23, జనవరి 2015, శుక్రవారం

సమస్యా పూరణం - 1585 (గుల పండుగ జూడఁ గ్రొత్తక్రొత్తగ నుండున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
గుల పండుగ జూడఁ గ్రొత్తక్రొత్తగ నుండున్.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

37 కామెంట్‌లు:

  1. తలపులు వలపులు గలరం
    గుల పండుగ జూడ గ్రొత్త క్రొత్తగ నుండు
    న్నిల యాసంక్రాంతి యెగద
    కలలను నిక నిజము జేసి కనకము నిచ్చున్

    రిప్లయితొలగించండి
  2. కిలకిల నవ్వుచు మతాబు
    జలజల రాల్చగ సుమాల జల్లుల పాపల్
    మిలమిల మెరయు కనుల వెలు-
    గుల పండుగ జూడఁ గ్రొత్తక్రొత్తగ నుండున్

    రిప్లయితొలగించండి
  3. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    దువ్వూరి వేంకట నరసింహ సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటి పాదంలో బేసిస్థానంలో జగణమైన ‘మతాబు’ వల్ల గణదోషం.‘కిలకిల నవ్వు మతాబులు’ అందామా?

    రిప్లయితొలగించండి
  4. మెలమెల్లగ గోకుచు పై
    జిల తగ్గగ వేడినీరు చిమ్ముచు పోయన్
    బలెబలె తామర వ్యాధికి
    గుల పండుగ జూడఁ గ్రొత్తక్రొత్తగ నుండున్.

    రిప్లయితొలగించండి
  5. అయ్యో గురువుగారూ పొరబాటు జరిగింది. సవరణకు ధన్యవాదాలు. సరదాగా ఇంకో పూరణ పెట్టేను.

    రిప్లయితొలగించండి
  6. మిస్సన్న గారూ,
    మీ రెండవ పూరణ హాస్యస్ఫోరకంగా ఉంది. అభినందనలు.
    గోకుడులో ఉన్న ఆనందాన్ని వర్ణించే చాటుపద్యాలు కొన్ని ఉన్నాయి. తెనాలి రామకృష్ణుని ‘అల్లసానివాని యల్లిక జిగిబిగి...’ పద్యంలోని ఈ ‘గుల’ చమత్కారాన్ని ఇంతకు ముందు బాగులో పెట్టానా? నాకు గుర్తు లేదు. పెట్టలేదంటే చెప్పండి. చమత్కారపద్యాలు శీర్షికలో దానిగురించి వివరంగా ఇస్తాను.

    రిప్లయితొలగించండి
  7. బలు పెక్కిన పశువుల పరు
    గుల పండుగ జూడ గ్రొత్త క్రొత్తగ నుండున్.
    పలకను బట్ట పొగరు గి
    త్తలతో పందెము చివరకు తన్నుల కొరకే !

    రిప్లయితొలగించండి
  8. భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. ఎలమిని కలిగించు పతం
    గుల పండుగ జూడ గ్రొత్త క్రొత్తగ నుండున్
    పలువన్నెలతోసొగసుగ
    చలమున నవితేలియాడి సంతోషమిడున్!!!

    రిప్లయితొలగించండి
  10. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. గురువుగారూ మీరు చెప్పిన చమత్కారం మన బ్లాగులో పెట్టినట్లు లేదు. తప్పక పెట్టండి.

    రిప్లయితొలగించండి
  13. పులికాటు తీరమున పులు
    గుల పండుగ జూడ గ్రొత్త క్రొత్తగనుండున్
    పెలికానులప్రదర్శన
    చలికాలములోన జరుగు చక్కగ నచటన్ !!!

