గురువుగారికి , పెద్దలకూ మరియు కవి మిత్రులకు శివరాత్రి శుభాకాంక్షలు క్షీరాభిషేకమును మన సారా శివలింగమునకు సలిపెద యెదలో నారాధించుచు నే జా గారంబును చేసి కొలుతు గంగాధరునిన్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘...సలిపెద నెదలో’. ‘రాత్రికి నుపవాస...’ అనండి. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. భరణి శబ్దానికి భూమి అనే అర్థం ఉన్నా రూఢ్యర్థం ఒక నక్షత్రమే. మీరక్కడ ‘వసుధయందు’ అంటే సందిగ్ధత ఉండదు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. చివరిపాదంలో గణదోషం. ‘చేడియతోఁ జేసెద రభిషేకము ప్రీతిన్’ అందాం. ***** జిలేబీ గారూ, మీ భావానికి నా పద్యరూపం.... పాలు దెచ్చి రాల పాలుసేయుచు భక్తి చూప నేల? ఫలము శూన్యమగును; కుండెడైన పాలు క్షుత్పిపాసార్తుల కిడిన శివుడు మెచ్చులే జిలేబి! (అన్నట్టు మీరు పికె, గోపాల గోపాల సినిమాలు చూశారా ఈమధ్య?) ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘వాంఛలు + అధిగమించ’ అన్నప్పుడు సంధి నిత్యం. ‘వాంఛలే యధిగమించ’ అనండి. ***** డా. విష్ణునందన్ గారూ, నిత్యపారాయణం చేసికొనవలసిన శివస్తోత్రాన్ని అందించారు. ధన్యవాదాలు. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ సీసము, శార్దూలము రెండూ బాగున్నవి. అభినందనలు. ‘పాశముక్తుని’ అనవలసింది. అక్కడ ‘పాశమ్ముల్ దెగఁ జేయఁగల్గిన భవా!’ అనండి. ***** కె.యస్.గురుమూర్తి ఆచారి గారూ, మీ సుగంధి వృత్తం బాగున్నది. అభినందనలు. ‘ప్రార్థనమ్ము’ టైపాటువల్ల ‘ప్రార్థనము’ అయింది. ***** గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘శీలాన్విత + అర్చకుడు’ అన్నప్పుడు సవర్ణదీర్ఢసంధి జరగాలి కదా! అక్కడ ‘శీలాన్వితుఁ డర్చకుఁడే’ అనండి.
మిస్సన్న గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** జిలేబీ గారూ, ధన్యవాదాలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, ‘పాలు+అభిషేకము= పాలభిషేకము’ (ఉత్త్వసంధి). అవుతుంది. కాని ‘పాల + అభిషేకము = పాలాభిషేకము’ కాదు! మీరిచ్చిన ఉదాహరణాల్లో పూర్వపదాలన్నీ సంస్కృతాలే. కాని పాలు తెలుగు పదం. దానిని సంస్కృతపదంతో సవర్ణదీర్ఘసంధి చేయరాదు.
గురువుగారికి , పెద్దలకూ మరియు కవి మిత్రులకు శివరాత్రి శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిక్షీరాభిషేకమును మన
సారా శివలింగమునకు సలిపెద యెదలో
నారాధించుచు నే జా
గారంబును చేసి కొలుతు గంగాధరునిన్
ధాత్రిని జనులు మహాశివ
రాత్రికి యుపవాస జాగరణముల తోడన్
స్తోత్రంబుల కీర్తించ త్రి
నేత్రుడు కరుణించి బ్రోవు నిక్కముగానున్
శివున కభిషేక మచ్చట జేయ జూడ
రిప్లయితొలగించండిమనసు నాయది యుప్పొంగె మమత తోడ
భాగ్య మనగను నతనిదే భరణి యందు
చేయు చుండెను గదయభి షేక ముమ ఱి
శివునకు నట యభి షేకము
రిప్లయితొలగించండినవిరళ ముగ సా గుచుండ హాయిని గొలిపెన్
శివ నామంబులు బలుకగ
శివ నిలయము నిండి యుండె శివ భక్తుల తోన్
చూడుము పార్వతి భక్తులు
రిప్లయితొలగించండినేడట పుట్టిన దినమని నీటిని పాలన్
వేడుక మీరగ నెత్తిని
చేడియ దరిజేర కుండ జేయన భిషిక్తంబుల్
అందరికీ శివరాత్రి శుభా కాంక్షలు
రిప్లయితొలగించండిరాయి కి పాలు ధార గ పోసి
భక్తి ని చూపించ నేల ! కడివెడు
పాలు ఆర్తుల సేద దీరంగ నిచ్చి
భోళా శంకరుని మెప్పించు జిలేబి !!
