27, జనవరి 2015, మంగళవారం

పద్యరచన - 803

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. పద్మ రేకుల మధ్యన బాగు గాను
    తేనె గలయట్టి పుప్పొడి రేణువు లట
    చూడ ముచ్చట గొలిపెను జూడ్కు లకవి
    తెల్ల రేకుల కందమై యుల్ల సిల్లె
    బ సుపు పచ్చని యండము భవ్య ముగను

    రిప్లయితొలగించండి
  2. తెల్లని కమలము విరిసెను
    మెల్లగ సూర్యుడుదయించ మిన్నున యెలమిన్
    వెల్లడి చేయుచు తన ప్రియ
    వల్లభు డరుదెంచనెంత పరితుష్టితయో

    రిప్లయితొలగించండి
  3. తెల్లని కలువల యందము
    చల్లని చందురుని గాంచి చకితము నొందన్
    యుల్లము రంజిలు రీతిగ
    పల్లవమే పాడె నంట పసుపు పుప్పొడు లన్నీ

    రిప్లయితొలగించండి
  4. నీరజ సగంధుడుదయించ తూరుపుదిశ
    తెల్లకమలము వికసించె నుల్లమలర
    తెల్ల చీరను ధరియించి తీరుగాను
    విభునికి తనువు నర్పించు వెలది వోలె
    సగంధుడు: స్నేహితుడు

    రిప్లయితొలగించండి
  5. కలువలరాయని జూడగ
    కలువయె విరియును సొగసుగ కాసారమునన్
    చెలిమిని బంచగ శశికిన్
    పులకించుచు రజనివేళ పూయును రోజూ!!!

    రిప్లయితొలగించండి
  6. ప్రకృతి రూపిణి పార్వతి పచ్చదనము
    నలువ దొరసాని హృదయమ్ము తెలుపుదనము
    భాగ్యలక్ష్మి చిరునగవు స్వర్ణమయము
    కలసి మురిసిన రీతిగా కలువ విరిసె

    రిప్లయితొలగించండి
  7. చలువగట్టు పుత్రి నెలమిని యేలిన
    మూడు కనుల వాని మూర్ధజమున
    వెలుగుచుండు నట్టి వెన్నెల రాయని
    కొల్ల గొట్టె మదిని తెల్ల కలువ.

    రిప్లయితొలగించండి
  8. కలువగ-రానుపొమ్మనకు,గాలియుపాడగ?నాట్యమాడెదన్
    గలువగరూపురేఖలతొ-గన్పడునట్టులవేచియున్న?నన్
    గలువకనున్నచో?బ్రతుకుకాంతివిహీనతనావరించుగా|
    కలువగరమ్మటంచు-తనకాంతునికై|విరబూసెనందమే|

    రిప్లయితొలగించండి
  9. తమరాకుపై నీటి బొట్టు ముత్యములాగా మెరుస్తుంది. కొందరు మిత్రులు కలువ అంటున్నారు. అంతర్జాలంలో లోటుస్ అని ప్రెస్ చేస్తే ఈ పువ్వేకనబడుతుంది.

    రిప్లయితొలగించండి
  10. పువ్విటనవ్వెనేల?విరబూసినయందముపంచబూనియే|
    రువ్వెడిరంగులేల?మనరుగ్మతలన్నియుబాపనెంచియే|
    నివ్వెరబోదువేల?ననునిత్యము-బ్లాగునదాచియుంతురే|
    కన్నులజేరెనేల?తగుకల్పనచేతనుపద్యమల్లగా|

    రిప్లయితొలగించండి
  11. సిత కమలము వికసించెను
    అతి ముదమున కమల బంధు వాగమనముతో
    నితమైన మరందమ్మును
    ప్రతి మధుపము గ్రోల వెడలు ప్రత్యూషమునన్

    రిప్లయితొలగించండి
  12. సత్యనారాయణ రెడ్డిగారూ అది కలువపువ్వే. తామరపువ్వు కాదు.

    రిప్లయితొలగించండి
  13. కలువను ఆంగ్లం లో వాటర్ లిల్లీ అంటారను కొంటాను.

    రిప్లయితొలగించండి
  14. Missanna garu if you search in google for white lotus you will see this image. I have already checked and copied same image on my desk top.

    రిప్లయితొలగించండి
  15. కవిమిత్రులకు నమస్కృతులు.
    ప్రయాణపు ఏర్పాట్లలో ఉండి ఈరోజంతా బ్లాగు చూడలేకపోయాను. మన్నించండి.రేపు హైదరాబాదు, అక్కడినుండి పొద్దుటూరు పెళ్ళికి, తరువాత తిరుపతి ప్రయాణం.. ఫిబ్రవరి 2 వరకు నేను బ్లాగుకు అందుబాటులో ఉండను.అన్నిరోజుల సమస్యలను, పద్యరచనను షెడ్యూల్ చేశాను. నేను నా సెల్ పోనులో మీ పద్యాలను చూస్తూనే ఉంటాను. కాని వ్యాఖలను పోస్ట్ చేయలేను. దయచేసి ఈ ఐదారు రోజులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
    *****
    ఈనాటి చిత్రానికి (కలువా? కమలమా?) మంచి పద్యాలను అందించిన మిత్రులు...
    పోచిరాజు సుబ్బారావు గారికి,
    చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    శైలజ గారికి,
    ‘ఆదిత్య’ గారికి,
    మిస్సన్న గారికి,
    కే. ఈశ్వరప్ప గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

  16. పద్య రచన:శతపత్ర సుందరి
    శతపత్రమ్ముల సుందరీ! నిను యెదన్ ధ్యాని౦తు నే మాతగా
    సతతమ్మున్, సతి పార్వతీ, భ్రమరగా, సర్వాత్ముడౌ విష్ణుకున్
    సుతుడౌ సృష్టికి కర్త కాసనముగా,శోభిల్లు నేత్రాలుగా,
    నతులన్నందుచు నున్న పాదములుగా, నర్చింతు నెల్లప్పుడున్

    రిప్లయితొలగించండి
  17. అది కమలమైతే.....

    తెల్లని కమలపు హృదయం
    బల్లన రవితోడ నిండి యలరినదేమో
    తెల్లమయె దాని మధ్యన
    చల్లగ కనబడుచునుండె సరి ప్రతిరూపే .

    ఒక వేళ కలువ అనుకుంటే...

    తెల్లని కలువకు హృదయం
    బల్లన శశి తోడ నిండి యలరినదేమో
    తెల్లమయె దాని మధ్యన
    చల్లగ కనబడుచునుండె సరి ప్రతిరూపే .



    రిప్లయితొలగించండి
  18. సత్యనారాయణ రెడ్డిగారూ మీరు చెప్పినది నిజమే కావచ్చును. కానీ గ్రామీణ వాతావరణం తో సంబంధమున్న వారికెవరి కైనా అది కలువ అని చూడగానే తెలుస్తుంది.

    రిప్లయితొలగించండి
  19. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది.అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఉభయతారకంగా మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి