19, జనవరి 2015, సోమవారం

పద్యరచన - 795

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. తీర్ధ యాత్రల కోర్కెను తీర్చ దలచి
    యమ్మ నాన్నల కావడి యందునుంచి
    భుజముపై పెట్టి కావడి మోసికొనుచు
    శ్రవణ కుమరుండు పయనమై సాగుచుండె

    రిప్లయితొలగించండి
  2. చిత్ర మందున జూడుడు చెన్ను మీర
    శ్రవణ కొమరుడు భక్తితో కావడి కిరు
    వైపుల దలిదండ్రు లు నుండ పయన మయ్యె
    దీ ర్ధ యాత్రల కోరిక దీర్చ దలచి

    రిప్లయితొలగించండి
  3. అంధులగు తల్లి దండ్రుల
    బంధములగు బాధ్యత యని భక్తిని కొలువన్
    స్కంధము పైకావడి నిడి
    సంధిల వలెసాగె నంట శ్రవణు డటన్నన్

    సంధిలవలె = సముద్ర కాంత . వాహినివలె , స్రవంతి

    రిప్లయితొలగించండి
  4. పుట్టుక నిచ్చిన వారికి
    జట్టుగ యుండుమని కడకు సంస్కృతి జెప్పున్
    కట్టడి కొలదైన వలయు
    చట్టముతో జెప్పలేము సంఘపు రీతుల్

    రిప్లయితొలగించండి
  5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘కొమరుడు’ సరియైన రూపం. ‘శ్రవణకొమరుడు’ అన్నా దుష్టసమాసం. అక్కడ ‘శ్రవణు డవ్విధి పయనమై...’ అనండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘శ్రవణకొమరుడు’ అన్నదానికి పైవ్యాఖ్యను చూడండి. అలాగే రెండవ పాదంలో ప్రాసయతి తప్పింది. ప్రాసపూర్వాక్షరం గురులఘుసామ్యం ఉండాలి కదా! ఆ పాదాన్ని ‘శ్రవణు డాకావడిని బక్తి శ్రద్ధల నిరు...’ అనండి.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘జట్టుగ నుండుమని...’ అనండి.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ చంపకమాల బాగున్నది. అభినందనలు.
    ‘అందబోదు + ఏ’ అన్నప్పుడు సంధి నిత్యం. ‘అందబోవ దే’ అనండి. అలాగే ‘కావడి + అందు’ అన్నచోట యడాగమం వస్తుంది. ‘కావడియందు’ అనండి.

    రిప్లయితొలగించండి
  6. కన్నులు బోయిన దిట్టక
    కన్నులు తన తల్లిదండ్రి కాళ్ళే తానై
    కన్నట్టి వార్ని కావడి
    కన్నారా శ్రవణు డిటుల ఘనముగ మోసెన్.

    రిప్లయితొలగించండి
  7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    నా సవరణలతో మీ పద్యం......
    కన్నులు బోయిన దిట్టక
    కన్నులు తలిదండ్రు లనుచుఁ గన్నులు తానై
    కన్నట్టి వారిఁ గావడిఁ
    గన్నారా శ్రవణు డిటుల ఘనముగ మోసెన్.

    రిప్లయితొలగించండి

  8. పితరుల సేవ జేయుచును ప్రీతిని కావడి యందు వారలన్ హితముగ నుంచి మోయుచును వృద్ధుల కాశిని జేర్చి పార్వతీ
    పతి గణనాథు దర్శనము పావని జాహ్నవి యందు స్నానమున్
    జతపడబూను వాడు గన శ్రావణుడొక్కడు లోకమందునన్

    రిప్లయితొలగించండి
  9. కన్న తలిదండ్రి మదిలోని కాంక్షఁ దీర్చ
    నంధులగువారి మిక్కిలి యాదరముగ
    కావడిన నుంచి మోయుచు కరము భక్తి
    శ్రవణు డేగె యాత్రలకుతా సంతసముగ

    రిప్లయితొలగించండి
  10. మాతాపితలసేవ మాధవ సేవగ
    .........మనమున నమ్మిన మాన్యుడతడు
    తల్లిదండ్రులకోర్కె తాదీర్చగానెంచి
    .........తీర్ధయాత్రకు బయల్దేరెనతడు
    కావడియందుస కన్నవారినియుంచి
    .........భుజముపైనిడుకొని మోసెనతడు
    జలమునింపుచునుండ సరసులో దశరధు
    .........బాణమునకొదలె ప్రాణమతడు

    తల్లిదండ్రులందరుకోరి తమకునట్టి
    తనయుడుండ వలెననుచు తపముజేయు
    నభమునన్ సూర్యచంద్రులు న్నంతవరకు
    నవనియందు నిలచియుండు శ్రవణుఁ బేరు

    రిప్లయితొలగించండి
  11. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    శ్రవణకుమారుని చరిత్రను సీసపద్యంలో చక్కగా ఇమిడ్చారు. చాలా బాగుంది. అభినందనలు.
    ‘వారిని + ఉంచి’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వారల నుంచి’ అనండి. ‘ఒదలె’ గ్రామ్యం. ‘బాణమున వదలె’ అనండి.

    రిప్లయితొలగించండి
  12. తల్లిని దండ్రిని శ్రవణుడు
    చల్లగ కావడినబెట్టి సాకుచు నతడే
    చెల్లించె వారి నర్మిలి
    ముల్లోకములన్ని మెచ్చె ముని బాలుడనే!!!

    రిప్లయితొలగించండి
  13. కె. ఈశ్వరప్ప గారి పద్యం.....

    శ్రవణునిభక్తితత్పరత,శాంతముసర్వులకందబోదు|యే
    వివరణగోరకేవెడలె" విజ్ఞతగల్గినతల్లిదండ్రితో
    అవసరమన్నయాత్రలకు?నందినకావడినందుమోయుటే
    దివియనినెంచుభావనలె?తీర్థప్రసాదములందినట్లెగా|

    రిప్లయితొలగించండి
  14. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. శ్రవణుడునాదర్శుడిగా
    భవితకుతలిదండ్రిసేవ-పంచిన-ప్రతిభా
    వివరణచిత్రముజూడగ?
    కవితలకేనందనట్టి-కథనిధిగనుమా|

    రిప్లయితొలగించండి
  16. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండవ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘కవితలకేని + అందనట్టి’ అనడం మీ భావన అయితే యడాగమం వస్తుంది. ‘కథానిధి’ అని సమాసం చేయవలసి ఉంటుంది. నా సవరణలతో మీ పూరణ....
    శ్రవణుం డాదర్శముగా
    భవితకు తలిదండ్రి సేవ పంచిన ప్రతిభా
    వివరణ చిత్రము జూడగ
    కవితలకే యందనట్టి కథ యిది గనుమా!

    రిప్లయితొలగించండి
  17. మాస్టరు గారూ ! చాలా చక్కని సవరణ చేశారండీ...
    " కన్నులు తలిదండ్రు లనుచుఁ గన్నులు తానై " ..అమోఘముగా నున్నదండీ... ధన్యవాద పూర్వక నమస్సులు.

    రిప్లయితొలగించండి
  18. కనిపెంచినవారలనే
    కనికరమును జూప లేక కాటునువేసే
    'పనిమంతు'లకీ శ్రవణుని
    విని జూచిన బుద్ధి విచ్చి విజ్ఞత కూరున్

    రిప్లయితొలగించండి
  19. అమ్మానాన్నలసేవయేపరమధర్మంబంచు జీవించె, దా
    సమ్మానమ్ములపైన నాశవిడి యే సన్మార్గమున్ జొచ్చెనో
    మమ్మాదారిని నిల్పవే మదిని కర్మన్నిష్ఠ పెంపొందగా
    నిమ్మేనించుక సార్థకమ్మయిననే, నీశానుఁ జేరందగున్.

    రిప్లయితొలగించండి