    రిప్లయితొలగించండి
  14. చిలిపిగ బాల్యము నందున
    తొలి యౌవనమందు వేడ్కతో కేళి వలెన్
    కలగాముది,హోళీ ర౦
    గుల పండుగ జూడ గ్రొత్త క్రొత్తగ నుండున్

    రిప్లయితొలగించండి
  15. కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
    మిల మిల దివ్వెల వరుసలు
    తళతళ పూవులమతాబు తనరగ పలు ర౦
    గుల హ౦గుల తోషపు పొ౦
    గుల పండుగ జూడ గ్రొత్త క్రొత్తగ నుండున్

    రిప్లయితొలగించండి
  16. కె.ఈశ్వరప్ప గారూ,
    రంగులపండుగతో మీరు చేసిన పూరణలో అన్వయలోపం ఉన్నట్టుంది. సవరించడమో, మీ భావాన్ని వివరించడమో ఛేయండి.
    ****
    మిస్సన్న గారూ,
    ఆ చమత్కార పద్యాన్ని పోస్ట్ చేశాను. చూడండి.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ******
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ******
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. పొలములు దండిగ ఫలమిడ
    పలువిందులతోడ కనుమ పండుగ జరుగన్
    తెలుగు జనపదముల పతం
    గుల పండుగ జూడఁ గ్రొత్త క్రొత్తగ నుండున్

    రిప్లయితొలగించండి
  18. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. శ్రావణ మాసంలో
    కలతలుబాసి గృహమ్ముల,
    కలలు ఫలించ,కడు భక్తి కమలాలయకై
    పలువారమ్ములు, నాడం
    గుల పండుగ జూడఁ గ్రొత్త క్రొత్తగ నుండున్

    రిప్లయితొలగించండి
  20. మల్లెల వారిపూరణలు
    1. వెలయగ గణ తంత్ర దినము
    నల వృద్ధిని చాటు శకట లలరగ నింపై
    పలుగతి హస్తిన నటు రం
    గుల పండుగ జూడఁ గ్రొత్త క్రొత్తగ నుండున్
    2.పలుగతి హోళీ దినమున
    చెలగుచును ప్రజలు కిలకిల చిమ్ముచురంగున్
    చెలరేగుచుండ పలు భ౦
    గుల పండుగ జూడఁ గ్రొత్త క్రొత్తగ నుండున్
    3.అలవిజయవాడ నాంధ్రను
    చెలగెడు అభి వృద్ధి తెలుప చెలువగు శకటాల్
    పలుగతి గణతంత్రము వెలు
    గుల పండుగ జూడఁ గ్రొత్త క్రొత్తగ నుండున్

    రిప్లయితొలగించండి
  21. అలరించు కోళ్ళ పందె
    మ్మలరించును గంగిరెద్దు లాటలు మరియున్
    అలరించు ముగ్గుల, పతం
    గుల పండుగ జూడఁ గ్రొత్త క్రొత్తగ నుండున్.

    రిప్లయితొలగించండి
  22. కలిగిన రుగ్మతలు తొలగి
    పలుకోర్కులు తీరు కొరకు పంకము నిడుచున్
    నెలతలు భక్తిఁ జలుపు భో
    గుల పండుగ జూడఁ గ్రొత్త క్రొత్తగ నుండున్
    పంకముః పాలు, భొగిః పాము

    రిప్లయితొలగించండి
  23. అల "హమాప్ కే హై కౌ
    ను"లోని యొక పాటలో మనోహరమగు చే
    ష్టల కవ్వించెడి యాడం
    గుల పండుగ జూడఁ గ్రొత్తక్రొత్తగ నుండున్.

    రిప్లయితొలగించండి
  24. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ తాజా రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘అల హమాప్ కే’ అన్నప్పుడు గణదోషం. ‘అల హమ్ ఆప్‍కే హై కౌ|ను లోని....’ అనండి.

    రిప్లయితొలగించండి
  25. గురువు గారికి పాదాభి వందనములు
    నేను గూగుల్ సాఫ్ట్ వేరే వాడతాను ఆన్లైన్
    మీ సూచనకు ధన్యవాదములు .అర్ధానుస్వారం ఎలా టైపు చెయ్యాలి ?
    తెలుపగలరు . కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  26. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    నేను బరహా సాఫ్ట్‌వేర్‍ను ఉపయోగిస్తున్నాను. మీరు చెప్పిన గూగుల్ సాఫ్ట్‌వేర్ నా సిస్టంలో లేదు. దానిని చూడాలంటే ముందు డౌన్‍లోడ్ చేసుకోవాలి.
    మా మేనకోడలు గూగుల్ వాడుతుంది. ఆమె నడిగి తెలిసికొని మీకు చెప్తాను.
    లేక బ్లాగుమిత్రు లెవరైనా చెప్తే సంతోషం!

    రిప్లయితొలగించండి
  27. KRKR గారూ ... GOOGLE TRANSLATE లో ఎడమప్రక్క క్రింద వైపు 'అ'అని అక్షరం కనిపిస్తంది.. దానిపైన నొక్కి TELUGU INSCRIPT కీబోర్డ్ SELECT చేసుకోండి. అందులో SHIFT నొక్కినపుడు అర్ధానుస్వారం దొరకుఉతుంది

    రిప్లయితొలగించండి
  28. మామిత్రులు సి. రామ మొహన్ గారి పూరణ
    అలరుచు పరుగిడు గిత్తల
    మెలకువ తోడను ఉరుకుచు మెట్టిన వేళన్
    చెలియలు సంబర పడు పరు
    గుల పండుగ జూడ క్రొత్త క్రొత్తగ నుండున్

    రిప్లయితొలగించండి
  29. అలరుచు పరుగిడు గిత్తల
    మెలకువ తోడను ఉరుకుచు మెట్టిన వేళన్
    చెలియలు సంబర పడు పరు
    గుల పండుగ జూడ క్రొత్త క్రొత్తగ నుండున్

    రిప్లయితొలగించండి
  30. సి. రామమోహన్ గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘తోడను + ఉరుకుచు’ అన్నచోట విసంధిగా వ్రాయరాదు. ‘మెలకువతో నురుకు లలర మెట్టిన వేళన్’ అనండి.

    రిప్లయితొలగించండి
  31. వెలుగులు చిమ్మెడు రంగుల
    నలరెడు సోయగముతోడ నలుచెరగులలో
    మెలికలు తిప్పెడు నిలము
    గ్గుల పండుగ జూడ క్రొత్త క్రొత్తగ నుండున్

    చలిబాపు కొరకు వేగము
    కలిగిన వస్తువుల దెచ్చి కాలగ వేయన్
    చెలితో కాగెడు నులి య
    గ్గుల పండుగ జూడ క్రొత్త క్రొత్తగ నుండున్

    అగ్గుల పండుగ=భోగి మంటల పండుగ

    రిప్లయితొలగించండి
  32. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  33. బలిచక్రవర్తి రాకను
    దెలిపే 'యోనం' దినమున దెప్పల మీదన్
    పలు విన్యాసముల సరం
    గుల పండుగఁ జూడఁ గ్రొత్త క్రొత్తగ నుండున్!

    రిప్లయితొలగించండి
  34. తాజా పూరణ

    గులయన నెయ్యది?నును సి
    గ్గులదో?మరి వెచ్చదనపు గొర్రెల దౌ ర
    గ్గులదో?మది చిత్తగు పె
    గ్గుల పండుగ జూడ క్రొత్తక్రొత్తగ నుండున్?

    రిప్లయితొలగించండి
  35. రకరకాల రం " గుల " , హం " గుల " పొం " గుల " పూరణలు చేసిన మిత్రులందరికీ అభినందనలు..

    రిప్లయితొలగించండి
  36. ఇలలో నెన్నియొ వింతలు!
    కిలకిల నవ్వుచు పడుచును క్రిందను మీదన్...
    అలహాబాదతివల నా
    గుల పండుగ జూడఁ గ్రొత్తక్రొత్తగ నుండున్

    రిప్లయితొలగించండి
  37. కులసతి భీతిని వణకుచు
    కలవర మొందుచును మెండు ఖర్గపు పురిలో
    నెలమిని వంగలదౌ రం
    గుల పండుగ జూడఁ గ్రొత్తక్రొత్తగ నుండున్

    రిప్లయితొలగించండి