు నియ్యెడన్ ; మనుజులన్ రాకుండ జూడంగదేభక్షింపంగ; యరణ్యముల్ నెపుడు కాపాడున్ ప్రపంచమ్మునున్దాక్షిణ్యమ్మునుఁ జూపు నీ నరులు నిర్దాక్షిణ్యమున్ జూపినన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వర్షపు ధారను జూడగహర్షముతో నిండి మనసు హాయిని గొలిపెన్ కర్షకులు ముదము నొందురువర్షము మఱి యడవి గాక వరిపై గుర్వన్
కానన మందు పచ్చగను మానస ముప్పొంగు రీతి మౌనముగా మే మానం దము నుండుట గని యానాకం బందునుండి వరుణుడ ర్షం బొందెన్ !
శ్రావవణమేఘమాలిక విశాలనభమ్మునతిక్రమించె ,నా రావభయంకతమ్ముగ,విరామము లేకయె వర్షధారలన్ భూవివరమ్ములన్ గురిసె ,పుణ్యమహాతటినీ ప్రవాహముల్ జీవనదాతలై వెలసె శీర్ణ వికల్ప వనాంతరమ్ములన్.
నా పద్యం రెండవ పాదంలో 'భయంకరమ్ముగ 'అనుటకు బదులు టైపు పొరబాటు వలన 'భయంకతమ్ముగ 'అనిపడింది.సవరించి చదువుకో ప్రార్థన.
కనువిందున్ గొలిపించు దృశ్యమిది వృక్షంబుల్ లతల్ గుల్మముల్
రిప్లయితొలగించండితనరారన్ బహుశోభలీనుచును తత్ప్రాంతం బరణ్యంబుగా
గనుబట్టున్ దిరుగాడుచుండు నట వ్యాఘ్రంబుల్ కరుల్ సింహముల్
చనుడీ భద్రముగా విహారమున కుత్సాహంబు దీపింపగన్
రిప్లయితొలగించండికారది మారెను చూడగ
కారడవులు పెరిగియున్న కారణ ముననే
కారుచునుండెను వర్షము
కారగ నానందము మన కన్నులలోనన్.
మిత్రులారా!
రిప్లయితొలగించండిముందుగ వర్షమును నేను గమనించలేదు. నా పద్యమును ఈ విధముగా మార్చుచున్నాను:
కనువిందుల్ గొలిపించు దృశ్యమిది వృక్షంబుల్ లతల్ గుల్మముల్
తనరారన్ బహు శోభలీనుచును కాంతారంబునన్ జిక్కగా
పెనువర్షం బలరారె హర్షదమునై వీక్షించి మోదింపగా
మనమారన్ జనుతెంచుడీ హితమతుల్ మా కాన కుత్సాహులై
చిటపట రాలు చిన్కులయి, చిత్రముగా జడివాన వెల్లువై,
రిప్లయితొలగించండికటకటలాడి యంబువులకై తపియించెడు ప్రాణికోటి కా
యటమట దీర, హర్షముగ నయ్యదె వర్షము వచ్చె, నెల్లెడన్
చిటచిట దీర, పచ్చనగు చీరను గట్టె వనాంతరమ్ములున్.
వృక్షంబుల్ పలుదీవలున్ తడిసెనీ వృష్టిన్; మృగమ్ముల్ సదా
రిప్లయితొలగించండిరక్షింపంబడు నియ్యెడన్ ; మనుజులన్ రాకుండ జూడంగదే
భక్షింపంగ; యరణ్యముల్ నెపుడు కాపాడున్ ప్రపంచమ్మునున్
దాక్షిణ్యమ్మునుఁ జూపు నీ నరులు నిర్దాక్షిణ్యమున్ జూపినన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివర్షపు ధారను జూడగ
రిప్లయితొలగించండిహర్షముతో నిండి మనసు హాయిని గొలిపెన్
కర్షకులు ముదము నొందురు
వర్షము మఱి యడవి గాక వరిపై గుర్వన్
కానన మందు పచ్చగను
రిప్లయితొలగించండిమానస ముప్పొంగు రీతి మౌనముగా మే
మానం దము నుండుట గని
యానాకం బందునుండి వరుణుడ ర్షం బొందెన్ !
రిప్లయితొలగించండిశ్రావవణమేఘమాలిక విశాలనభమ్మునతిక్రమించె ,నా
రావభయంకతమ్ముగ,విరామము లేకయె వర్షధారలన్
భూవివరమ్ములన్ గురిసె ,పుణ్యమహాతటినీ ప్రవాహముల్
జీవనదాతలై వెలసె శీర్ణ వికల్ప వనాంతరమ్ములన్.
రిప్లయితొలగించండినా పద్యం రెండవ పాదంలో 'భయంకరమ్ముగ 'అనుటకు బదులు టైపు పొరబాటు వలన 'భయంకతమ్ముగ 'అనిపడింది.సవరించి చదువుకో ప్రార్థన.