4, ఫిబ్రవరి 2015, బుధవారం

సమస్యా పూరణం - 1591 (బ్రహ్మ కడిగిన పాదముఁ బట్టవలదు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
బ్రహ్మ కడిగిన పాదముఁ బట్టవలదు.

29 కామెంట్‌లు:

 1. బ్రహ్మ కడిగిన పాదము బట్ట వలదు
  నాబ లికిరా ర్యు లునిజమ ? నాదు మాట
  వినుడు, బ్రహ్మక డిగెనుగా విష్ణు పాద
  ములను గావున విష్ణువు పూజ్యు డిలకు

  రిప్లయితొలగించండి

 2. బ్రహ్మ కడిగిన పాదముఁ బట్ట వలదు
  శంక - యేల చేసెదవింక జాగునీవు
  స్వామిపాదములనుతాకి శరణమనిన
  కరుణతోననవరతము గాయు హరియె

  రిప్లయితొలగించండి


 3. పట్టనర్హత గలుగునా ? పట్టమనకు
  బ్రహ్మ కడిగిన పాదము,బట్ట వలదు
  అడ్డ మైనవా రలకాళ్ళు హాస్య మునకు
  నైన నెపుడును నిజమిది యౌన ?కాద ?

  రిప్లయితొలగించండి
 4. పాపముల నెన్నొ జేసిన పాపు లనగ
  బ్రమ్మ కడిగిన పాదముఁ బట్ట వలదు
  శరణు వేడిన దైవము కరుణ జూపి
  పరమ భక్తిగ తాకిన వరము లిడును

  రిప్లయితొలగించండి
 5. బ్రహ్మ కడిగిన పాదముఁ బట్టవలదు
  అల్ప మైనట్టి కోరిక లడుగుటకును
  అక్షయమగుసంపదలకునాశ్రయమది
  పరమ పావని గంగకు కారణమది

  కామ్యములకును కడపటి గమ్యమదియె
  మోక్షమివ్వగలుగు ఘన దక్షతదియె
  దాని నతిచిన్న ఫలముకై తలవరాదు
  చేరి శిఖరము లోయలో జార రాదు

  రిప్లయితొలగించండి
 6. పాప కర్మలు పలుజేసి ప్రణతి లిడుచు
  బ్రహ్మ కడిగిన పాదముఁ బట్ట వలదు
  ధాత కడిగిన పాదము దక్క గానె
  తాను జేసిన పాపము తప్పు నెట్లు ?

  రిప్లయితొలగించండి
 7. శంకరాభరణం లో చేరి నేటితో సంవత్సరం పూర్తయ్యింది. 63వ యేట వ్యాకరణం నేర్చుకుని 64వ యేట శంకరాభరణంలో చేరాను. పూజ్య గురుదేవుల దీవెనతో సమస్యా పూరణలు, న్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి, దత్తపదులు పూరించ గలుగు చున్నాను. అద్భుతమైన కవిత్వము వ్రాయక పోయినా పూరించ గలుగుచున్నాననే తృప్తి ఉన్నది. నేను చేరినప్పుడు యిన్ని రకాల పూరణలుంటే పారిపోయే వాడిని. ఇప్పటికి యితర సైటులో పూరణ చేయాలంటే భయమేస్తుంది. ఇక్కడ గురువుగారి దీవెనలుంటాయి కాబట్టి ధ్యైర్యముంటుంది.
  గురువుగారి పాదపద్మములకు వందనములతో

  మోక్షమిచ్చును పూజించ ముదముతోడ
  బ్రహ్మ కడిగిన పాదముఁ బట్టవలదు
  కలుష స్వాముల పాదముల్ కలలనైన
  శంకర గురుదేవుని మాట చద్ది మూట

  రిప్లయితొలగించండి
 8. మధ్య మాంసాల ముట్టెడి మానవుండు!
  భోగ లాలసు డయినట్టి పోకిరీలు!
  తగదు తగదయ్య దేవుని తాకరాదు!
  బ్రహ్మ కడిగిన పాదము బట్ట వలదు!

  రిప్లయితొలగించండి
 9. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శ్రీవల్లి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  పద్యం మధ్యలో అచ్చులు రాకూడదని నియమం. మీరు ‘వలదు + అల్ప, అడుగుటకును + అక్షయ’ అని విసంధిగా వ్రాసారు.
  ‘...బట్టవలదు
  స్వల్ప మైనట్టి కోరిక సాధనమున
  నక్షయమగు...’ అందామా?
  ‘దక్షత + అదియె’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. అక్కడ ‘దక్షత యది’ అనండి.
  *****
  భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ప్రణతు లిడుచు’ టైపాటు వల్ల ‘ప్రణతి లిడుచు’ అయింది.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  చాలా సంతోషం. పద్యరచనలో చక్కని ప్రావీణ్యాన్ని సాధించారు. మీకు అందరి ప్రోత్సాహం ఎల్లవేళలా ఉంటుంది.
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘కలుషస్వాముల’ అన్నప్పుడు ‘ష’ గురువై గణదోషం. ‘కలుషగురువుల’ అనండి.
  *****
  టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. భక్తి శ్రద్ధలు లోపించు పారగతులు
  దైవ చింతన లేకుండ దనరు వారు
  సర్వసాక్షిని దూరుచు సాగు జనులు
  బ్రహ్మ కడిగిన పాదము బట్ట వలదు !!!

  రిప్లయితొలగించండి
 11. నమస్కారమండి. తప్పులు సవరించే ప్రయత్నం చేశాను.

  బ్రహ్మ కడిగిన పాదముఁ బట్టవలదు
  స్వల్ప మైనట్టి వాంఛల సాధనకును
  పరమ పావని గంగకు కారణమది
  మోక్షమివ్వగలుగు ఘన దక్షతయది

  శాశ్వతమగుసంపదలకుస్థానమదియె
  కామ్యములకును కడపటి గమ్యమదియె
  దాని నతిచిన్న ఫలముకై తలవరాదు
  చేరి శిఖరము లోయలో జార రాదు

  రిప్లయితొలగించండి
 12. శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి - ఈ ప్రత్యేక సందర్భములో అభినందనలు.నేనెఱిగినంతలో శంకరాభరణ వేదిపై - పద్య రచనలో అ ఆలతో మొదలుపెట్టి - అచిరకాలంలోనే మంచి పట్టు సంపాదించిన వారిలో మీరొకరు. అభ్యాసేన విద్యా ...ఇతోధిక ఫలములు సాధింపగలరు.
  అన్నట్టు మోక్షమిచ్చును పూజించ బదులుగా పూజింప అంటే బాగుంటుంది. అది పద్య కవితలో మంచిది.

  రిప్లయితొలగించండి
 13. హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో:
  వలదు ప్రహ్లాద శ్రీహరిన్ గొలువ వలదు
  తండ్రి నైన నా పాదము తలచు మెపుడు
  కడిగె హరి పాదమా బ్రహ్మకొడుకు కాన
  బ్రహ్మ కడిగిన పాదముఁ బట్ట వలదు

  రిప్లయితొలగించండి
 14. శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘పారంగతులు’ శబ్దం సాధువు. అక్కడ ‘భక్తి శ్రద్ధలు లోపించువారు, సుంత| దైవచింతన లేకుండ...’ అనండి.
  *****
  శ్రీవల్లి గారూ,
  సవరించిన మీ పూరణ బాగున్నది. సంతోషం!
  *****
  డా. విష్ణునందన్ గారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 15. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మీ అమ్మాయి పెళ్ళికి వచ్చినందుకు ఆ రెండురోజులు నాకు ఆహ్లాదంగా గడిచాయి. మీ ఆతిథ్యం నాకు సంతోషాన్ని కలిగించింది. మీరు పెళ్ళి పనుల్లో వ్యస్తులై ఉంటారనుకొని మళ్ళీ ఫోన్ చేయలేదు. తిరుమల, కాళహస్తి ప్రయాణంకూడా సాఫీగా జరిగింది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 16. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. అణువణువుహరి|నిలువగ? "హరిననకిక
  బ్రహ్మకడిగినపాదముబట్టవలదు"
  అండ,పిండ-బ్రహ్న్డాండాన-నణగియుండ?
  పాదమేబట్టవలదన?భావ్యమగున?

  రిప్లయితొలగించండి
 18. గురుదేవులకు ధన్యవాదములు.తమ ఆశీస్సులందే భాగ్యం మాకూ మా పిల్లలకు కలిగినందులకు ధన్యులము.
  _/|\_ _/|\_ _/|\_

  రిప్లయితొలగించండి
 19. హిరణ్యకశిపుఁడు తన తనయుఁడగు ప్రహ్లాదునితో..........

  సర్వలోకాధిపత్యమ్ము జవము బలము
  వరవిశేషము సురగణ వందనములు
  బడసి యున్నట్టి నన్నిట పరిహరించి
  బ్రహ్మ కడిగిన పాదముఁ బట్టవలదు.

  రిప్లయితొలగించండి
 20. "జీవరక్షణకైనుండి-చింతదీర్చు
  బ్రహ్మకడిగినపాదము|"బట్టవలదు
  మోసపూరితభావాలమోజులున్న
  నేటిబాబాలపాదాలునెప్పుడైన.

  రిప్లయితొలగించండి
 21. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ ఫూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. కే*యస్*గురుమూర్తిగారిపూరణం
  శైవుడొకడుమూర్ఖుడగుచు-సాపెనిటుల
  బ్రహ్మతలనొకటి-నరికెపరమశివుడు
  శంకరరిపువుమనకునుశత్రువేగ?
  బ్రహ్మకడిగినపాదముబట్టవలదు

  రిప్లయితొలగించండి
 23. కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘మూర్ఖుఁ డగుచుఁ జాటె నిటుల’ అనండి.

  రిప్లయితొలగించండి
 24. మనసు లోననె శరణంచు మహిత విభుని
  వేంకటేశుని పదముల వేడవలయు
  మూలవర్లను తాకుచు మూర్ఖ రీతి
  బ్రహ్మ కడిగిన పాదంబు పట్టవలదు

  బ్రహ్మ మన్నది మనయందె వరలుననుచు
  నాత్మతత్వంబు నెరిగియు,నాత్మవట్టు
  బ్రహ్మ కడిగిన పాదంబు-పట్టవలదు,
  యితరమైనట్టి రక్షణ నెపుడు జగతి

  రిప్లయితొలగించండి
 25. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. గురువు గారు చాలా తప్పులుంటే క్షమించాలి. 5 నిముషాలలో రాసే ప్రయత్నం చేసినాను
  లక్షీదేవి వైకుంఠమును వీడుట...
  తన నివాసస్థానము దన్న ఔర? హరియె
  భృగు పాదము గైపట్టి వొత్తగ నిక
  బ్రహ్మ కడిగిన పాదముఁ బట్టవలదు
  వలదు యంచు తలచి రమ వైదొలంగె

  రిప్లయితొలగించండి