18, జూన్ 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1086 (తిప్పలఁ బెట్టెడు సతియె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తిప్పలఁ బెట్టెడు సతియె పతివ్రత గాదే!

27 కామెంట్‌లు:

 1. ముప్పు గమనించి ధీబల
  ముప్పతిలగ భర్త కొరకు నొప్పుగ జనుచున్
  మెప్పు బడసి సమవర్తినె
  తిప్పల బెట్టెడు సతియె పతివ్రత గాదే?

  రిప్లయితొలగించండి
 2. ఒప్పుకొనిన పెండ్లికి నలఁ
  దప్పవుగా తిప్పలిపుడు , తండ్రీ ! వినుమా !
  ఒప్పులకుప్పై సరసపు
  తిప్పల బెట్టెడు సతియె పతివ్రత గాదే?

  రిప్లయితొలగించండి
 3. ఒప్పించి మగనితోఁ జని,
  తప్పులు సేసిన దనుజు నధర్మున్ దుష్టున్
  దెప్పుచు ననిలో నరకుని
  దిప్పలఁ బెట్టెడు సతియె పతివ్రత గాదే?

  రిప్లయితొలగించండి
 4. సతీసావిత్రిని ప్రస్తావిస్తూ పండితులవారు చేసిన పూరణ బాగున్నది.

  తప్పులఁ జేయుచు సురలను
  తప్పించి జగములనేలు దనుజాధమునే
  యొప్పుగ ననిలో పలువిధ
  తిప్పలఁ బెట్టెడు సతియె పతివ్రత గాదే! (సత్యభామ)

  రిప్లయితొలగించండి
 5. అమ్మా లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.

  1.మీ ప్రశంసలకు అనందము నొందితిని.

  2.మీ పద్యములో పలువిధ తిప్పలు అనే సమాసము సాధువు కాదు. పరిశీలించండి.
  స్వస్తి

  రిప్లయితొలగించండి
 6. పండిత నేమాని వారూ,
  సావిత్రిని ఉద్దేశించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  సరసంలో తిప్పలు పెట్టే భార్యను ప్రస్తావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  నరకుని తిప్పలు పెట్టిన సత్యభామను గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీరూ మధుసూదన్ గారి బాటే పట్టి సత్యభామపై పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
  ‘పలువిధ తిప్పలు’ అనడం సరికాదు. అక్కడ ‘యొప్పుగ ననిఁ బలువిధముల/తిప్పల...’ అందాం.

  రిప్లయితొలగించండి
 7. చెప్పియుఁ దన కష్టమ్మును,
  గొప్పగఁ బతి భీము జయముఁ గోరుచు, నుల్లం
  బొప్పఁగఁ దుర్మదుఁ గీచకుఁ
  దిప్పలఁ బెట్టెడు సతియె పతివ్రత గాదే? ౨

  ముప్పొదవును మునుముందని,
  యొప్పుల కుప్పయగు సీత నొప్పుగ నిడుమం
  చెప్పుడు మగఁడగు రావణుఁ
  దిప్పలఁ బెట్టెడు సతియె పతివ్రత గాదే? ౩

  రిప్లయితొలగించండి
 8. తప్పును తెలిపి సవరణ సూచించిన పెద్దలకు ధన్యవాదములు.

  అప్పులఁ జేయగవలదని
  గొప్పలకునుఁ బోవలదని కూరిమితో దా
  నెప్పుడు భర్తను విడువక
  తిప్పలఁ బెట్టెడు సతియె పతివ్రత గాదే?

  రిప్లయితొలగించండి
 9. అప్పడ తి వీర నారిగ
  చప్పున సమరంబు దూకి శరములు వడిగా
  ద్రిప్పుచు దుష్టుని నరకుని
  తిప్పలు బెట్టెడు సతియె పతి వ్రత గాదే !

  రిప్లయితొలగించండి
 10. గుండు మధుసూదన్ గారూ,
  ద్రౌపది, మందోదరుల గురించిన మీ తాజా పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  సత్యభామను గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. తప్పుడు పనులను జేయుచు
  ముప్పులు గొని తెచ్చు పతిని మూర్కా చరణున్
  దెప్పుచు సుజనుండగుటకు
  తిప్పల బెట్టెడు సతియె ప్రతివత గాదే.

  రిప్లయితొలగించండి
 12. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  బాగుంది మీ పూరణ.. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. నాగరాజు రవీందర్ గారి పూరణ........

  అప్పుడు త్రిమూర్తు లొకపరి
  చప్పున పసిపిల్లలైన చాయను గనుడీ !
  ముప్పు తొలగె ననసూయకు ;
  తిప్పలఁ బెట్టెడు సతియె పతివ్రత గాదే !

  రిప్లయితొలగించండి
 14. నాగరాజు రవీందర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. ఒప్పక రాముని పట్టము
  కొప్పును నగలు దిగ విడిచి కోప గృహమునన్
  తప్పక దివిజులు జెప్పగ
  తిప్పలఁ బెట్టెడు సతియె పతివ్రత గాదే!

  రిప్లయితొలగించండి
 16. అప్పలు ముగ్గురు జగముల
  నెప్పుడు నేలుదురు వారినే శిశువుల జే
  సప్పుడు ముగ్గురు తల్లుల
  తిప్పలఁ బెట్టెడు సతియె పతివ్రత గాదే !

  రిప్లయితొలగించండి
 17. ముప్పని తెలియక రాముని
  తిప్పెను బంగారు లేడి తెమ్మనుచున్ తా
  నప్పుడు పట్టును వీడక
  తిప్పలఁ బెట్టెడు సతియె పతివ్రత గాదే !

  రిప్లయితొలగించండి
 18. మెప్పును బొందగ ద్రౌపతి
  చప్పున తా పతుల వెంట చనె నడవులకున్ !
  తిప్పలు పడియడు గిడనని
  తిప్పల బెట్టెడు సతియె పతి వ్రత గాదే !

  రిప్లయితొలగించండి
 19. జిగురు సత్యనారాయణ గారూ,
  కైకేయిని ఉద్దేశించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  శ్రీనివాస్ గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  ‘చేసి + అప్పుడు’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  ‘ఇక నడవలే’నని తిప్పలు పెట్టిన ద్రౌపది(తి?) గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. ఆర్యా! శంకరయ్య గారు! మీ సూచనకు ధన్యవాదములు.
  దోషము సవరించి పంపిన పూరణను గమనించ గలరు.
  అప్పలు ముగ్గురు జగముల
  నెప్పుడు నేలుదురు వారినే శిశువులు గా
  సప్పుడు జేయుచు తల్లుల
  తిప్పలఁ బెట్టెడు సతియె పతివ్రత గాదే !

  రిప్లయితొలగించండి
 21. శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో,
  గురువు గారికి ధన్యవాదములు
  నేటి మహిళల పై
  =====*=======
  తప్పులు వెదకుచు నుండెడి
  కప్పలు కుప్పలుగ జేరి కలహము లాడన్
  యెప్పటి కప్పుడు వాటికి
  తిప్పల బెట్టెడు సతియె పతివ్రత గాదే?

  రిప్లయితొలగించండి
 22. శ్రీపండితనేమాని గురువులకు నమస్సులతో

  తప్పుడు దారిన పోయెడి
  నప్పతి నొక దారి బెట్ట నబలగ గాకన్
  తప్పక సబలగ వానిన్
  తిప్పలఁ బెట్టెడు సతియె పతివ్రత గాదే!

  రిప్లయితొలగించండి
 23. శ్రీ తోపెల్ల వారి పద్యము కొద్ది సవరణలతో:

  తప్పుడు దారుల బోయెడు
  నప్పతి సరిదిద్దు వేడ్క నబల ననక తా
  తప్పక సబలగ వానిన్
  దిప్పల బెట్టెడు సతియె పతివ్రత గాదే

  రిప్లయితొలగించండి
 24. వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  నేమాని సవరణతో బంగారానికి తావి అబ్బినట్లయింది.

  రిప్లయితొలగించండి
 25. తప్పక తెమ్మని లేడిని,
  చెప్పిన మాటలు వినకయె ఛీఛీ యనుచున్,
  చుప్పుగ మాయమ్మై కడు
  తిప్పలఁ బెట్టెడు సతియె పతివ్రత గాదే!

  రిప్లయితొలగించండి


 26. అప్పుడు యిప్పుడు యెప్పుడు
  తప్పు జమా ఖర్చులెల్ల తనపతి జూపన్
  గప్పున బట్టి పెనిమిటిని
  తిప్పలఁ బెట్టెడు సతియె పతివ్రత గాదే :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 27. అప్పులు చేయట తప్పని
  చెప్పుచు నీతులు సతతము చిప్పను చేతన్
  తప్పక నిచ్చుచు ముప్పది
  తిప్పలఁ బెట్టెడు సతియె పతివ్రత గాదే!

  రిప్లయితొలగించండి