మహా శివరాత్రి శివ శివా అనుచు
జిలేబి
ఫాలనేత్రు లింగ పాలాభిషేకము
రిప్లయితొలగించండిసలుపు చుండిరచట శ్రద్ధతోడ
ననవరతము గొల్వ నత్యంత భక్తితో
కామితమ్ము లిచ్చు కాటిరేడు
రిప్లయితొలగించండిఆత్మ దేహపు వాంఛలు అధిగ మించ
స్వంత లాభము పొందకే చింత యుంచి
పాలు నీళ్ళను బోయుచు ప్రార్ధన లిడి
శుచిని శుభ్రతను మరువ శుభము గాదు!!
ఆది శంకర పాఠంబు నాచరించి
నిత్య పూజను మనమున నెరవు జేసి
ఆత్మ స్థైర్యముబలిమితో నలవి జేయ
ఆకులలమల పూజింపు లక్కరమ్మ?
పూజ్య గురుదేవులకు, కవిమిత్రులకు శివ రాత్రి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికాల కాలాయ శ్రీకంఠాయ శంభవే
రిప్లయితొలగించండి***** భవ నాశకాయ తుభ్యం నమామి
నగజాధిపాయ పన్నగ భూషణాయ భ
***** స్మాంగరాగాయ తుభ్యం నమామి
ప్రమథాధినాథాయ త్ర్యంబకాయ హరాయ
***** ఫాల నేత్రాయ తుభ్యం నమామి
సోమాయ రుద్రాయ భీమాయ శూలినే
***** వామదేవాయ తుభ్యం నమామి
కాల రూపాయ దివ్య గంగాధరాయ
శంకరాయ గిరీశాయ శాశ్వతాయ
సిద్ధ సాధకాయ సుధాంశు శేఖరాయ
ప్రత్యయాయ శర్వాయ తుభ్యం నమామి !!!
మీకు అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండితేటగీతి:
ఆదిశంకర నిన్నునేనాశ్రయింతు
సోమశేఖర నీకునే సుమములిడుదు
మంగళాకార వదలక మదిని గొలుతు
బుధుడ వంచును దలతురా బుద్ధి గరపు
గురుడవేనీవు మార్గమ్ము గురుతు దెలుపు
శుక్రవంతుడ దయతోడ శుభములిమ్ము
శనివి చూడ్కులు నావైపు సాగనీకు
ఏడు వారమ్ములున్ భక్తి వేడుకొందు.
ముక్కంటికి భక్తిని నే
రిప్లయితొలగించండిమ్రొక్కులిడుదు నిత్యము, శుభములు గలుగంగా
చక్కటి దారినిఁజూపగ
నొక్కడివీవే గతియని యొప్పుగ మదిలో.
క్షీరపు ధారలు, హిమవని
దారుల తలపింపజేయ తాదాత్మ్యముతో
మీరలు శైలసుతాధిపు
నారసి నే గొలుచుట గనుడానందముతో.
బాలనుగా నున్నపుడే
పాలనఁ జేయగను కోర పార్వతి తానే
లాలనతో మాయింటను
మాళవి దేవిగ వెలసెను మా యిలవేల్పై.
వంకలు జుట్టినట్టి జడ పాయల మాటున నున్న గంగ మా
రిప్లయితొలగించండివంకన దింపు మయ్యశివ భక్తవశంకర పార్వతీశ మా
సంకట ముల్దొలంగు ముని సన్నుత పిల్లలు పాపలున్ నిరా
టంకపు జీవనమ్మును జనావళి మెచ్చగ జేయరే యిలన్ !!!
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘...సలిపెద నెదలో’. ‘రాత్రికి నుపవాస...’ అనండి.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
భరణి శబ్దానికి భూమి అనే అర్థం ఉన్నా రూఢ్యర్థం ఒక నక్షత్రమే. మీరక్కడ ‘వసుధయందు’ అంటే సందిగ్ధత ఉండదు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
చివరిపాదంలో గణదోషం. ‘చేడియతోఁ జేసెద రభిషేకము ప్రీతిన్’ అందాం.
