పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ****** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘పెరుగదె’లో పెరుగు లేదు. అక్కడ ‘పెరుగుట లేదే తమకము...’ అనండి. ***** రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. నేయిని నేయిం చేశారు. ‘...గోరనే యిగురుబోడిఁ| బాలు...’ అనండి.
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మిస్సన్న గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వెన్న దొంగను గురునాధ ! వేడు కొందు
రిప్లయితొలగించండిరాజ్య భాగపు సగ పాలు రమ్యము గను
బి లిచి వారికి నే యిమ్ము పెంపు తోడ
నందు వలనన పెరుగునీ యశము కూడ .
రారాజుతో శకుని :
రిప్లయితొలగించండికడలివెన్నవంశ ఘనుడవౌ రారాజ
పాండవులను నేలపాలు జేతు
పెరుగునే యిడుములు కురువంశజులకింక
చెంతనేను నిలువ చింత యేల
వారి పాలు రాజ్యము నీవు పంచకున్న
రిప్లయితొలగించండిపెరుగు వైరము సుతులలో విరుగు కులము
కలుగు నేయిలఁ బోరులో గెలుపు మనకు
వెన్న దొంగ వారికి సదా వెంట నుండ
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
******
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అర్జునునితో ఊర్వశి:
రిప్లయితొలగించండిమురిపాలఁ జూప నీలో
పెరుగదె నాపై తమకము పేడితనమ్మా?
బిరబిర వెన్నల జుర్రవె?
మురిపించెద నే యిముడవె ముద్దులఁ దేలన్!
ధర్మరాజు శాంతికాంక్ష
రిప్లయితొలగించండి"పాలు"పోవదు పోరుకై పాలుపడగ
"పెరుగు"యశమది కలిసినన్ పరులతోడ
నన్న సంధిని కోరునీ"వెన్న"డైన
నిలచు "నేయి"ల ధర్మంబు నిత్యముగను
మల్లెలవారిపూరణ
రిప్లయితొలగించండిపాలు నీయకున్నను నైదు పట్టణాలు
పెరుగుటకును మనుజులుగ పృథ్వి యందు
నిడుము.నీవెన్న,ఘనుడంచు నెపుడు పొగడు
పడుదుగా,నేయిడుము లేక పాండులు౦డ
'కామాతురాణాం న భయమ్ న లజ్జా'
రిప్లయితొలగించండి"అ౦తిపురమున గోరనేయింతి యైన
పాలుగొనుచు సొంపెరుగు నాపడక పైన
ఏలుకొనుము సైరంధ్రి నీవెన్నటికిని
రాణి వై యుండి కీచకు రాణి వగుచు
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘పెరుగదె’లో పెరుగు లేదు. అక్కడ ‘పెరుగుట లేదే తమకము...’ అనండి.
*****
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నేయిని నేయిం చేశారు. ‘...గోరనే యిగురుబోడిఁ| బాలు...’ అనండి.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
రిప్లయితొలగించండిమురిపాలఁ జూప నీలో
పెరుగుట లేదే తమకము పేడితనమ్మా?
బిరబిర వెన్నల జుర్రవె?
మురిపించెద నే యిముడవె ముద్దులఁ దేలన్!
గురుదేవులకు ధన్యవాదములు మీసూచనతో సవరించిన
రిప్లయితొలగించండిపద్యము:"అ౦తిపురమున గోరనే యిగురుబోడి
బాలు గొనుచు సొంపెరుగు నాపడక పైన
ఏలుకొనుము సైరంధ్రి నీవెన్నటికిని
రాణి వై యుండి కీచకు రాణి వగుచు
కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిఒసగు మావారి పాలు సుయోధనుండ!
ఇవ్వకున్న,వారి బలము నీవెన్నకున్న,
పెరుగు పోరు. నీవంశము విరుగు సుమ్మి
కనుక నేయిక సంధిమే లనియె శౌరి
రాయబారములో శ్రీకృష్ణ పరమాత్ముఁడు........
రిప్లయితొలగించండిపాండుకుమారభూవరుల పాలు నొసంగుట ధర్మబద్ధమై
యుండును ప్రేమలున్ పెరుగు నోధృతరాష్ట్ర మదీయ వాక్యముల్
నిండుమనంబుతోడ కరుణించెదెవెన్నగ నీదు వంశజుల్
భండనమందు నాశనము పాలగునే యిది యోచి చూడుమా!
రాయబార సమయమున కృష్ణుడు సుయోధనునితో...
రిప్లయితొలగించండిపాలును గోర రాజ్యమున భావ్యమె కాదన కౌరవేశ్వరా
చాలును క్రోధముల్ పెరుగు సఖ్యత బాయును నీదు మాటలన్
మేలము మాని పాండవుల మేలు ఘటింపుము చాలవెన్నడున్
పోలగ వారి శౌర్యమున పోయకు నేయిని వైరవహ్నిలో.
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పెరుగులాభాలకాశించపెద్దముప్పు
రిప్లయితొలగించండిపాలుబంచుటధర్మముపాండవులకు
వెన్ననిప్పునజేర్చిన?తిన్నగాను
కరుగునే?యికమీరెంత?కరుణచేత
భాగముంచుముదృతరాష్ట్ర|భాధ్యతనుచు
రాయభారానకృష్ణ్డునిరాకదెలిపె
"పాలు" యిమ్మని యర్ధించ పరమ పురుషు,
రిప్లయితొలగించండి"పెరుగు" చుండిన కోపాన పేర్మి మరచి
"వెన్న" దొంగని దూషించి వెళ్ళ గొట్ట!
కధను నడిపెతా"నే యి"క కదన మందు!
తిమ్మాజీరావు గారి సవరించిన పూరణంలో
రిప్లయితొలగించండిమొదటి పాదంలో "నేయి" వచ్చింది,కానీ.. యతి సరిపోయినట్టు లేదు.
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘పాలు + ఇమ్మని’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘పాలు తమకిడ నర్థించ...’ అనండి.
*****
రెండుచింతల వారూ,
ధన్యవాదాలు. నేను గమనించలేదు.
‘ఏను గోర నంతిపురి నే యిగురుబోడి’ అంటే ఎలా ఉంటుంది?
ఇప్పుడు సరిపోయింది
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిదుర్యోదనుని స్వగతం..
నేనేల పాలు నిచ్చెద
నీనేల పాలు సలుపగ నిటు కసి పెరిగెన్
నేనే యిచ్చెద వారికి
నానా వెతలను కననిక నవ్వెన్నటికిన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.