10, జనవరి 2015, శనివారం

పద్యరచన - 786

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

  1. తల్లి పాముతో బాటుగ బిల్ల పాము
    పడగ విప్పుచు నిలబడ భయము గలిగె
    పాలు పోయుదు బుట్టలో పడగ రేడ !
    యేమి చేయకు మానన్ను నిప్పు డిచట

    రిప్లయితొలగించండి
  2. పడగనువిప్పుచు మీరిటు
    మిడిసిపడగనేల విషము మీకంటెను మా
    కడనే యెక్కువ!మీకా
    పడగలయందె! మనిషి నిలువంతయు విషమే!

    రిప్లయితొలగించండి
  3. పుట్టను వీడగ నిన్నిటు
    బుట్టను బంధించి రంట భూరి జనంబుల్
    పొట్టను నింపుట కొరకని
    కట్టెను మంత్రించి నిన్ను గానము నందున్

    రిప్లయితొలగించండి
  4. పాములుపగబట్టవులే
    కాముకులకుమించిపోని-కర్మలులేకే|
    స్వాములుగాదలపోతురు
    భూమీశులపంటనంట?పూర్తిగరక్షే|

    రిప్లయితొలగించండి
  5. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    ****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. భువిలో ప్రాణులవన్నియు
    నవసరమేయంద్రు, పాములైనను, చీమల్,
    కువకువలాడెడు పక్షుల్
    భవనమునకు కంబములుగ పరిరక్షించున్.

    నాగజాతియు నొక్కటి నలువసృష్టి
    యందు! ప్రాణులెల్ల ధరణియందు నొక్క
    రీతి సమమంచు నెఱుగంగ లేక మనుజు
    డన్నవాడిట్లు నెగురుచునున్నవాడు.

    రిప్లయితొలగించండి
  7. మూత తెరచి పాములవాడు బూరనూద
    బుట్టలోనుండి లేచెను బుస్సుమనుచు
    జంట సర్పముల్ రయమున, సంతసముగ
    మూగ జీవాలు చెరవీడి పోవుటెపుడొ?

    రిప్లయితొలగించండి
  8. ప్రేమగ పాలను బోయుచు
    పాముల నాడించుకొనుచు బ్రతుకులు గడుపున్
    సేమము కొరకై కోరలు
    పాములకును తీసివేయు బరిజోగులిలన్

    రిప్లయితొలగించండి
  9. అమ్మా యేమిది యెత్తి జూడ శిర మాహా యింత భూలోకమా
    అమ్మో యెందుల కిట్లు చిన్న గది నన్యాయమ్ముగా నిద్దరిన్
    బొమ్మల్ వోలెను దాచి యుంచి రకటా పోనీక యీ మానవుల్
    రామ్మా పోదము వారు రాక మునుపే రంగైన పాతాళమున్.

    చిన్నీ యేమను దాన మానవులనన్ ఛీ పాములే జాలిగా
    నిన్నున్ నన్నును సేమమొప్ప విడువన్? నీచుల్! చనం జూచినన్,
    కన్నమ్ముల్ కడు త్రవ్వి పట్టి మనలన్ కాఠిన్య మేపారగా
    వెన్నుల్ జీరుదు రయ్య కర్మ తనయా వేయేల పోలేములే.

    రిప్లయితొలగించండి
  10. కె.యెస్ గురుమూర్తి ఆచారి గారి పద్యము
    దాని సోకి బాధించు యత్నమ్ము సేయు
    వేళ మాత్రమె కాటిడు కాలనాగు
    కాని దుష్టుడు చంపు నిష్కారణముగ
    నకట!సద్గుణవంతునిన్ స్వార్ధమెంచి

    రిప్లయితొలగించండి
  11. ఫణము పై మేటి యదుకుల మణి పదమ్ము
    దాల్చ త్రాచులు ధన్యులై తనరె గాదె
    గరుడు బారిని పడ కుండ గాని మనిషి
    పట్టి వానిని యాడించు పొట్ట కొరకు

    రిప్లయితొలగించండి
  12. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    మిస్సన్న గారూ,
    కరుణరసాత్మకములైన మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. చిన్నపాము తన తల్లి యైన పెద్ద పాముతో........

    పాములు పాలు ద్రాగి విషవ్త్వపు ధారలు గ్రక్కునంచు నీ
    పామరపండితాళి భలె పల్కుచునుందురు గాని చూడగా
    కామము మత్సరంబనెడు క్రౌర్యపుకోరలు కల్గియున్న యీ
    తామస చిత్తవృత్తులిల దారుణకార్యములెన్ని సల్పరో

    రిప్లయితొలగించండి