3, జనవరి 2015, శనివారం

సమస్యా పూరణం - 1574 (పతి తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పతి తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్.

29 కామెంట్‌లు:

  1. సతతము ద్రాగుచు వచ్చెడి
    పతితల ఖండించె సతి యె పదుగురు మెచ్చ
    న్నతనిని కర్కశ దనమున
    సతులను గాపాడ కొఱకు చంపెను నటులన్

    రిప్లయితొలగించండి
  2. అతలా కుతలము జేయుచు
    సతతము హింసించు భర్త సహచరి కంటెన్
    గత భర్తృకె విధి వ్రాతని
    పతితల ఖండించె సతియె పదుగురు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  3. హితుల పలుకు నిసుము వినక
    నతిగా త్రాగుచు వనితల నల్లరి జేయన్
    మతి దప్పగ కోపములో
    పతితల ఖండించె సతియె పదుగురు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  4. శతధృతి యొసగిన వరముల
    కతన మహిషుడు సురలను కారించ వెస
    న్నతి కోపముతో రాక్షస
    పతి తలఖండించె సతియె పదుగురు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  5. మితిమీరిన చేతలతో
    వెతలను బెట్టెడు మహిషుని పేరడగించన్
    మతిహీనుండగు దానవ
    పతి తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్!!!

    రిప్లయితొలగించండి
  6. మితి మీరిన గర్వముతో
    నతలాకుతలమ్ము జేయ నన్నిజగములన్
    పతితుండు మహిషుడు రాక్షస
    పతి తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  7. మితిమీరి త్రాగి రాతిరి
    మతిమాలుచు సుతను బట్టి మానము జెరచన్
    గతి దప్పి మహిషు మించిన
    పతి తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
  8. పతియే రథమును తోలగ
    ధృతితో రణమున చెలగుచు ధృత్యుడు కోరన్
    అతిధూ ర్తుడు మహిషాసుర
    పతి తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  9. అతిదుర్లక్షణయుతుఁడై
    శృతిదూరవిధానములకుఁజెందినవాఁడై
    సతతము దుర్వ్యసనుండగు
    పతితల ఖండించె సతియె పదుగురు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  10. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నది. అభినందనలు.
    ****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. పూజ్య గురుదేవులకు నమస్సులు. నా పూరణ రెండవ పాదంలో గణ దోషమును సవరించి మరల పంపుచున్నాను.

    శతధృతి యొసగిన వరముల
    కతన మహిషుడు దివిజులను కారించ, ఖలు
    న్నతి కోపముతో రాక్షస
    పతి తలఖండించె సతియె పదుగురు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  12. మత మార్పిడి చేసిన బహు
    హిత మగునని చెప్పిరోజు హింసించెడి యా
    మతి హీనుని నచ్చక తన
    పతి తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  13. మితిమీరిన కామముతో
    సతతము పరసతులతోడ సరసములాడే
    యతినీచుడైన ధరణీ
    పతి, తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  14. గతుకుట జరుగక యాకలి
    వెతలను బాయంగ మేము వేశ్యల మనినన్
    బ్రతికెడు దారులు గలవని
    'పతిత'ల ఖండించె సతియె పదుగురు మెచ్చన్!
    (ఖండించు=వాదమును ఖండించు)
    వేశ్యలుగా మారటానికి వారల వాదనను ఓ ఇంతి ఖండించిందన్న భావం.

    రిప్లయితొలగించండి
  15. 1హితమెరుగక,పతిబాధలు
    సతతముజేకూర్చుచుండ?సాగని-బ్రతుకై
    మతిదప్పి-మధ్యమెంచెడి
    పతితలఖండించెసతియెపదుగురుమెచ్చన్|
    2క్రతువునుజెరపగ?ఋషియనె
    మతిలేకనుజేయుపనికి-మమతలునింపే
    సతియేనినుజంపుననగ
    పతితలఖండించెసతియెపదుగురుమెచ్చన్

    రిప్లయితొలగించండి
  16. మధ్యాక్కర
    అతిగావ్యసనములంటగ?మనసునకల్మషముజేరుటన?
    శృతిలయలేకనురాగ-కృతులనువాయించినట్లు
    పతిమధ్యమమునందెగడిపి|పరకాంతనెంచుటజూచి
    పతితలఖండించెసతియెపదుగురుమెచ్చన్"కలగనె"|

    రిప్లయితొలగించండి
  17. సుతు డనిదెలియక-పంపా
    పతితలఖండించె|సతియె,పదుగురుమెచ్చన్
    మతిమంతునిజేసియు-గణ
    పతిని,శివుడు|విఘ్నరాజుభాధ్యతలొసగెన్

