14, జనవరి 2015, బుధవారం

పద్యరచన - 790

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

22 కామెంట్‌లు:

  1. గంగి రెద్దును జక్కగ రంగు రంగు
    వస్త్ర ములతోడ ముస్తాబు బఱచి మిగుల
    గంగి రెద్దుల వారలు గడప గడప
    కుమఱి వెళ్లి య డుగుకొందు రు, మహ రాజ
    యీయ గోరుదు వస్త్రము ల్ యీ ధవ ళ కు

    రిప్లయితొలగించండి

  2. నాడు గంగిరెద్దుల బూరె నరుడు
    శుభ సూచకముల చెప్పు వాడు
    నేడు మేక్ ఇన్ ఇండియా నరేంద్రుడు
    శుభ సూచకముల నిచ్చు వాడు !!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. డూడు బసవన్నగుమ్మాన ఆడ గాను

    తోడ సన్నాయి జంటగా పాడ గాను

    సంచి నిండుగ ధాన్యాలు పంచ గాను

    సొంపు నింపును సంక్రాంతి యింపు గాను

    రిప్లయితొలగించండి
  4. గురువర్యులు, కవి మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

    సీసము:
    పనికిరాని తలపు పట్టి కాలిచి వేయ
    మనకు భోగి యనుచు మంట జెప్పు
    చిక్కులెన్నొ గలుగ చుక్కలే యనుకొని
    ముందుకేగుడనుచు ముగ్గు చెప్పు
    బద్ధకమ్ము వదల భగవానుడే మెచ్చు
    ననుచును హరిదాసు డరచి చెప్పు
    పంటలందిన వారు పరులకష్టముగని
    కొద్దిగిమ్మని గంగిరెద్దు చెప్పు

    తేటగీతి:
    పుణ్య పథమందు దిరుగగ మాన్యులగుచు
    నుందురనుచును సూర్యుండు నోర్మి జెప్పు
    మకర సంక్రాంతి మనకు క్షేమకరముగను
    క్రాంతి చూపించు గావుత శాంతి నింపి.

    రిప్లయితొలగించండి
  5. బసవని దీవనమ్ములను పల్లెల నెల్లరకిచ్చు వాడుకల్
    ముసిముసి నవ్వు ముచ్చటలు, మ్రొక్కులు, చక్కగ ప్రక్కవారి మా
    నసములు నిండునట్టుల జనమ్ములు పల్కెడు నాడు! నాఁడహో
    దెసదెస నిండియుండునట తీరుగ నెల్లెడ! నేడు గాంతుమే?

    రిప్లయితొలగించండి
  6. పంటలను పొంది పల్లెలు ప్రబలుచుండ
    రైతు గృహముల కేతెంచి రమణతోడ
    గంగిరెద్దుల దాసులు వంగి వంగి
    నుతము చేయుచు రాబోవు హితము దెల్పి
    గంగిరెద్దుల నాడించి, కనుల విందు
    సలుపు చుందురు కొన భిక్ష సంతసముగ

    రిప్లయితొలగించండి
  7. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    జిలేబీ గారూ,
    మీ భావానికి నా పద్యరూపం.....
    నాటి గంగిరెద్దుల బూరె నరుడు ప్రజకు
    శుభము సూచించు మాటల చొప్పు చెప్పె;
    నవ్యభారతనిర్మాత నరుడు మోడి
    శుభము సూచించు చేతలచొప్పు గనెను.
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ సీసపద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘నుతము జేయుచు’ అన్నచోట ‘నుతులు జేయుచు’ అనండి.

    రిప్లయితొలగించండి
  8. ఆవె.రాసిరాసితిరిగిరవియోచ్చెనేడెగా
    భోగితెచ్చెమరల భోగములను
    యుత్తరాయణంబు యుప్పొంగి సంక్రాంతి
    కనుముబసవడోచ్చె కనుమనిపుడు

    రిప్లయితొలగించండి
  9. పిరాట్ల ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘రవియొచ్చె, బసవడొచ్చె’ అని ‘ఒచ్చె’ శబ్దాన్ని ప్రయోగించారు. సాధురూపం ‘వచ్చె’. ‘భోగములను + ఉత్తరాయణంబు + ఉప్పొంగి’ అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు. నా సవరణలతో మీ పద్యం....
    రాసి రాసి తిరిగి రవి వచ్చె నేడెగా
    భోగి తెచ్చె మరల భోగములనె
    యుత్తరాయణమున నుప్పొంగి సంక్రాంతి
    కన బసవడు వచ్చె కనుమ నిపుడు.

