‘ఊకదంపుడు’ రామకృష్ణ గారూ, చక్కని పద్యంతో బోణీ చేసారు. అభినందనలు, ధన్యవాదాలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. గళ్ళనుడికట్టు (crossword puzzle)కు గవ్వల అవసరం లేదు. అడ్డం, నిలువు పదాల ఆధారాలు కావాలి.
రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కొంత వినోదముఁ గూర్చును,
రిప్లయితొలగించండిసుంతైనను భాషనేర్పు, శుష్కక్రియ కా
దంతయొ యింతయొ మనిషికి
పంతమలవరుచు, మెదడుకు పనికలిగించున్
గళ్ళ నుడికట్టు జూడగ గలిగె నాకు
రిప్లయితొలగించండినాడ వలెనను కోరిక వేడు కగను
గళ్ళు మాత్రమే గలవట గవ్వ లుమఱి
లేవు గాయట యాడగ లేమ ! చూడు
‘ఊకదంపుడు’ రామకృష్ణ గారూ,
రిప్లయితొలగించండిచక్కని పద్యంతో బోణీ చేసారు. అభినందనలు, ధన్యవాదాలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
గళ్ళనుడికట్టు (crossword puzzle)కు గవ్వల అవసరం లేదు. అడ్డం, నిలువు పదాల ఆధారాలు కావాలి.
మోదము నొందుచు మదికివి
రిప్లయితొలగించండినోదము కలిగించు నంట నూతన రీతి
న్నాదము జేయుచు గడులను
సాదరముగ నింపి నంత సంతస మొందన్
ఊకదంపుడు గారూ మీ పద్యం భలేగా ఉంది
పదములపైన పట్టు గల వారును, భాషనుఁ బ్రేమతో సదా
రిప్లయితొలగించండిముదమగురీతులందు నొక మోహన వాగ్ఝరి గల్గువారునున్,
కదములు త్రొక్కగల్గు బలు కైతల గుఱ్ఱములెక్కువారు, నీ
పదచతురంగకేళినిక బల్వురు మెచ్చగ నింపుచుండరే!
గళ్ళ నుడికట్టు పూరించ కళ్ళు పెట్టి
రిప్లయితొలగించండిభాష తీరుల పెంపుకు బాట యౌను
పట్టు దలయుంచి సాధించ భవ్య మిదియె
ఎంత కాలమైన గడుచు నింత లోనె !!
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
గురువుగారు,
రిప్లయితొలగించండిధన్యురాలను.
విజ్ఞాన మొసగి జనులన్
రిప్లయితొలగించండిప్రజ్ఞావంతులను జేయు పదబంధములే
ప్రాజ్ఞతతో పూరింపగ
సుజ్ఞానము గలిగి ధరను శోభిల్లురుగా !!!
మెదడునకు కావలసినట్టి మేతనిడుచు
రిప్లయితొలగించండిగళ్ళనుడికట్టు ముదమును కలుగజేయు
పిల్లలును పెద్ద వారలు ప్రీతితోడ
నాడుచుందురు దీనిని వేడుకగను
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
గడులన్ పదములనింపగ
రిప్లయితొలగించండివడిగా గళ్ళనుడికట్టు భవ్యక్రీడన్
తడుముకొనుచు పదములకై
నడిసంద్రపునావరీతి నల్లాడవలెన్
పద నుడికారము దెలిసిన
రిప్లయితొలగించండినిది సులభతరంబటంచు నెంచినవారై
పదపడి పూరణ కేగిన
మొదలగు క్లిష్టతరభావములు మీ మదిలో.
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
భాషయందు పట్టు బాగుగా చూపెట్టు
రిప్లయితొలగించండికళయె పట్టుబడును కలము బట్టి
అడ్డనిలువు గనుచు నా గళ్ళనుడికట్టు
పట్టుబట్టి నింపు వారికెపుడు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.