జనులు దమతమ పనులను సహిత మునిల బెట్టి ప్రక్కన , జూతురు పిచ్చ గాను నీ క్రి కెట్టును మఱి వారి కేమి సుఖము కలుగు నోతెలి యదునాకు తెలియు మీకు ? బంతి దెబ్బల తోబాధ పడగ వారు !
ఆడెడిఆటలందు,దునుమాడకనందరికిష్టమైనదై నేడు క్రికెట్టుయంసమన?నెవ్వరువద్దనజాలరందుకే కాడియుగట్టువారలకు,కమ్మనివంటలుజేయుఅమ్మకున్ ఆడెడిబాలబాలికలనంతరమందుననిల్పె|లోకమున్|
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘తిక్కేంటంచు’ అన్నచోటనే వాడుకపదం ఉంది. ‘తిక్కల్ చాలు...’ అంటే సరి! ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. రెండవ పద్యంలో ‘...యిష్టమాయె నిదియ..’ అనండి. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. రెండవ పాదంలో గణదోషం.‘మీసమ్ములను మెలివేసి..’ అంటే సరి! ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘క్రికెట్టు యంసమన’...? ***** భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
టీమిండియా కింత టెంపరా తప్పదు .............పాక్చేతిలో గొప్ప భంగపాటు నెగ్గెలే పాక్పైన నీటుగా విరమించు .............సౌతాఫ్రికా జట్టు చవట కాదు సౌతాఫ్రికా పైన సాధించినారులే .............వెస్టిండియన్సన్న వెర్రి భయము ఐర్లండు జట్టు పై నంత తేలిక కాదు .............అసలు ముందుకు సాగ నవదు చూడు
భళిభళీ కైవసమయె ప్రపంచ కప్పు యేమి మాటలే ఇండియా టీమనంగ? మాట మార్చిరి వేగ విమర్శకాళి పొంగె భారత హృదయాలు పోరు ముగిసె.
గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం హిందూస్తానీ పదాలతో బాగున్నది. అభినందనలు. ***** మిస్సన్న గారూ, మీ పద్యం చాలా బాగున్నది. అభినందనలు.
కిక్కెక్కించును చూచువారలకునీక్రీడన్న ప్రాణంబుగా
రిప్లయితొలగించండిపక్కంబెట్టుచు సర్వకార్యముల రెప్పన్ వాల్చకన్ జూచునీ
తిక్కేంటంచు విమర్శ జేసినను ముద్దీయాటయేయంచు నీ
క్రిక్కెట్టున్ మురిపెంబుగా గనెడు వారీ దేశమందెందరో
(వాడుకపదాలకు క్షంతవ్యుండను )
జనులు దమతమ పనులను సహిత మునిల
రిప్లయితొలగించండిబెట్టి ప్రక్కన , జూతురు పిచ్చ గాను
నీ క్రి కెట్టును మఱి వారి కేమి సుఖము
కలుగు నోతెలి యదునాకు తెలియు మీకు ?
బంతి దెబ్బల తోబాధ పడగ వారు !
జేసెడి పనులను వీడుచు
రిప్లయితొలగించండిమీసము లనుమెలి వేసి మీరిన బెట్టున్
రోసముగ క్రికెటు గెలిచిన
భాసము గాముదము నొంది పలువురు మెచ్చన్
పురిటి గ్రుడ్డు కూడ పొరలుచు నటునిటు
రిప్లయితొలగించండిచూచు చుండె నిపుడు చోద్య ముగను
నీ క్రి కెట్టు నార్య ! నెంత గా నోమఱి
యెంత యిష్ట మాయె ? యిదియ ప్రజకు
చంద్ర మౌళి గారూ, పద్యం లయాత్మకంగా ఉండాలి కాని పద్యంలో తెలుగు నుడికారాలు, పలుకుబళ్ళు, మాండలికాలు వద్దనుకొంటే ఎలా? మీ పద్యం చాలా బాగుంది.
రిప్లయితొలగించండిఆడెడిఆటలందు,దునుమాడకనందరికిష్టమైనదై
రిప్లయితొలగించండినేడు క్రికెట్టుయంసమన?నెవ్వరువద్దనజాలరందుకే
కాడియుగట్టువారలకు,కమ్మనివంటలుజేయుఅమ్మకున్
ఆడెడిబాలబాలికలనంతరమందుననిల్పె|లోకమున్|
క్రీడ లందు లెస్స నేడు క్రికెట్టాట
రిప్లయితొలగించండిఆడ మొగలు కలసి యలుపు లేక
ఆట చూడ వచ్చు అన్ని వయసులందు
గుండె బిగువు కొద్ది గోల పెట్టి
బేటు పెట్టి కొట్ట పోటుగానొకషాటు
సెకెను లోన ఆట షేపు మారు
కెవ్వు కెవ్వు మంటు కేక లేసి జనము
ఆరు నాలు గనుచు యరుపు పెట్టు
విశ్వ కప్పు యుద్ధ వీరవిహారులై
ధోని సేన దున్ని దుమ్ము రేప
భరత జాతి జనుల పౌరుషమ్ములదురు
గెంతి గెంతి జనము ఘీంక రించు
పట్టించు కున్నప్రజకు క్రి
రిప్లయితొలగించండికెట్టే లోకమ్ము చూడ, గెలుపోటములన్
బెట్టింగులు, హర్టింగులు,
గట్టిగ గన శ్వాస, తిండి, ఘన నిద్రదియే.
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘తిక్కేంటంచు’ అన్నచోటనే వాడుకపదం ఉంది. ‘తిక్కల్ చాలు...’ అంటే సరి!
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పద్యంలో ‘...యిష్టమాయె నిదియ..’ అనండి.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం.‘మీసమ్ములను మెలివేసి..’ అంటే సరి!
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘క్రికెట్టు యంసమన’...?
*****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఒట్టీ భారత క్రిక్కెటు
రిప్లయితొలగించండిజట్టుకు విజయంబు కలుగు జయ ఘోషణలున్
ముట్టును గగనంబునకున్
పట్టును నీరాజనంబు ప్రజ సంప్రీతిన్
ఒట్టీ భారత క్రిక్కెటు
రిప్లయితొలగించండిజట్టుకు విజయంబు కలుగు జయ ఘోషణలున్
ముట్టును గగనంబునకున్
పట్టును నీరాజనంబు ప్రజ సంప్రీతిన్
ఒట్టీ భారత క్రిక్కెటు
రిప్లయితొలగించండిజట్టుకు విజయంబు కలుగు జయ ఘోషణలున్
ముట్టును గగనంబునకున్
పట్టును నీరాజనంబు ప్రజ సంప్రీతిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపదకొండు మంది యాటకు
రిప్లయితొలగించండిపదివేవురు ప్రజ సతతము పరవశపడుచున్
వదలి దినపు కార్యములను
కదలరు క్యాంటీన్లనుండి కాంచుచు టీవీ!
ధన్యవాదములు కుమార్ గారూ..ధన్యవాదములు మాష్టారు
రిప్లయితొలగించండిసర్వము మరచి క్రికెట్టున్
రిప్లయితొలగించండినుర్వీజనులంత జూచు నుల్లాసముగన్
పర్వంబుగ దలచి గెలువ
గర్వముతో గంతులేయు కప్పును కొడితే!!!
మొన్న ఆదివారము నాటి ఆట గుర్తు తెచ్చుకొంటూ:
రిప్లయితొలగించండిశిఖరముఁ దాకెడు నూపున
శిఖారు, రహనే పరుగుల చిందులు వేయన్
దఖలుపడె నాట సాంతము
నిఖార్సయిన నాట తీరు నెగడించుగదే!
టీమిండియా కింత టెంపరా తప్పదు
రిప్లయితొలగించండి.............పాక్చేతిలో గొప్ప భంగపాటు
నెగ్గెలే పాక్పైన నీటుగా విరమించు
.............సౌతాఫ్రికా జట్టు చవట కాదు
సౌతాఫ్రికా పైన సాధించినారులే
.............వెస్టిండియన్సన్న వెర్రి భయము
ఐర్లండు జట్టు పై నంత తేలిక కాదు
.............అసలు ముందుకు సాగ నవదు చూడు
భళిభళీ కైవసమయె ప్రపంచ కప్పు
యేమి మాటలే ఇండియా టీమనంగ?
మాట మార్చిరి వేగ విమర్శకాళి
పొంగె భారత హృదయాలు పోరు ముగిసె.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం హిందూస్తానీ పదాలతో బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
మీ పద్యం చాలా బాగున్నది. అభినందనలు.
మూడు పుల్లల తోడను ముదము నాడు
రిప్లయితొలగించండివీధి క్రికెటును మొదలుగా విశ్వమందు
జరుగు పోటీల వరకును జనులు వెఱ్ఱి
గాను దీనినే జూడరే ఘనము నేడు
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.