*****
జిలేబీ గారూ,
మీ భావానికి నా పద్యరూపం....
పాలు దెచ్చి రాల పాలుసేయుచు భక్తి
చూప నేల? ఫలము శూన్యమగును;
కుండెడైన పాలు క్షుత్పిపాసార్తుల
కిడిన శివుడు మెచ్చులే జిలేబి!
(అన్నట్టు మీరు పికె, గోపాల గోపాల సినిమాలు చూశారా ఈమధ్య?)
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘వాంఛలు + అధిగమించ’ అన్నప్పుడు సంధి నిత్యం. ‘వాంఛలే యధిగమించ’ అనండి.
*****
డా. విష్ణునందన్ గారూ,
నిత్యపారాయణం చేసికొనవలసిన శివస్తోత్రాన్ని అందించారు. ధన్యవాదాలు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
శివరాత్రి పర్వదినమున
రిప్లయితొలగించండిశివనామస్మరణజేసి క్షీరము తోడన్
శివునభిషేకించి జనులు
భవహర మముగావుమనుచు ప్రార్ధింతురిలన్!!!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
గరళము మ్రింగి లోకములగాచినశంకర! నీకృపన్ సదా సురలును దైత్యులున్ నరులు సూక్తు లెరు౦గని జంతు జాలమున్
రిప్లయితొలగించండివరములుబొంది గ్రాలెదరువంతలు బాయగ,ముక్తి మార్గమున్
అరయగ జేతువీవు పరమాత్మను జేరగ జీవులందరున్
రిప్లయితొలగించండిమల్లెల వారి పద్యము
తాను తెలియ కుండ దైవమునకు బెట్ట
దీపమి౦పు గాను తేజమిచ్చె
గుణనిదికి, శివుడుగొప్పగా శివరాత్రి
మహిమ నెన్న దరమె మహిని నెందు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
గగనమ్మునందుండు గంగా నదిని నీదు
రిప్లయితొలగించండి.........శిరముపైనెట్లు దాల్చితివి స్వామి
గరళోద్భవముచే సకలమెల్ల భీతిల్ల
......... గైకొంటివెట్లు నీ కంఠమందు
ధవళాచలాధీశ దర్పంబుఁ జూపక
......... కరి చర్మధారివై తిరుగుటెట్లు
సంపెంగలను దాల్చ సాహసింపవుగాని
......... పన్నగాభరుణుఁడై బరగి నావు
ఘన విభూతి విభూతిగా గలిగినావు
ప్రథిత సర్వజ్ఞ నామ్ము వడసినావు
నీదు మహిమల వర్ణింప నాదు తరమె
ప్రణతులందింతు నీకు కైలాస వాస.
సంపెంగ = సంపెంగ పూవు, బంగారు
శ్రీశైలాధిప! పార్వతీప్రియ! హరా! చిన్ముద్ర రూపాధికా!
రిప్లయితొలగించండియీశా! భక్త గణార్చితాంఘ్రి చరణా! హేదివ్య చిన్మూర్తి! వా
గీశేంద్రాది సురాళి సంస్తుత వరా! హ్రీంకార మంత్రాత్మకా!
పాశా ముక్తుఁని చేయగల్గిన భవా! బ్రహ్మాండనిర్మాత్మకా!
ప్రథిత సర్వజ్ఞ నామమ్ము వడసినావు
రిప్లయితొలగించండిగురువులు శ్రీ కంది శంకరయ్యగారికి మరియునితర కవిమిత్ర బృందానికి మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు
రిప్లయితొలగించండికె యెస్ గురుమూర్తి ఆచారి గారి పద్యము సుగంధి:
రిప్లయితొలగించండిబాలచంద్రమౌళి లీల భక్తపాల శంకరా
శూలపాణి నాగభూష శుభ్ర దేహ ఈశ్వరా
నీలకంఠ నిర్వికార నిర్మలా మహేశ్వరా
జాలమేల మమ్ము నేల జాలవా శివా హరా
పాలధార తోడనిన్ను ప్రార్ధనము జేసెదన్
పాలకుండ వీవె గాన పాహియంచు వేడెదన్
పాలముంచి గావు మయ్య ప్రత్యహమ్ము నాదు లో
పాలనెల్ల మాపి స్వామి! పార్వతీ హృదీశ్వరా
పాలాభిశేకమును శ్రీ
రిప్లయితొలగించండిపాలాక్షుని లింగమునకు ప్రనుతులతోడన్
శీలాన్విత అర్చకుడే
మేలిమిగను చేయుచుండె మేలగు ప్రజకున్
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ సీసము, శార్దూలము రెండూ బాగున్నవి. అభినందనలు.