    రిప్లయితొలగించండి
  10. రంగగు వస్త్ర సంచయము రమ్యముగా ధరియించి మేనిపై
    ఖంగున మ్రోయ గంటలును కమ్మగ శబ్దము జేయు మువ్వలున్
    హంగుగ పాడ వంత తను హాయిగ నాడును తెన్గు లోగిటన్
    ముంగిట గంగిరెద్దు గన ముచ్చట లేరికి నైన పల్లెలన్.

    రిప్లయితొలగించండి
  11. మిస్సన్న గారూ,
    అద్భుతమైన పద్యాన్ని అందించారు. అభినందనలు.
    ఈ పద్యాన్ని చదువుతున్నప్పుడు ఏదో ప్రసిద్ధమైన పద్యం మనసులో మెదులుతూ ఉంది కాని జ్ఞాపకం రావడం లేదు.

    రిప్లయితొలగించండి
  12. సరిచేసిన మీదట.

    రాసిరాసితిరిగిరవియోచ్చెనేడెగా
    భోగితెచ్చెమరల భోగములనె
    నుత్తరాయణమున నుప్పొంగి సంక్రాంతి
    కనుముబసవడోచ్చె కనుమనిపుడు

    రిప్లయితొలగించండి
  13. పిరాట్ల ప్రసాద్ గారూ.
    రెండుచోట్లా ‘ఒచ్చె’ అలాగే ఉంది. అక్కడ సవరించలేదు.

    రిప్లయితొలగించండి

  14. ఇక్కడ నుండి వ్యాఖ్యలను తొలగించండి: శంకరాభరణం

    బ్లాగర్ K Eswarappa అన్నారు...

    గంగిరెడ్డులనేర్పు?గమనించవింతయే|
    యజమానిమాటలుఋజువుబరచు|
    ముస్తాబుమురిపాన-ముచ్చట గొలపంగ?|
    ఆహ్లాదమేమనకాటజూడ|
    పశువులపూజించ?పరమాత్ముడనుకొని
    రైతులునమ్మగ?రాజులైరి|
    వానలుగురియంగ-పంటలుబండంగ?
    గంగిరెద్దులపూజఘనమటంచు
    పల్లెపల్లెలునింటింటపట్టుదలగ
    ఎద్దులాసీస్సులందించ?ఎదురుబడుచు
    మంగళంబగువాయిధ్య-మంత్రమందు
    సేత,రాములపెళ్లిళ్లు?చిత్రసిమె|


    జనవరి 14, 2015 6:17 [PM]

    పద్యరచన - 790 కు పోస్ట్ చెయ్యబడింది
    కాపీరైట్ © 1999 – 2015 Google

    రిప్లయితొలగించండి
  15. గ౦గిరెద్దును సన్నాయి గానమమర
    శుభము గోరుచు పాడిన, సూక్తుల విని
    ప్రేమమీరగ బసవని పేర కాన్క
    లిచ్చి యాదరించిరి నాడు యీవి మెరయ.
    2.ప్రజల గంగిరెద్దుల జేసి భవ్యముగను
    ఋణము సేకరించుచు సొంతధనము పెంచు
    నేత,వాయించుసన్నాయి మ్రోత,నేడు
    మోసపోకుడు జనులార యాస పడుచు

    రిప్లయితొలగించండి
  16. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘వాయిద్యమంత్రము’ అన్న సమాసం దుష్టం. అక్కడ ‘వాద్యముల్ మంత్ర..’ అనండి.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. గంగిరెద్దు లయిరి గద్దెనెక్కినవారు
    జనుల మరిచి నోళ్ళు జగమునేల
    కరుణ జూపరేల కఠిన పాలకులును
    కష్టనష్టములను కాల్చునిటుల

    రిప్లయితొలగించండి
  18. రంగుల వస్త్రంబులతో
    చంగముగా గంగిరెద్దు సంసిద్ధంబై
    ముంగిలిలో వచ్చి నిలిచె
    గంగాధరు వాహనమునకప్పనమిడుమా
    (అప్పనము =కానుక )

    రిప్లయితొలగించండి
  19. గంగిరెద్దు విన్నపం:
    శివునానతి తలఁ దాలిచి
    జవదాటక ' పెద్దకొడుకు ' సరళిన నింటిన్
    సవరించగఁ బాటు పడితి
    భవదీయుడ పాత వలువ పట్టుకు రండీ!

    రిప్లయితొలగించండి
  20. ‘పానుగంటి’ వారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘మరచినోళ్ళు’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు.
    ‘....గద్దెనెక్కినవెన్క
    జనుల మరిచి వారు జగమునేల...’ అనండి.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. రాసిరాసితిరిగిరవిజేరెమకరమే
    భోగియిచ్చు మరల భోగములనె
    నుత్తరాయణమున నుప్పొంగి సంక్రాంతి
    కనుముబసవడోచ్చె కనుమనిపుడు

    రిప్లయితొలగించండి