    రిప్లయితొలగించండి
  18. కె .యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
    పతి యింట లేని తరి వ
    చ్చితనను తాకగ కొడవలి చేసాహసి యై
    అతి కాముకు డగు వెంకట
    పతి తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్
    జనవరి 03, 2015 5:40 [PM]

    రిప్లయితొలగించండి

  19. అతివల అమ్ముచు తనదౌ
    బ్రతుకును సాగించుచు౦డ వలదనగను దు
    ర్మతియై చంపగ వచ్చిన
    పతి తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  20. అతిదుర్మార్గుడు నగుచును
    వెతలను గూర్పగ నరకుడు,వెన్నుడు సతితో
    జతగను ననికేగ,నసుర
    పతి,తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్

    అతివగు రుద్రమ తానటు
    గత రాజుల కంటె ఘనముగను పాలింపన్
    మతి నీసు వడెడి,యా నర
    పతి,తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్

    అతిదుర్మార్గుడు నై,సుర,
    లతివల బాధింప వెసను నంబయె దుర్గై
    మతి హీనుండైన మహిష
    పతి,తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్

    అతిగను కుడుములు తినియున్
    వెతలను బడు నా గణేశు,వెన్నెల రేడే
    కితకిత గేల్సేయగ,నుడు
    పతి తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్

    అతివలు దుర్మార్గలునై
    పతి లోగొని వానినితము పాడును చేయన్
    గతి లేకను వెస కినుకను
    పతితల ఖండించె సతియె పదుగురు మెచ్చన్

    సుతయని జూడక కామిత
    పతి మద్యపు మత్తు చెరచ,వానిని నీచున్
    వెత,కోపములవి ముడిపడ
    పతి,తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్

    పతియే దొరకగ, నోములు
    సతియే చేయుచు చివరకు సద్గుణు డతడే
    పతిగాగ తాను,కుక్కుట
    పతి,తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  21. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణలోని ఆ దోషం నా దృష్టికి రాలేదు. సవరించినందుకు ధన్యవాదాలు.
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
    ఈరోజు బమ్మెర గ్రామానికి వెళ్ళి పోతన సమాధి దగ్గర ‘భాగవత గణనాధ్యాయి’ ఊలపల్లి సాంబశివరావు గారిని కలిసాను. వారు మిమ్మల్ని జ్ఞాపకం చేశారు.
    ****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    నిస్సందేహంగా ఈనాటి పూరణలలో మీది చాలా బాగున్నది. అభినందనలు.
    *
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
    గణపతిని ‘పంపాపతి’ అన్నారు. వివరిస్తారా?
    ****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ ‘వెంకటపతి’ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ ఏడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. రసికత్వము జూపించుచు
    వ్యసనపరులజేరదీయు పతితల ఖండిం
    చె సతియె పదుగురు మెచ్చన్
    వెసనట్టి వెలవెలదులను వెలివేయమనెన్

    రిప్లయితొలగించండి
  24. పుజ్యులయినగురువర్యులకువందనాలతోవివరణ
    పంపాపతి=హంపిపంపాపతి=ఈశ్వరుడుఅన్నభావన
    ఈశ్వరునకు కుమారుడ నితె లియకఖండించుట

    రిప్లయితొలగించండి
  25. గోలి హనుమచ్ఛాస్త్రి గారు - మీమొదటి పూరణలో మూడవ పాదంలో మొదటి గణమును సరిచేయాలి.
    "పతితుండు" "పతితుడు" గా మారిస్తే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  26. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించండి.
    మీ పూరణ బాగున్నది. ముఖ్యంగా చివరి పాదాన్ని పద్యాంతర్గతం చేయడంలోని మీ ఛందోనైపుణ్యం ప్రశంసనీయం. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి వారూ,
    గోలి వారి తరఫున ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  27. మితముగ తైలము వ్రాసియు
    పతి తల; ఖండించె సతియె పదుగురు మెచ్చన్
    సతమత మౌచును వడిగా
    పతి తెచ్చిన పనస కాయ పండుగ పూటన్ :)

    రిప్లయితొలగించండి
  28. చతికిలపడి వంటింటిని
    పతి కోరగ పుల్ల బజ్జి పడిగాపులతో
    నతి ప్రేమను గొని కూరల
    పతి తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్

    కూరల పతి = (కిరీటము గల) వంకాయ

    రిప్లయితొలగించండి