‘పాశముక్తుని’ అనవలసింది. అక్కడ ‘పాశమ్ముల్ దెగఁ జేయఁగల్గిన భవా!’ అనండి.
*****
కె.యస్.గురుమూర్తి ఆచారి గారూ,
మీ సుగంధి వృత్తం బాగున్నది. అభినందనలు.
‘ప్రార్థనమ్ము’ టైపాటువల్ల ‘ప్రార్థనము’ అయింది.
*****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘శీలాన్విత + అర్చకుడు’ అన్నప్పుడు సవర్ణదీర్ఢసంధి జరగాలి కదా! అక్కడ ‘శీలాన్వితుఁ డర్చకుఁడే’ అనండి.
మీ సూచన సర్వదా అనుసరణీయమే గురువర్యా.
రిప్లయితొలగించండిధన్యోస్మి
తలపుననమఃశివాయ-ననదల్చినచో?శివరాత్రిమంత్రమే|
రిప్లయితొలగించండిపలుకునశంకరాయనుచు,పాలభిషేకముజేయ?రక్షణే
విలువగుదీపదూపమునవిజ్ఞులపూజకు?లోకశాంతియే
కలు షితమైనభావనలకర్మనుదృంచునులింగపూజచేన్\
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘తలపున నమః’ అన్నచోట గణదోషం. ‘తలపు నమః’ అనండి. ‘పాల+అభిషేకము = పాల యభిషేకము అవుతుంది. ‘పాలను తానము జేయ’ అందామా?
ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమన్నించండి. మీరు ‘పాలు + అభిషేకము జేయ’ అనే అర్థంలో ప్రయోగించారు. అక్కడ ఉత్వసంధి జరిగింది. నేను పొరబడ్దాను.
పాలను స్నాన మాడితివి, భవ్యముగా మది నెంచు వాడ మా
రిప్లయితొలగించండిపాలను గల్గు వాడవని, భావ్యమె జాలము బాప మాదు పా-
పాలను? భద్రమూర్తి వయి పాలన జేయవె యీశ! కోపతా-
పాలను జూప, బిడ్డలము, ప్రార్థన జేతుము, తాళ లేమయా!
అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిపంచామృతాదులన్గొని
యంచితముగ పరమశివున కభిషేకించన్
తుంచును పాపము లెల్లను
పంచును సుఖశాంతు లెల్ల పరవశమందన్!
రిప్లయితొలగించండికంది వారు,
నెనర్లు ! పీ కే , గోపాలా గోపాలా కన్నా అంతకు మునుపే మన వేమన గారు చెప్ప లేదండీ ఈ తత్వాన్ని ??
మీ జిలేబీయం అద్భుతః !
చీర్స్
జిలేబి
పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు.తమరు
రిప్లయితొలగించండి‘పాల+అభిషేకము = పాల యభిషేకము అవుతుంది'
అనివ్రాశారు. నేను పాలాభిషేకము అని వాడాను. అభిషేకము అర్థంచూస్తే పట్టాభిషేకము, రాజ్యాభిషేకము, సూత్రాభిషేకము, పాదుకాంతాభిషేకము,స్వర్ణాభిషేకము, తైలాభిషేకము కనుపించాయి. దీనిని దయతో తెలిజేయండి.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
జిలేబీ గారూ,
ధన్యవాదాలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
‘పాలు+అభిషేకము= పాలభిషేకము’ (ఉత్త్వసంధి). అవుతుంది. కాని ‘పాల + అభిషేకము = పాలాభిషేకము’ కాదు! మీరిచ్చిన ఉదాహరణాల్లో పూర్వపదాలన్నీ సంస్కృతాలే. కాని పాలు తెలుగు పదం. దానిని సంస్కృతపదంతో సవర్ణదీర్ఘసంధి చేయరాదు.