18, జనవరి 2015, ఆదివారం

దత్తపది - 64 (వల-వాన-వెల-వేగు)

కవిమిత్రులారా!
వల - వాన - వెల - వేగు
పైపదాలను ఉపయోగిస్తూ
సీతాన్వేషణకు హనుమంతుని పంపుతున్న రాముని పలుకులను గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

26 కామెంట్‌లు:

  1. వలకు లన్నియు వెదకు నా వలది కొరకు
    వానరోత్తమ నా సీత వార్త నాకు
    వెలకఱవుసేయు నిచటనే వేచియుందు
    వేగుచుందు తిరిగిరమ్ము వేగముగను

    రిప్లయితొలగించండి
  2. వలపు లన్నియు సీతపై బరగి యుండె
    వేగు జామున లేవగ వెలవె ల నయి
    పగలు మనసంత కలవర బడుచు నుండె
    వాయు వేగాన పరుగిడి వానరుండ !
    వెదకి భూమాత జాడను విశద బరచు

    రిప్లయితొలగించండి
  3. వలను రావణు లంకకు వార్ధి దాటి
    వానరోత్తమ వివరించు వలతి సతికి
    వెలవెల బోవు రాముని వేదన లను
    వేగు బాటున నేతెంచి వెడలి రమ్ము

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘...సేయు మిచటనే’ అనండి.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘భూమాత జాడను’ అన్నదాన్ని ‘భూజాత జాడను’ అనండి.
    ****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వెలవెలబోవు’ అన్నచోట గణదోషం. ‘వెలవెలంబోవు’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  5. కడలి కావల జని, గాలించు సీతకై ,
    వాన రోత్తమ మది వార ధగును !
    నీదు భక్తి మహిమ , నిరతంబు వెలయులే !
    జగతి ప్రగతి గాంచు , జయము వేగు !

    ఆటవెలది . డా .కృష్ణ సుబ్బారావు పొన్నాడ .

    రిప్లయితొలగించండి
  6. వలకు లన్నియు శోధించి పవన సుతుడ
    వెలది సీతను వెదకుమా వేగముగను
    వేగుచుండెరాముడు నిన్ను వీడి యనుచు
    వానరోత్తమ దెలుపుమా ప్రాణసఖికి !!!

    రిప్లయితొలగించండి
  7. డా. పొన్నాడ కృష్ణ సుబ్బారావు గారూ,
    బహుకాల దర్శనం. సంతోషం.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. సీత వెతుక బొమ్ము శీఘ్రమే వేగువై
    వలను లెల్ల జూసి దెలుసు కొమ్ము
    వాయు పుత్రు డీవు వానరోత్తమహన్మ
    జనని రక్ష వెలయు జయము నీకు

    రిప్లయితొలగించండి
  9. వానరులలోన శ్రేష్టుడౌ వాయు పుత్ర
    నీవె లంఘించి వారిథి నావలగల
    లంకకేగి వేగుపను లెల్లసలిపియట
    సీత జాఢను తెల్పుము శీఘ్రముగను

    రిప్లయితొలగించండి
  10. వలనె సహింపగా విరహ బాధను? వేగుట నాకసాధ్యమౌ
    వెలయగ శాంతి నా యెడద వేగమె దక్షిణ మేగి సీతకై
    కలయగ జూసి రమ్మిటకు గమ్మున నామెను దాచినట్టి యా
    ఖలుని నమోఘ బాణహతి కాల్చెద వానరపుంగవా వడిన్.

    రిప్లయితొలగించండి
  11. భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మీ పేరు దువ్వూరి వి.ఎన్. సుబ్బారావులో వి.ఎన్ అంటే వేంకట నరసింహ అనుకుంటున్నాను. మీ పూర్తి పేరు తెలియజేయ మనవి.

    రిప్లయితొలగించండి

  12. "నీవె లక్ష్మీ సమానమౌ నావదువును
    వేగు వై జూడ వలయునువీరహనుమ
    బాలకము నిత్తు జూపుమీ వానవాలు'
    యనుచు పనుపును జేసెను యినకులుండు

    రిప్లయితొలగించండి
  13. వలయును నీదు సహాయము
    చెలిఁ గనుగొన, వానరముల చేవల్ నీలో
    వెలసిన శక్తుల్ పృథివిని
    తుల లేనివి నీవేగుమింక తొందరపడుమా!

    రిప్లయితొలగించండి
  14. మల్లెల వారిపూరణలు
    నీవేగు వలపల దిశ
    కావలనే సీత యున్నదనుచును తెలిసెన్
    నీవానవాలు నంగుళి
    నీవె లలననుకను గొనగ నేర్పున నొసగన్
    2 తీవెలను బోలు మేనున
    తా వానల మెరుపు నటుల తనరెడు సీతన్
    నీవేగు మయ్య వెదకుము
    నీవలనను కలదొ నీవె నేర్పరి వగుటన్

    రిప్లయితొలగించండి
  15. కె యెస్ గురుమూర్తి ఆచారి గారిపూరణ
    జలధి కావల గల దేమొ వెలది సీత
    హనుమనీవే గురు బలయుతునివి చనుమ
    వానరశ్రేష్ట చూపించి యానవాలు
    దాశరధి వచ్చుననుచు నోదార్చు మయ్య

    రిప్లయితొలగించండి
  16. వానర వీరుడ ! హనుమా !
    ఈ నా యుంగరము నందియే నీవేగన్
    నేనావల నమ్మకమున
    నానాతిని గనెదవనుచు నడ వెలయించెన్.

    రిప్లయితొలగించండి
  17. ఆవలలంకయున్నది-సహాయములేకనెవెళ్లువేగుడై
    జేవనసారమే"" వెలదిసీతయుజాడనుజూసిరమ్ము,నా
    భావనలుంచు"నుంగరమె|పాలుషిబంధముగుర్తునివ్వగా
    దీవెనలందినట్లగునుదెల్పగ?సంతసమిచ్చువానలా|"

    రిప్లయితొలగించండి
  18. వలచిన ధర్మపత్ని వనవాసమునందునఁ దప్పిపోయె శ
    క్తులకు నిధానమౌ భవదకుంఠిత దీక్షచె వానరోత్తమా!
    నలుదెశలందుజూచినఁ గనంబడు, దివ్వెల కాంతి తుల్యమం
    గుళికము నిత్తు నీకు గయికోగదవే గుణదివ్య ధీమణీ.

    రిప్లయితొలగించండి
  19. వలఁతి యదెట్లునున్నదని బాధ కలుంగ తపించుచుంటి, నే
    నిలసుతఁ గాంచగల్గుదినమెప్పుడొ వానరముఖ్య! గుర్తుగా
    లలనకు నిమ్ము నుంగురము, రాముఁడు వచ్చునటంచు పల్కుమా,
    వెలదినిఁ గాఁచగా నెదురు వేగురు వచ్చిననైన శత్రువుల్

    రిప్లయితొలగించండి
  20. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘...జూపు మీ యానవాలు| ననుచు...’ అనండి.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణ నాల్గవపాదంలో గణదోషం. సవరించండి.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    నీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    కె. యస్. గురుమూర్త్రి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. అవనిజ యే వలఁ జిక్కెనొ
    వివరము వానర వినీత వేగమె దెలియన్
    భువి, నాకాశము వేగుగ
    నవలోకించుము వెలయగ నాశను విడకన్!

    రిప్లయితొలగించండి
  22. గురువుగారు,
    మన్నించండి.

    సవరించిన పద్యము

    వలయును నీదు సహాయము
    చెలిఁ గనుగొన, వానరముల చేవకు నీలో
    వెలసిన శక్తికి లేదిక
    తులనము, నీవేగుమింక తొందరపడుమా!

    రిప్లయితొలగించండి
  23. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ సవరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి