10, ఫిబ్రవరి 2015, మంగళవారం

సమస్యా పూరణం - 1594 (పుడమి వెలుఁగును మిణుగురు పురుగు వలన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పుడమి వెలుఁగును మిణుగురు పురుగు వలన.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

26 కామెంట్‌లు:

 1. సూర్య భగవాను కిరణాలు సోకు కతన
  పుడమి వెలుగును, మిణుగురు పురుగు వలన
  తెల్ల తెల్లని వెలుగులు తిమిర మందు
  కాంతి పుంజము వోలెను గాన బడును

  రిప్లయితొలగించండి
 2. గడ్డిపరక ధైర్యమునిచ్చు కడలినీద
  కడుపునింపనాకలియందు గంజిచాలు
  కారు చీకట్లు మనముందు క్రమ్మినపుడు
  పుడమి వెలుఁగును మిణుగురు పురుగు వలన

  రిప్లయితొలగించండి
 3. స్వప్రకాశ కిరణముల స్వర్ణరేతు
  పుడమి వెలుగును, మిణుగురు పురుగు వలన
  వచ్చు కాంతులు దరిజేర్చు భైరవమగు
  అమ నిసిని బాటసారుల కండగాను.

  రిప్లయితొలగించండి
 4. అలిగిన యెడవిద్యుల్లత రాత్రు లందు
  మెలగు టకువీలు గానక మిణుకు మనగ
  సన్న కొవ్వొత్తి కాంతికి సంత సించ
  పుడమి వెలుగును మిణుగురు పురుగు వలన

  రిప్లయితొలగించండి
 5. కడలి ఉవ్వెత్తు తరంగములు చిన్ని అలల వలన
  దేశాభ్యుదయం సామాన్య మానవుల కష్టఫలమున
  సమస్యాపూరణములు దినదిన తోటి బ్లాగరుల వలన
  పుడమి వెలుఁగును మిణుగురు పురుగు వలన !!

  చీర్స్
  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. పిసరు కోతులే కట్టిరో పెద్ద సేతు
  గడ్డి పోచలే అల్లునో గట్టి మోకు
  నీటి చుక్కలే జేయునో మేటి కడలి
  పుడమి వెలుగును మిణుగురు పురుగు వలన

  రిప్లయితొలగించండి
 7. చంద్రమౌళి గారి పూరణ భావయుక్తంగా చాలా
  బాగున్నది.

  రిప్లయితొలగించండి
 8. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  టి.బి.యస్. శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘అమవసిని’ అనండి.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మొదటి పాదంలో యతిదోషం. ‘అలిగిన యెడ విద్యుచ్ఛక్తి యవిషియందు’ అనండి (అవిషి=రాత్రి)
  *****
  జిలేబీ గారూ,
  మంచి భావాన్ని అందించారు. అభినందనలు.
  మీ భావానికి నా ఛందోరూపం......
  కడలి పొంగు నలతి తరంగముల వలన
  దేశ ప్రగతికి సామాన్యుఁడే శరణము
  బ్లాగుమిత్రులె శంకరాభరణ ప్రభలు
  పుడమి వెలుఁగును మిణుగురు పురుగు వలన.
  *****
  భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
  బహుకాల దర్శనం! సంతోషం! ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 9. గురువు గారికి మిత్రులకు నమస్సులు !

  అలసి యర్కుడు నస్తాద్రి సొలసి యుండ
  మిణుకు తారలు దూరమై బెణకు చుండ
  నిశి సినీవాలి నిబిడమై నింగి నుండ
  పుడమి వెలుఁగును మిణుగురు పురుగు వలన.

  సినీవాలి = చంద్రకళ కనిపించే అమావాస్య

  రిప్లయితొలగించండి
 10. ఏను లేకున్న దేశాని కేమియగునొ
  యనుచు పౌరహక్కులఁ దెంపి నట్టి నేత
  కాల గర్భము నీనాడు కలసి పోవ
  చనుచు నుండెను దేశమ్ము కనుడు, యెటుల
  పుడమివెలుగును మిణుగురు పురుగు వలన

  రిప్లయితొలగించండి
 11. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు? చాలా సంతోషం!
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. అతిగ వాడగ విద్యుత్తు యంతరించు!
  సౌర వెలుగులు చాటగు -సైన్సు జెప్పె!
  అంధకారమె యలమును అవని యంత
  పుడమి వెలుగును మిణుగురు పురుగు వలన!

  రిప్లయితొలగించండి
 13. ప్రహ్లాదుఁడు తన తండ్రిగురించి గురువులతో అంటున్నట్లుగా............

  సకల లోకేశ్వరుఁడను నిశాచరాధి
  పతిని నాయాజ్ఞ లేకనేపగిది జరుగు
  ననుట నీరీతిగాదె విధ్యాధివర్యా
  పుడమి వెలుఁగును మిణుగురు పురుగు వలన.

  రిప్లయితొలగించండి
 14. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  బహుకాల దర్శనం... సంతోషం!
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మూడవ పాదం చివర టైపాటు వల్ల ‘ర్యా’ దీర్ఘమయింది.

  రిప్లయితొలగించండి
 15. స్వార్థచింతనజనులలోసాగబోక
  కలియుగంబునధర్మమౌకాలమందు
  కలహమేయింట-గనలేకగలసియుండ?
  పుడమివెలుగునుమిణుగురుపురుగువలన|
  2సూర్యచంద్రులకాంతిచేచూడగలము
  పుడమివెలుగును|మిణుగురుపురుగువలన?
  దానిశత్రువునిప్పుగాదలచుటందు
  రక్ష|నాహరబిక్ష|యౌరాత్రులందు.

  రిప్లయితొలగించండి
 16. బ్రదుకు కష్టాల కడలిలో బడిన గాని
  చిన్ని యాశయే నావగా జేర్చు దరిని
  చిమ్మ చీకటి నల్దిశల్ క్రమ్మ నిమ్ము
  పుడమి వెలుఁగును మిణుగురు పురుగు వలన.

  రిప్లయితొలగించండి
 17. పరమనిష్టాగరిష్టులౌ గురుల కరుణ
  పుడమి వెలుగును.మిణుగురు పురుగు వలన
  జ్ఞాన దీపము వెలుగుచు సమసిపోవు
  సంశయాస్పదు చిత్తాన జలలత వలె

  రిప్లయితొలగించండి
 18. కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ

  పుడమి వెలుగును మిణుగురు పురుగు వలన
  కాదు,తారకేశుని యొక్క కాంతి వలన,
  ఘనునిచే దేశమభివృద్ధి గాంచు గాని
  వ్యర్దు డైనట్టి యొక నేత వలన కాదు

  రిప్లయితొలగించండి
 19. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. బి*బాలసుబ్బయ్యగారిపూరణం
  కారుచీకటియందునకలసిపోక
  పుడమివెలుగునుమిణుగురుపురుగువలన
  లాభమెవరికి?దానికేలౌక్యమందు
  దైవమొసగినభాగ్యమేతలచగాను|

  రిప్లయితొలగించండి
 21. తిమిర హరుడైన సూర్యుడు తీవ్రమైన
  మబ్బుచాటుకు చేరగా,మాదె గొప్ప
  యనును మిణుకుచు గర్వాన,నధము డొప్పు
  పుడమి,వెలుగును మిణుగురు పురుగువలన

  చెట్టు లేకున్నచో నట చెలువు నందు
  నాముదమ్మను వృక్షంబు యాదరమున
  సూర్యుడేమబ్బు చాటైన చోద్యముగను
  పుడమి వెలుగును మిణుగురు పురుగు వలన

  రిప్లయితొలగించండి
 22. గురు శిష్యుల సంభాషణ:

  పుడమి వెలుగ ఖద్యోతుడె మూల మనగ,
  పుడమి వెలుగును ఖద్యోతము వలననుచు
  శిష్యుడన భావ మిట్లని జెప్పె గురువు
  "పుడమి వెలుగును మిణుగురు పురుగు వలన"
  తప్పు తెలియగ శిష్యుండు తలను దించె!

  రిప్లయితొలగించండి
 23. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ******
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి